3

తీన్మార్ మల్లన్నపై దాడి బీసీ సమాజంపై జరిగిన దాడి

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నపై మోత్కూరు మండలంలో జరిగిన దాడిని ఆ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ తీవ్రంగా ఖండించారు. తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, బీసీ సమాజ ఆత్మగౌరవ పోరాటం, రాజ్యాధికార ఆకాంక్షపై జరిగిన దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న గోల్కొండ కోట నుంచి తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ప్రారంభమైన బీసీ రాజ్యాధికార యాత్ర 50 రోజులుగా విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ యాత్రలో భాగంగా మోత్కూరు మండలంలో జరిగిన ఘటనను బీసీ ఉద్యమ గొంతుకను అణచివేసే ప్రయత్నంగా అభివర్ణించారు. బీసీ ఉద్యోగుల హక్కులు, కార్మికుల సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగుల సమస్యలపై సాగుతున్న పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నాలను సహించబోమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసు శాఖ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, తీన్మార్ మల్లన్నకు జెడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బీసీ రాజ్యాధికార సాధన కోసం తమ పోరాటం ఆగదని, తీన్మార్ మల్లన్నకు బీసీ సైనికులంతా అండగా ఉంటారని దండు వినోద్ స్పష్టం చేశారు.

Related Post

Previous
Next Post »