About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label 2Andhra Pradesh. Show all posts
Showing posts with label 2Andhra Pradesh. Show all posts

చెక్ బౌన్స్ కేసును సెటిల్ చేసుకున్న బండ్ల గణేష్

టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు సంబంధించిన చెక్ బౌన్స్ కేసు వివాదం ఎట్టకేలకు సుఖాంతమైంది. బండ్ల గణేష్, జెట్టి వెంకటేశ్వరరావు మధ్య నడుస్తున్న ఆర్థిక లావాదేవీలు, చెక్ బౌన్స్ వివాదంలో కోర్టు బండ్ల గణేష్‌కు శిక్ష విధించింది. చివరికి బండ్ల గణేష్ రాజీ చేసుకున్నారు. ఇరువురి మధ్య సామరస్యపూర్వక చర్చలతో సమసిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ఫిర్యాదుదారుడైన జెట్టి వెంకటేశ్వరరావు అధికారికంగా ప్రకటించడంతో, ఇన్నాళ్లు ఈ కేసు చుట్టూ సాగిన ఊహాగానాలకు తెరపడింది. బండ్ల గణేష్‌తో ఉన్న ఆర్థిక వివాదాన్ని పరస్పర అవగాహనతో సెటిల్ చేసుకున్నట్లు జెట్టి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తమ మధ్య తలెత్తిన చిన్నపాటి మనస్పర్థలను ఆసరాగా చేసుకుని, కొంతమంది కావాలనే అపార్థాలు సృష్టించి తప్పుడు ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. బండ్ల గణేష్‌తో తనకు ఉన్న వివాదం పూర్తిగా పరిష్కారమైందని, ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని ఆయన తేల్చిచెప్పారు. తనకు, బండ్ల గణేష్‌కు మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహం, అనుబంధం ఉందని, ఆ బంధం మునుపటిలాగే కొనసాగుతుందని జెట్టి వెంకటేశ్వరరావు వెల్లడించారు. చట్టపరమైన అంశాలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకున్నామని, ఇకపై తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టతనిచ్చారు. వివాదం సమసిపోయిందని జెట్టి వెంకటేశ్వరరావు స్వయంగా ప్రకటించడంతో ఈ వ్యవహారానికి శుభం కార్డు పడినట్లయింది.

Read More...