ఛాతీ ఎక్స్‌రేల్లో క్యాన్సర్ లక్షణాలను గుర్తించడంలో వైద్యులకు రెండో కన్నులా కృత్రిమ మేధ పనిచేస్తోంది. సాధారణంగా గుర్తించడం కష్టమైన సూక్ష్మమైన మార్పులను సైతం ఏఐ సాఫ్ట్వేర్ గుర్తిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌లోని కెట్టరింగ్, నార్తాంప్టన్ జనరల్ ఆసుపత్రుల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఎన్హెచ్ఎస్ ఇంగ్లండ్ నిధులతో 2024 నవంబర్‌లో దీన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 62,661 ఛాతీ ఎక్స్‌రేలను ఏఐ సాయంతో పరిశీలించినట్లు కెట్టరింగ్ జనరల్ హాస్పిటల్ ఎన్హెచ్ఎస్ ట్రస్ట్ తెలిపింది. ఎక్స్‌రేల్లో అనుమానాస్పద ప్రాంతాలను ఏఐ గుర్తించిన తర్వాత రేడియాలజీ బృందం వాటిని పరిశీలించి, తదుపరి పరీక్షలు అవసరమా లేదా అనేది నిర్ణయిస్తుందని ట్రస్ట్ వివరించింది. దీంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ అనుమానం ఉన్నవారికి త్వరగా పరీక్షలు నిర్వహించడంతోపాటు అత్యవసర కేసులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని పేర్కొంది. ఏఐ వినియోగంతో వైద్యుల తుది నిర్ణయంపై నమ్మకం పెరుగుతోందని కన్సల్టెంట్ రేడియోగ్రాఫర్ కార్నిలియస్ ముషాంబి తెలిపారు. కొన్ని సందర్భాల్లో రోగులు ఆసుపత్రి నుంచి వెళ్లేలోపే ఎక్స్‌రేతోపాటు సీటీ స్కాన్ కూడా పూర్తి చేసి నివేదికలు అందించవచ్చని, సాధారణంగా ఈ పరీక్షల మధ్య కొన్ని రోజుల వ్యవధి ఉంటుందని వివరించారు. అలాగే ఏఐ గుర్తించిన వివరాలను అత్యవసర విభాగం సహా ఇతర వైద్య బృందాలకు అందుబాటులోకి తెచ్చే అంశంపై చర్చలు జరుగుతున్నాయని ట్రస్ట్ పేర్కొంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో తీవ్రమైన సమస్యలను త్వరగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే, ఏఐ వైద్యుల నైపుణ్యానికి ప్రత్యామ్నాయం కాదని, ప్రతి ఎక్స్‌రేను వైద్యులు పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. బ్రిటన్‌లో ఏటా సుమారు 70 లక్షల ఛాతీ ఎక్స్‌రేలు తీస్తుండగా, క్యాన్సర్ మరణాల్లో ఐదో వంతు ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్లే సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
3
Beranda
› Artificial Intelligence acts as a 'second pair of eyes' for doctors in detecting signs of cancer
› British general hospital adopts this technology
› medical
› technology
› క్యాన్సర్ లక్షణాలను గుర్తించడంలో వైద్యులకు రెండో కన్నులా కృత్రిమ మేధ : ఈ సాంకేతికతను వినియోగిస్తున్న బ్రిటన్‌లోని జనరల్ హాస్పిటల్
Subscribe to:
Post Comments (Atom)
