3

ఉత్తరాఖండ్‌లో అదుపుతప్పి వంతెన పైనుంచి లోయలో పడిన బస్సు : 8 మంది మృతి, 26 మందికి గాయాలు

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గఢ్వాల్ జిల్లా గూలర్ బజార్ సమీపంలో మంగళవారం ఉదయం సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు అదుపుతప్పి వంతెన పైనుంచి దాదాపు 100 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లడంతో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర విపత్తు స్పందన దళం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లోయలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి, అంబులెన్సుల ద్వారా సమీప ఆస్పత్రులకు తరలించారు. తెహ్రీ జిల్లా కలెక్టర్ నితికా ఖండేల్వాల్, ఎస్పీ శ్వేతా చౌబే సహాయక చర్యలను పర్యవేక్షిస్తుండగా, ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Related Post

Previous
Next Post »