భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్న చైనా
చైనా భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుంది. గడిచిన 22 నెలలుగా ఏకంగా 20 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. దీంతో ఎందుకు చైనా ఇప్పుడు ఇంత బంగారం కొంటోందన్న చర్చ అంతర్జాతీయంగా మొదలైంది. ఇది ఏదో ఒక్క నెల తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం కాదు. రాబోయే దశాబ్ద కాలం కోసం పక్కా వ్యూహంతో ఆ దేశ కేంద్ర బ్యాంకు భారీ ప్రణాళికను అమలు చేస్తోందట. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులను ముందే పసిగట్టి తన ఖజానాను పటిష్టం చేసుకుంటోంది. గత నెలలో చైనా కొన్న 6.5 లక్షల ఔన్సుల బంగారం 2023 అక్టోబర్ తర్వాత నమోదైన అత్యధిక కొనుగోలుగా రికార్డుల్లోకెక్కింది. దీంతో ఆ దేశం వద్ద ఉన్న మొత్తం అధికారిక బంగారం నిల్వలు 7.67 కోట్ల ఔన్సులకు చేరాయి. సాధారణంగా ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా ఆగుతారు. కానీ చైనా మాత్రం దూకుడు కొనసాగిస్తూనే ఉంది. అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గుతుండటమే ఈ పరిణామాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గతంలో ప్రపంచ దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో డాలర్ వాటా 72 శాతం ఉండేది. ఇప్పుడది దాదాపు 55 శాతానికి పడిపోయింది. డాలర్ క్రమంగా తన పట్టు కోల్పోతుండటంతో ఇతర దేశాలు కూడా ప్రత్యామ్నాయాల వైపు వేగంగా దృష్టి పెడ...