3

స్వయం సహాయక సంఘాల మహిళలు, స్థానిక రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి

తెలంగాణలోని వికారాబాదు జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలు, స్థానిక రైతులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడంలో మహిళలే కీలక శక్తులని, స్వయం సహాయక సంఘాలకు పూర్తి ఆర్థిక భరోసా కల్పిస్తూ మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అలాగే మహిళను కోటీశ్వరులు గా మార్చడానికి తాను రోజుకు 18 గంటల సమయం వర్క్ చేస్తున్నానని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు సంప్రదాయ సాగును విడనాడి ఆరుతడి, ఉద్యాన పంటల వైపు మళ్లాలని సీఎం సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 వేల కోట్లకు పైగా నిధులతో ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ద్వారా త్వరలోనే సాగునీరు అందిస్తామన్నారు. భూసేకరణలో గతంలో లేని విధంగా ఎకరానికి రూ.20 లక్షల వరకు పరిహారం ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్న ట్లు చెప్పారు. గత పదేళ్ల పాలనలో కొడంగల్, పాలమూరు ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేసిన బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకునేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. "నా ప్రియమైన కొడంగల్ అక్కాచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, రైతు సోదరులకు నమస్కారాలు. నా రాజకీయ ఎదుగుదలకు, నన్ను ఈ స్థాయికి చేర్చడానికి కొడంగల్ ప్రజలే కారణం. అందరికీ దీపావళి ఒకరోజైతే, నా కుటుంబమైన కొడంగల్ ప్రజల మధ్య ఉన్న నాకు ప్రతిరోజూ పండుగే. మీకంటే నాకు ఆత్మబంధువులు ఎవరూ లేరు. మీరు ఇచ్చిన ఈ అవకాశంతో మూడేళ్లలోనే ఇక్కడి దశాబ్దాల సమస్యలను పరిష్కరించి, కొడంగల్‌ను దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళా స్వయం సహాయక సంఘాలే (SHG) పట్టుగొమ్మలు. మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ఇందుకోసం ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు, మార్కెటింగ్ సౌకర్యాలు, ఉత్పత్తుల తయారీకి అవసరమైన ఆధునిక శిక్షణను అందిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Related Post

Previous
Next Post »