Posts

Showing posts with the label 11న హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ ఆవిష్కరణ

11న హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ ఆవిష్కరణ !

Image
దే శీయ మార్కెట్లో హ్యుండాయ్ మోటార్స్ ఇండియా ఎస్‌యూవీ క్రెటా ఎన్ లైన్  కారును ఈ నెల 11న ఆవిష్కరించనున్నది. హ్యుండాయ్ డీలర్ల వద్దకు క్రెటా ఎన్ లైన్ కార్లు వచ్చి చేరుతున్నాయి. ఆసక్తి గల కస్టమర్లు రూ.25 వేలు టోకెన్ సొమ్ము చెల్లించి 2024 క్రెటా ఎన్ లైన్ బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు ఆన్‌లైన్‌లోగానీ, హ్యుండాయ్ సిగ్నేచర్ డీలర్‌షిప్‌ల వద్ద గానీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2024 హ్యుండాయ్ క్రెటా కారు ధరలు రూ.11 లక్షల (ఎక్స్ షోరూమ్‌) నుంచి రూ.20.15 లక్షల (ఎక్స్ షోరూమ్‌) వరకు ధర పలుకుతాయి. అయితే, క్రెటా ఎన్ లైన్ కార్ల ధరలు సుమారు రూ.19-20 లక్షలు (ఎక్స్ షోరూమ్‌) పలుకుతాయని భావిస్తున్నారు. డబ్ల్యూఆర్‌సీ కార్ల స్ఫూర్తితో క్రెటా ఎన్ లైన్ డిజైన్ చేసినట్లు హ్యుండాయ్ తెలిపింది. ఎన్ లైన్ ఎంబ్లమ్‌తోపాటు న్యూ స్పోర్టీ ఫ్రంట్ గ్రిల్లె, రెడ్ అసెంట్స్‌తోపాటు అగ్రెస్సివ్ ఫ్రంట్ బంపర్‌, న్యూ సైడ్ స్కర్ట్స్‌, ఎన్ లైన్ బ్యాడ్జింగ్‌తోపాటు 18-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌, రెడ్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్ జత చేశారు. స్పోర్టీ డిజైన్‌తో రేర్‌లో ట్విన్ టిప్ ఎగ్జాస్ట్‌, స్టాండర్డ్ క్రెటా కంటే స్పోర్టియర్‌గా, రాస్పియర్...