Posts

Showing posts with the label banks of the Cauvery River in Tiruchirappalli to demand their share of Cauvery waters and to save their crops

వినూత్న రీతిలో నిరసనను వ్యక్తం చేసిన తమిళనాడు రైతులు

Image
త మిళనాడులో రైతులు కావేరీ జలాల సాధన, పంటలను కాపాడుకోవడం కోసం తిరుచిరాపల్లిలో కావేరీ నదీ తీరంలో రైతులు తమ శరీరాలను ఇసుకతో కప్పుకొని మరోసారి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు.  రైతు సంఘం నేత పీ అయ్యకణ్ణు నేతృత్వంలో జరిగిన ఈ నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సాగు చేస్తున్న ఖరీఫ్ పంటను కాపాడుకోవడానికి కర్ణాటక వెంటనే నీటిని విడుదల చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. కావేరీ జలాల వాటా విషయంలో కర్ణాటక అనుసరిస్తున్న వైఖరిపై తమిళనాడు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. కావేరీ నదిపై ఆధారపడే పంటలు ఎండిపోతున్నా కర్ణాటక ప్రభుత్వం స్పందించట్లేదని ఆరోపించారు. తమకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాను విడుదల చేయకుండా, వరదలు వచ్చినప్పుడు మాత్రమే మిగులు జలాలను వదులుతూ తమ రాష్ట్రాన్ని డ్రైనేజీలా చూస్తోన్నారని ఆరోపించారు. కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టుపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రైతులు. మేకేదాటు వద్ద కర్ణాటక కొత్తగా జలాశయాన్ని నిర్మిస్తే లోతట్టు ప్రాంతమైన తమిళనాడుకు నీటి కొరత మరింత తీవ్రతరమౌతుందని, ఎడారిగా మారుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కావే...