అమెరికాలో విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వేలాది విమానాలు రద్దు కావడం, మరికొన్ని వేల సర్వీసులు ఆలస్యంగా నడుస్తుండటంతో దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాలు అస్తవ్యస్తంగా మారాయి. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయాల్లో ఎక్కడ చూసినా ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. విమానాల కోసం గంటల తరబడి ఎదురుచూస్తూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో ఇప్పటివరకు 5,300కు పైగా విమానాలు రద్దు కాగా.. మరో 10 వేలకుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తమ విమానాలు రద్దు కావడంతో ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్ల కోసం ప్రయాణికులు రీబుకింగ్ కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. టికెట్ల మార్పు, కొత్త విమానాల బుకింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. అమెరికాలో విమానాల రాకపోకలపై విధించిన గ్రౌండ్‌స్టాప్‌ను అధికారులు ఎత్తివేశారు. విమానాలు టేకాఫ్ అయ్యేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు కూడా ఇచ్చింది. అయినప్పటికీ విమాన సర్వీసులు సాధారణ స్థితికి చేరుకోలేదు. అనేక విమానాలు నిర్ణీత సమయానికి బయలుదేరకపోవడంతో ఆలస్యాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రద్దయిన విమానాల కారణంగా ఏర్పడిన ప్రభావం ఇతర సర్వీసులపైనా పడుతోంది. విమానాల రద్దు, ఆలస్యాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ గమ్యస్థానాలకు ఎప్పుడు చేరుకుంటామో తెలియక ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారు, కనెక్టింగ్ ఫ్లైట్లు ఉన్నవారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. విమానాశ్రయాల్లోనే గంటల తరబడి గడపాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
3
Beranda
› Air Travel Across the Country Thrown into Chaos
› international
› US Aviation Sector Faces Severe Crisis
› తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అమెరికా విమానయాన రంగం : దేశవ్యాప్తంగా అస్తవ్యస్తంగా మారిన విమాన ప్రయాణాలు
Subscribe to:
Post Comments (Atom)
