కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేపై షహాపుర్ తాలూకాలోని ఇబ్రహీంపూర్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాధితులు మహారాష్ట్ర పరిధిలోని తుల్జాపూర్‌లో ఉన్న ప్రసిద్ధ భవానీ దేవి ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వేగంగా ఉన్న కారు నేరుగా బ్రిడ్జి పియర్ నిర్మాణాన్ని ఢీకొట్టి తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతులను గురురాజ్ సురేష్ చవాన్ (29), రెడ్డి బాగ్లా రాథోడ్ (33), గోవింద సీత్య చవాన్ (28), కుమార్ రాము రాథోడ్ (26)లుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న షహాపుర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
3
Beranda
› along the Surat-Chennai Expressway
› Car loses control and crashes into a bridge under construction
› Four dead
› karnataka
› Shahapur taluka
› Yadgir district
› అదుపుతప్పి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని ఢీకొట్టిన కారు : నలుగురు దుర్మరణం
Subscribe to:
Post Comments (Atom)
