3

లాస్ ఏంజెల్స్ మేయర్ ఎన్నికలు : ఆధిక్యంలో కొనసాగుతున్న నిత్యా రామన్

అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలున్న లాస్ ఏంజెల్స్ మేయర్ ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన నిత్యా రామన్ సంచలనం సృష్టించారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌తో జరిగిన హోరాహోరీ పోరులో ఆమె ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో అమెరికాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన లాస్ ఏంజెలెస్‌కు తొలి మహిళా మేయర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఆమెకు దక్కనుంది. భారతీయ మూలాలున్న మహిళ ఈ స్థాయిలో కీలక పదవికి చేరువ కావడం ఆసక్తికరంగా మారింది. నవంబర్ 5 నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నిత్యా రామన్‌కు 4,05,193 ఓట్లు రాగా, కరెన్ బాస్‌కు 3,79,069 ఓట్లు వచ్చాయి. దాదాపు 67 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి నిత్యా రామన్ ఆధిక్యంలో ఉన్నారు. తుది ఫలితాలు వెలువడాల్సి ఉంది. నిత్యా రామన్ 1981లో కేరళలో జన్మించారు. ఆమెకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు కుటుంబం అమెరికాకు వెళ్లింది. అక్కడే చదువుకుని పెరిగిన ఆమె 22 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం పొందారు. చిన్నప్పటి నుంచే సామాజిక సమస్యలు, నగరాల అభివృద్ధిపై ఆసక్తి పెంచుకున్న నిత్యా.. ఉన్నత విద్యను కూడా అదే రంగంలో కొనసాగించారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. అనంతరం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి పట్టణ ప్రణాళికలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. రాజకీయాల్లోకి రాకముందు చెన్నైలో 'ట్రాన్స్‌పరెంట్ చెన్నై' పేరుతో ఒక పరిశోధనా సంస్థను స్థాపించారు. పారిశుధ్యం, రోడ్లు, ఇతర పౌర సదుపాయాల మెరుగుదలపై ఈ సంస్థ పనిచేసింది.

Related Post

Previous
Next Post »