Posts

Showing posts with the label 200

ఫ్రాన్స్, స్పెయిన్‌లను దహించేస్తున్న కార్చిచ్చు : రెండు లక్షల మంది తరలింపు

Image
ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లోని పలు ప్రాంతాల్లో అడవి మంటలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎన్నడూ లేని స్థాయిలో ఎగసిపడుతున్న ఈ మంటల దెబ్బకు రెండు దేశాల్లో సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లినట్లు ది గార్డియన్ కథనం పేర్కొంది. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలుల కారణంగా ఈ మంటలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సైతం ఈ పరిస్థితిని అదుపు చేయలేక తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రముఖ నగరమైన బోర్డియక్స్ (Bordeaux) శివారు ప్రాంతాలు, జిరోండే సమీపంలో మంటలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. వేసవి సెలవులు గడిపేందుకు వచ్చిన పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రంగంలోకి దిగి సైన్యాన్ని మోహరించారు. యూరోపియన్ యూనియన్ సహాయం కూడా కోరారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ సమీపంలో కూడా మంటలు తీవ్రంగా చెలరేగడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

పెళ్లి వేడుకలో డబ్బులు వెదజల్లిన నిర్వాహకులు !

Image
ఉ త్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సిద్ధార్థనగర్‌లోని దేవల్వా గ్రామంలో ఓ పెళ్లి సందర్భంగా తీసిన వీడియో ఇది. ప్రస్తుతం ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనికి కారణం పెళ్లి ఊరేగింపులో ఆ కుటుంబీకులు చేసిన హడావుడి పెళ్లి బరాత్‌ సందర్భంగా వారు దాదాపు ఇరవై లక్షల రూపాయల నోట్ల కట్టలు గాలిలోకి వెదజల్లారు. పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న వ్యక్తులు కొందరు ఇంటి పైకప్పు, జేసీబీలపైకి ఎక్కి మరీ కరెన్సీ నోట్ల కట్టలను గాలిలోకి విసిరారు. ఇదంతా కొందరు వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్‌ చేయగా ఇప్పుడు అది వైరల్ అవుతోంది. వీడియోలో చాలా మంది గాలిలోకి నోట్లు విసురుతున్నట్లు కనిపిస్తోంది. 100, 200, 500 రూపాయల నోట్లను గాలిలోకి విసిరినట్లు సమాచారం. ఇందుకోసం వారు జేసీబీని కూడా పిలిపించారు. కొందరు దానిపై నిలబడి, మరికొందరు బిల్డింగ్ పైకప్పుపై నిలబడి కరెన్సీ నోట్లను జల్లుతున్నారు. ఈ నోట్లను సేకరించేందుకు చాలా మంది తరలివచ్చారు. వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్‌ చేశారు. అతను అంత పెద్ద దాత అయితే, కొంతమంది పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండాల...