Posts

Showing posts with the label 'We Are City 2026' Report

'ఈజ్ ఆఫ్ లివింగ్' లో హైదరాబాద్ నెంబర్ వన్ : 'వి ఆర్ సిటీ 2026' నివేదిక

Image
వ రల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన 'వి ఆర్ సిటీ 2026' నివేదికలో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో నిలవడం విశేషం. అందమైన చారిత్రక కట్టడాలు, నోరూరించే బిర్యానీ, ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు ఇవన్నీ ఒకెత్తయితే, సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు అందరికీ హాయిగా నివసించే అవకాశాన్ని కల్పించడంలో హైదరాబాద్‌కు సాటిలేదని మరోసారి రుజువైంది. అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజాగా ప్రకటించిన 'వి ఆర్ సిటీ 2026' నివేదికలో, దేశంలోని అన్ని మెట్రో నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ నెంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకుంది. హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధానంగా మూడు అంశాలు దోహదపడ్డాయి. మెట్రో రైలు విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, మెరుగైన రహదారులతో మౌలిక సదుపాయాల్లో నగరం దూసుకుపోతోంది. ముంబై, ఢిల్లీ లేదా బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో నిత్యావసరాలు, అద్దెలు ,రవాణా ఖర్చులు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే ఐటీ రంగం ఉన్నప్పటికీ, ఇక్కడి వాతావరణం, వినోద సౌకర్యాలు , ప్రజల జీవనశైలి మానసిక ప్రశాంతతను అందిస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం వివిధ విభాగాల్లో నగర...