Posts

Showing posts with the label comprising Justices Joymala Bagchi

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు రాజ్యాంగబద్ధతను సమర్థించిన సుప్రీంకోర్టు

Image
ఎ న్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియకు రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ ప్రక్రియ ఎన్నికల పారదర్శకతను, విశ్వసనీయతను బలోపేతం చేయడానికేనని, ప్రజాప్రతినిధుల చట్టానికి మరింత జీవం పోస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, న్యాయమూర్తులు జోయ్‌మాలా బగ్చి, విపుల్ ఎం పంచోలితో కలిసి ఈ తీర్పు వెలువరించింది. బీహార్ సహా పలు రాష్ట్రాల్లో చేపట్టిన SIR ప్రక్రియ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ అనంతరం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తీర్పు వెలువరిస్తూ కోర్టు నాలుగు ప్రధాన అంశాలను పరిశీలించినట్లు తెలిపింది. ఎన్నికల కమిషన్‌కు ఈ తరహా సవరణ చేపట్టే అధికారం ఉందా? ఈ ప్రక్రియ చట్టపరంగా సముచితమా? ప్రజాప్రతినిధుల చట్టం-1950కు విరుద్ధమా? ఓటరు జాబితాల్లో చేర్పు కోసం పౌరసత్వాన్ని పరిశీలించే హక్కు కమిషన్‌కు ఉందా? వంటి అంశాలపై ధర్మాసనం పరిశీలన జరిపింది. చివరకు ఎన్నికల కమిషన్ చర్యలు రాజ్యాంగబద్ధంగానే ఉన్నాయని సుప్రీంకోర్టు తేల్చింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని పేర్కొంది. ఓటరు జాబితాల్...