3

మధురై తనిష్క్ బంగారం షాపు చోరీ కేసు : ప్రధాన నిందితుడు నిషాంత్ అరెస్ట్ : 11 కేజీల బంగారం స్వాధీనం

తమిళనాడు లోని మధురై తనిష్క్ బంగారం షాపు చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారివద్ద నుండి 11 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం ధర రూ.15 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. కేసులో నిషాంత్ ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు షాపు చుట్టూ మూడుసార్లు రెక్కీ చేసి తరవాత చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. కస్టమర్ వేషంలో మూడు సార్లు షాపుకు వెళ్లి అక్కడ లూప్ హోల్స్ గుర్తించినిట్టు విచారణలో తేలింది. సీసీటీవీ ఆధారంగానే నిందితుడు నిషాంత్‌ను పోలీసులు గుర్తించారు. ప్రియురాలు మీనాక్షి కోసమే నిషాంత్ ఈ దోపిడీకి పాల్పడినట్టు విచారణలో తేలింది. షోరూంలో అలారం బంద్ చేసి ఉండటం, అప్పుడే కన్ స్ట్రక్షన్‌లో ఉండటం వల్ల లాకర్ పూర్తిస్థాయిలో నిర్మించకపోవడం వల్ల చోరీ సులువుగా చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్, నిషాంత్ ప్రియురాలు మీనాక్షిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు కేసుతో ప్రమేయం ఉన్న మరో 8మందిని సైతం అదుపులోకి తీసుకున్నారు. 

Related Post

Previous
Next Post »