నైజీరియాలోని ఈశాన్య ప్రాంతమైన బొర్నో రాష్ట్రంలో కలరా తీవ్ర భయాందోళనలను సృష్టిస్తోంది. గడిచిన రెండు నెలల కాలంలోనే ఈ మహమ్మారి కారణంగా దాదాపు 200 మంది ప్రాణాలు వదిలారని 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' స్పష్టం చేసింది. స్థానిక ప్రభుత్వ రికార్డుల ప్రకారం, జులై 12 నాటికి 198 మరణాలు సంభవించగా, 35,500 కంటే ఎక్కువ మంది ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. అకస్మాత్తుగా పెరుగుతున్న కేసుల వల్ల స్థానిక ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రోగులతో కిటకిటలాడుతూ తీవ్ర నిధుల, వసతుల కొరతను ఎదుర్కొంటున్నాయి. పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో లేకపోవడం, అరకొర పారిశుధ్య నిర్వహణ మరియు వైద్య వసతుల లోపమే ఈ స్థాయిలో వ్యాధి విస్తరించడానికి కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్‌లో సంభవించిన వర్షాలు, వరదల వల్ల కలరా ప్రమాదం ఉందని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ 10 రాష్ట్రాలను ముందే అప్రమత్తం చేసినప్పటికీ, బొర్నోలో పరిస్థితి నిమిషనిమిషానికి దిగజారింది. ఈ సంక్షోభాన్ని అదుపు చేసేందుకు నైజీరియా ప్రభుత్వంతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, మరియు ఎంఎస్ఎఫ్ సంస్థలు సంయుక్తంగా బాధితులకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్థానిక యంత్రాంగం నిరోధక చర్యలను వేగవంతం చేసింది. కలుషితమైన డ్యామ్‌లు, జలాశయాల నీటిని తాగవద్దని ప్రజలకు సూచిస్తూ ఆంక్షలు విధించింది. వీటికి ప్రత్యామ్నాయంగా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తోంది.
3
Beranda › Posts filed under 35
Showing posts with label 35. Show all posts
Showing posts with label 35. Show all posts
తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం
తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తంగా 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2,829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 5,45,026, 85 సంవత్సరాలు దాటిన సీనియర్ ఓటర్లు 2,22,091, ఎన్ఆర్‌ఐ ఓటర్లు - 3,591, ప్రత్యేక ప్రతిభావంతులు ఓటర్లు - 5,26,993, శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది, అత్యల్పంగా భద్రాచలంలో 1,54,134 ఓటర్లు ఉన్నారు
టెల్ అవీవ్‌కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలని పాలస్తీనా మద్దతుదార్ల ఆందోళన !
గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ముగించాలని, టెల్ అవీవ్‌కు అగ్రరాజ్యం మద్దతు ఆపేయాలని పాలస్తీనా మద్దతుదార్ల ఆందోళనతో అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం పరిసరాలు దద్దరిల్లాయి. దాదాపు 35,000 మంది నిరసనకారులు దీనిలో పాల్గొన్నారు. వీటిని ముందే ఊహించిన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనలకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఆందోళనల్లో పాల్గొన్న వారు చాలా మంది ఎర్రని వస్త్రాలు ధరించి, ఫ్రీ పాలస్తీనా, ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం ఆపేయాలని నినాదాలు చేశారు. కొందరు ఆందోళనకారులు దాదాపు రెండు మైళ్ల పొడవైన బ్యానర్‌ను శ్వేత సౌధం వద్ద ప్రదర్శించారు. ఆపరేషన్ రఫాలో ఇజ్రాయెల్ రెడ్‌లైన్ దాటడంపై నిరసనగా దీనిని ప్రదర్శించారు. యుద్ధం మొదలైన నాటి నుంచి రఫాలోనే పాలస్తీనా వాసులు తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. పొగ వెదజల్లే వస్తువులను శ్వేత సౌధ ప్రాంగణంలోకి నిరసనకారులు విసిరేశారు. ఈ సమయంలో అధ్యక్షడు జోబైడెన్, ఆయన సతీమణి జిల్ ఇంట్లో లేరు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న డీడే స్మారక కార్యక్రమల్లో పాల్గొననున్నారు. మరోవైపు వాషింగ్టన్ డీసీ మెట్రో పోలీసులు, సీక్రెట్ సర్వీస్ విభాగం దీనిపై స్పందిస్తూ తాము ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని వెల్లడించారు. నేరుగా శ్వేత సౌధానికి వెళ్లే రహదారి సహా పలు మార్గాలను మూసివేశారు. అమెరికాలో గత నెలలో పాలస్తీనా అనుకూల ఆందోళనలు మొదలయ్యాయి. విద్యాసంస్థల్లో తీవ్ర స్థాయిలో ఇవి జరుగుతున్నాయి. ఈ ఆందోళనల దెబ్బకు వంతెనలు, వైట్‌హౌస్‌కు దారి తీసే రోడ్లను మూసేసి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
Subscribe to:
Posts (Atom)