ఫిబ్రవరి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ?
ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు సిద్ధమవుతుంది. ప్రతి సంవత్సరం డీఎస్సీని ప్రకటించి టీచర్ ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం, ఆ హామీకి అనుగుణంగా ఈ సంవత్సరం కూడా డీఎస్సీ నిర్వహణకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో దాదాపు 2500 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రద్దయిన జీవో 117 స్థానంలో తొమ్మిది రకాల పాఠశాలలను ప్రవేశపెట్టి, 9200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్స్ గా మార్చారు. ప్రతి తరగతికి ఒక టీచర్ నిబంధనతో అదనంగా ఒక వెయ్యి 146 మంది టీచర్ల అవసరమని గుర్తించారు. ఈ ఖాళీలతో కూడా కలిపి మొత్తం 2500 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి రెండవ వారంలో ఈ నోటిఫికేషన్ విడుదల అవుతుందని భావిస్తున్నారు. టీచర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయడం మాత్రమే కాక విద్యా ప్రమాణాలను పెంచడం పైన కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇక ...