ఎలక్ట్రానిక్ భాగాల తయారీపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా మాఫీ కేంద్ర ప్రభుత్వం
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్ (స్మార్ట్ వాచీలు వంటివి), స్మార్ట్ టీవీల తయారీలో అత్యంత కీలకమైన భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మూడు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సుంకం మాఫీ తక్షణమే అమలులోకి రానుంది. స్థానిక పరిశ్రమలు స్థిరపడటానికి, దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించడానికి వీలుగా ఈ మినహాయింపును 2029 మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గడువు విధించింది. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి ప్రధానంగా నిలిచే మూడు భాగాల ఉత్పత్తిలో ఉపయోగించే వస్తువులపై ఈ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు వర్తిస్తుంది. డిస్ప్లే అసెంబ్లీలు: స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల స్క్రీన్ల తయారీకి ఇవి కీలకం. దేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకానికి ఈ నిర్ణయం ఊపునివ్వనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యూహాత్మక చర్య వల్ల ముడిసరుకు దిగుమతులపై ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుంది. దేశీయంగా విడిభాగాల తయారీ యూనిట్లు వేగంగా విస్తరిస్తాయి. తయారీ వ్యయం తగ్గడం వల్ల భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Comments
Post a Comment