వందే భారత్ స్లీపర్ రైళ్ల భోజనంలో కీలక మార్పులు చేయాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ ప్రయాణం చేసే వందే భారత్ స్లీపర్ రైళ్లలో తక్కువ వంటకాలతో, ఎక్కువ నాణ్యత గల ఆహారాన్ని ప్రయాణికులకు అందించేందుకు రైల్వే సిద్దమవుతోంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా విమానాల తరహాలో టిఫిన్, మధ్యాహ్న, రాత్రి భోజనంలో వంటకాల సంఖ్య తగ్గించి, నాణ్యతగా అందించాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి ముంబై-బెంగళూరు, హౌరా-కామాఖ్య, న్యూఢిల్లీ-వారణాసి మధ్య నడుస్తున్న మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఈ కొత్త మెనూ అందిస్తారు. ఆ తర్వాత దశలవారీగా మిగతా ప్రీమియర్ రైళ్లకూ విస్తరిస్తారు. ప్రస్తుతం ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఐఆర్సీటీసీ టిఫిన్ గా చట్నీ సాంబార్ ఇడ్లీ, వడ లేదా పోహా, ఉప్మాను అందిస్తోంది. అలాగే మధ్యాహ్న, రాత్రి భోజనంలో చపాతీ, అన్నం, పప్పు, చికన్ లేదా కూరగాయల వంటకాలు ఉంటాయి. వీటి స్ధానంలో ఇప్పుడు మరింత రుచికరమైన, తక్కువ మెనూతో వంటకాలు అందిస్తారు. వీటిలో టిఫిన్ లో సూప్, ఎగ్ ఆమ్లెట్, శాండ్ విచ్, మజ్జిగ, చాక్లెట్లు, మధ్యాహ్న, రాత్రి భోజనాల్లో పొడి కూర, పెరుగు, సలాడ్, ఊరగాయ, స్వీట్లు ఉంటాయి. తాజా మార్పుల తర్వాతా ఒక పూట భోజనం మొత్తం బరువు 700-750 గ్రాముల నుంచి 450-500 గ్రాములకు తగ్గినట్లు రైల్వేవర్గాలు చెప్తున్నాయి. క్లౌడ్ కిచెన్ సదుపాయం అమలు చేయడం ప్రారంభించాక ప్రయాణికుల నుంచి భోజన ఫిర్యాదులు 10 శాతం తగ్గినట్లు చెప్తున్నారు.
3
Beranda
› Fewer Dishes
› Higher Quality Food
› indian railways
› national
› Significant Changes to Meals on Vande Bharat Sleeper Trains
› వందే భారత్ స్లీపర్ రైళ్ల భోజనంలో కీలక మార్పులు : తక్కువ వంటకాలతో, ఎక్కువ నాణ్యత గల ఆహారం
Subscribe to:
Post Comments (Atom)
