తమిళనాడులోని చెన్నై- తిరుచ్చి జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా వరదయ్యపాళెం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అయ్యప్ప భక్తులంతా ఒక మినీ బస్సులో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యలో టీ తాగేందుకు రహదారి పక్కన ఉన్న ఒక దుకాణం వద్ద తమ మినీ బస్సును నిలిపారు. అదే సమయంలో కంభం నుండి చెన్నై వైపు వేగంగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి, ముందుగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టి, ఆపై అయ్యప్ప భక్తుల మినీ బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులను తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం పదిరికుప్పం గ్రామానికి చెందిన తిరుపతి, తమిళనాడులోని గుమ్మిడిపూండికి చెందిన ముకుందన్గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని రవి ఆచారి, కన్నయ్య, శేఖర్, సూర్య, వేలాయుధం, ప్రకాష్, రమేష్, మునేంద్ర, దాము, యోగేష్ మరియు చంద్రారెడ్డిగా గుర్తించారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం దిండివనం, విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
3
Beranda › Posts filed under 2 dead
Showing posts with label 2 dead. Show all posts
Showing posts with label 2 dead. Show all posts
Subscribe to:
Posts (Atom)
