జీపీఎస్ సేవల్లో అంతరాయం : నిలిచిపోయిన కీలక ఉపగ్రహం
దే శం గర్వించదగ్గ రీతిలో అభివృద్ధి చేసుకున్న స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ 'నావిక్' తీవ్ర సంక్షోభంలో పడింది. అమెరికాకు చెందిన జీపీఎస్ పై ఆధారపడకుండా, భారత్ సొంతంగా రూపొందించుకున్న ఈ వ్యవస్థలోని ఒక కీలక ఉపగ్రహం పనిచేయకపోవడంతో సేవలలో అంతరాయం ఏర్పడుతోంది. సాధారణంగా ఏదైనా నావిగేషన్ వ్యవస్థ కచ్చితమైన సమాచారాన్ని అందించాలంటే కనీసం నాలుగు ఉపగ్రహాల అనుసంధానం అవసరం. అయితే, నావిక్ కూటమిలోని ఎనిమిది ఉపగ్రహాలలో ప్రస్తుతం ఒక కీలక ఉపగ్రహం సాంకేతిక కారణాల వల్ల పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం. గత రెండు నెలలుగా ఈ సమస్య వేధిస్తున్నా, దాన్ని పునరుద్ధరించడంలో లేదా ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయడంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేవలం మూడు ఉపగ్రహాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో, సిగ్నల్స్ కచ్చితత్వంలో లోపాలు తలెత్తుతున్నాయి. నావిక్ వ్యవస్థ కేవలం సాధారణ పౌరుల కోసం మాత్రమే కాదు, దే...