తెలంగాణ లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యేక ఇంటర్మీడియట్ బోర్డు విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, దాని స్థానంలో సీబీఎస్ఈ , ఐసీఎస్ఈ బోర్డుల తరహాలో 10+2 విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ నూతన విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణను, విధివిధానాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నూతన సంస్కరణ ప్రకారం.. ప్రస్తుతం స్వతంత్రంగా పనిచేస్తున్న ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి, ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో అధికారికంగా విలీనం చేయనున్నారు. దీనివల్ల 10వ తరగతి అనంతరం విద్యార్థులు వేర్వేరు జూనియర్ కళాశాలల్లో చేరాల్సిన అవసరం లేకుండా, పాఠశాల ప్రాంగణాల్లోనే నేరుగా 11వ తరగతి, 12వ తరగతి విద్యను అభ్యసించే అవకాశం లభిస్తుంది. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన విద్యను నిరంతరాయంగా అందించడం, పదో తరగతి తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి బాలికల్లో పెరుగుతున్న డ్రాపౌట్లను అరికట్టడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కేవలం సర్టిఫికెట్ల కోసమే కాకుండా.. 12వ తరగతి పూర్తయ్యే సమయానికి విద్యార్థుల్లో స్వయం ఉపాధి, ఉన్నత విద్యకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని జోడించేలా పాఠ్యప్రణాళికను రీ-డిజైన్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్ తరగతులు, ల్యాబ్‌లు, లైబ్రరీలను బలోపేతం చేయడంతో పాటు పౌష్టికాహారాన్ని అందించి అన్ని వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
3
Beranda
› 10+2 Education System in Telangana
› Chief Minister Revanth Reddy has decided
› similar to the systems followed by the CBSE and ICSE boards
› తెలంగాణలో 10+2 విద్యా విధానం
Subscribe to:
Post Comments (Atom)
