అసోంలోని గౌహతి హోటల్‌లో ఐదుగురిని కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడు ఘనకాంత గొగోయ్ (34) బుధవారం తెల్లవారుజామున పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. శివసాగర్ జిల్లాలో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 26న గౌహతిలోని 'హోటల్ బిలాస్ ఇన్' లీజుదారుడైన ఘనకాంత గొగోయ్, ప్రాపర్టీ యజమానులతో ఏర్పడిన వివాదం కారణంగా లైసెన్స్‌డ్ .32 పిస్టల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో హోటల్ యజమాని కుటుంబానికి చెందిన భూదేవ్ భరాలి (65), ఆయన సోదరి హెలెనా (58), ఆమె కుమారుడు దేవర్షి కశ్యప్ (39), కోడలు రినీకా కశ్యప్ (30)తో పాటు హోటల్ సిబ్బంది నారాయణ్ దాస్ (48) అక్కడికక్కడే మృతి చెందారు. వీరి కారు డ్రైవర్ సత్యేంద్ర పాఠక్ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ దారుణం జరిగిన వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గౌహతి కోర్టు అతడికి ఏడు రోజుల పోలీసు రిమాండ్ విధించగా, అది ముగియడంతో మంగళవారం జైలుకు తరలించారు. అయితే, 2024 నాటి పాత బ్యాంక్ మోసం కేసులో శివసాగర్ పోలీసులు మంగళవారం రాత్రి అతడిని మళ్లీ అరెస్ట్ చేశారు. దర్యాప్తు నిమిత్తం శివసాగర్ తరలిస్తుండగా, బుధవారం తెల్లవారుజామున నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని, తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మరణించాడని అధికారులు వెల్లడించారు. నిందితుడు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడన్న వార్తతో బాధితుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అతడు బతికుంటే తమను కూడా చంపేస్తాడేమోనన్న భయంతో గడిపామని, ఈ మరణంతో మృతుల ఆత్మలకు శాంతి చేకూరిందని కుటుంబీకులు పేర్కొన్నారు. "ఇది దేవుడు చేసిన న్యాయం" అని మృతుల తల్లి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన అసోం ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు.
3
Beranda
› Accused killed in police firing
› Assam
› Case of the fatal shooting of five people at a Guwahati hotel
› national
› officers opened fire in self-defense after he attempted to escape from police custody
› గౌహతి హోటల్‌లో ఐదుగురిని కాల్చి చంపిన కేసు : పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన నిందితుడు
Subscribe to:
Post Comments (Atom)
