ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 72 డివిజన్లతో పాటు మేయర్‌గా కూడా ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని, నగర ప్రజలు వారికి ఓట్లేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ విజ్ఞప్తి చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో ఘోరంగా విఫలమయ్యాయని, పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. స్దానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను అద్భుతంగా జరగాలని, నది ప్రక్షాళన చేయాలన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. పోటీచేయాలనుకునే అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంప్రదించి నామినేషన్ వేస్తే వారి పేర్ల జాబితాలను పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డికి పంపుతామని, ఆమె తుది జాబితాను విడుదల చేస్తారని వారికి పార్టీ తరపున బి`ఫారాలు ఇస్తామని తెలిపారు. మేయర్ పదవికి ఇప్పటివరకు ఆరుగురు అభ్యర్థులు పోటీచేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారని, కార్పొరేటర్ అభ్యర్థులుగా కూడా చాలా మంది ఆశావహులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో వేసిన ఫ్లెక్సీని తమ పార్టీకే చెందిన పట్నాల శ్రీనివాసరావు, కొవ్వూరి శ్రీనివాస్, కాటం రవి ధ్వంసం చేసారని, దీనిపై త్రీ టౌన్ పిఎస్‌లో ఫిర్యాదు చేస్తే సీసీ టివి ఫుటేజీల ఆధారంగా ఎఫఐఆర్, చార్జ్ షీట్ వేయడం జరిగిందన్నారు. కూటమితో పాటు ప్రధాన పార్టీల నుంచి మేయర్‌గా పోటీచేసే అభ్యర్ధులు గోదావరి పుష్కరాల నాటికి భక్తుల పుణ్యస్నానాలకు, ఆచమనం చేయడానికి శుద్ధమైన నీరు అందించేందుకు ఎలా కృషిచేస్తారో చెప్పాలని కోరారు. తన వద్ద దానికి సంబంధించిన కార్యాచరణ ఉందని, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే చేసి చూపిస్తామన్నారు. బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ 11 గ్రామాలను కలిపి గ్రేటర్ రాజమండ్రిగా మార్చారని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటారని స్పష్టం చేసారు. మంచి ఫలితాలు సాధించడంతో పాటు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుని కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు కృషిచేస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ పాలన అస్తవ్యస్తంగా ఉందని, రాష్ట్రంలో కూడా ఎన్‌డిఎ కూfమే అధికారంలో ఉన్నందున ఆ ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా కాంగ్రెస్‌కు కలిసొస్తుందన్నారు. ఎన్‌డిఎ అరాచక పాలనను తిప్పికొట్టే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని, ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. దేశంలో రాహుల్ గాంధీని, రాష్ట్రంలో షర్మిళారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు సమిష్టిగా కృషిచేస్తామన్నారు. అనంతరం క్వారీ ప్రాంతంలోని 70, 71, 72 డివిజన్ల నుంచి 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. మేయర్ అభ్యర్థి మోతా సుధీర్ కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకోగా ఆయనకు పుష్పగుచ్చం అందచేసి అభినందించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, దేవత సుధాకర్, తాడి సూరిబాబు, డాక్టర్ రాజశేఖర్, బర్రే సుబ్రహ్మణ్యం, సింధియా రాణి, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, ఏసు, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
3
Beranda
› Andhra Pradesh
› Congress Parliamentary Coordinator T.K. Visweswara Reddy
› Congress to Contest All 72 Divisions
› Mayoral Post in Rajahmundry Corporation Elections
› రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో 72 డివిజన్లతో పాటు మేయర్ స్థానానికి కాంగ్రెస్ పోటీ
Subscribe to:
Post Comments (Atom)
