Posts

Showing posts with the label complaint at the Patamata Police Station

కేశినేని నానిపై పోలీసులు కేసు నమోదు

Image
వి జయవాడ ఎంపీ చిన్నిపై ఈడీకి లెటర్ రాసిన మాజీ ఎంపీ కేశినేని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ కేశినేని చిన్నిపై ఇటీవల కేశినేని నాని సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. దీంతో కేశినేని నానిపై పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎంపీ కేశినేని చిన్ని. సోషల్ మీడియాలో తనపై అనుచిత పోస్టులు పెడుతున్నారంటూ కేశినేని చిన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేశినేని నానిపై FIR No:239/2026 U/s 204, 351, 352, 353, 356, 61 BNS and 66, 66(C ), 66(D), 67, 72 IT Act సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిఇలా ఉండగా ఎంపీ చిన్ని అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కి కేశినేని నాని రాశారు. కేశినేని చిన్ని కుటుంబంతో పాటు 'కేసిరెడ్డి నెట్‌వర్క్' ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరపాలని నాని డిమాండ్ చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వీరి వ్యాపారాలు, నెట్‌వర్క్‌లపై ఈడీ తక్షణమే విచారణ చేపట్టాలని ఆయన తన లేఖలో కోరారు. చిన్ని అనేక అక్రమాలకు పాల్పడ్డారని, దీని వెనుక పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఎంపీ కేశినేని చిన్ని చట్టాన్ని, న్యాయస్థ...