రష్యా రాజధాని మాస్కోతోపాటు ఇరత ప్రాంతాలపై ఏకంగా 1,000కి పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 20 మంది వరకు గాయపడ్డారు. రష్యాలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం తుది దశ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ దాడి చేయడం కీలకంగా మారింది. శనివారం రాత్రి నుంచి ఉదయం వరకు ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద దాడి ఇదే అని విశ్లేషకుల అంచనా. ఈ దాడిపై మాస్కో మేయర్ సెర్గీ సొబ్యానిన్ మాట్లాడారు. రష్యా రాజధానిపై జరిగిన అతిపెద్ద దాడిగా ఆయన అభివర్ణించారు. మాస్కోలోని ఆయిల్ రిఫైనరీతోపాటు, ప్రజల నివాసాలపై కూడా దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో 74 ఏళ్ల ఒక వృద్ధుడు, 44 ఏళ్ల మహిళ ఉన్నారు. ఉక్రెయిన్ ప్రయోగించిన 1,100 డ్రోన్లను తాము కూల్చివేశామని రష్యా చెప్పంది. రష్యాలోని క్రిమియాతోపాటు నల్ల సముద్రంపై కూడా దాడి జరిగిందని తెలిపింది. మాస్కోపై ప్రయోగించిన 450 డ్రోన్లను తాము నిర్వీర్యం చేశామని రష్యా ప్రకటించింది. తమ దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్ని ఆపేందుకు ఉక్రెయిన్ ఈ దాడులకు దిగుతోందని రష్యా ఆరోపించింది.
3
Beranda › Posts filed under 20 injured
Showing posts with label 20 injured. Show all posts
Showing posts with label 20 injured. Show all posts
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు : ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు!
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున 65వ జాతీయ రహదారిపై ఐరన్ లోడుతో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడే యాక్సిడెంట్ కు కారణమని తెలుస్తుంది. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా తెల్లారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నారు. వీరిలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద శబ్దం విన్న స్థానికులు, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను క్షతగాత్రుల నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న కోదాడ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం తీవ్రంగా నుజ్జునుజ్జయ్యి, మృతదేహాలు బస్సులోనే చిక్కుకుపోవడంతో వాటిని వెలికితీయడానికి కష్టపడాల్సి వచ్చింది.
ప్రైవేట్ ట్రావెల్ బస్, టిప్పర్ ఢీ : 14 మంది దుర్మరణం, 20 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో స్థానిక పలకల క్వారీల సమీపంలో గురువారం ఉదయం ప్రైవేట్ బస్, టిప్పర్ ఢీకొనడంతో రెండు వాహనాలూ మంటల్లో చిక్కుకున్నాయి. బస్‌లో ప్రయాణిస్తున్న 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, మరికొందరు గాయపడినట్లు మార్కాపురం ఇంచార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. బస్‌లో ప్రయాణించినవారిలో 14 మంది చనిపోగా 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించామని వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఇంచార్జ్ ఎస్పీ తెలిపారు ప్రమాదానికి గురైన బస్ తెలంగాణలోని జగిత్యాల నుంచి కలిగిరికి వస్తోందని చెప్పిన ఆయన మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రయాణికులు ఉండొచ్చని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటివరకు 13 మృతదేహాలను బస్సు నుంచి వెలికి తీశామని మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్ చెప్పారు. మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
భోజనం చేస్తున్న కూలీల పైకి దూసుకుపోయిన కారు : ఇద్దరు మృతి, 20మందికి గాయాలు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో రోడ్డు పక్కన భోజనం చేస్తున్న కార్మికులపై వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇరవై మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళా కార్మికులు ఉన్నారు. వేగంగా వెళ్తున్న కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థలంలో తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు, పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జబల్పూర్‌లోని బరేలా హైవేపై వేగంగా వచ్చిన క్రెటా కారు గందరగోళానికి కారణమైంది. రోడ్డు పక్కన కూర్చుని భోజనం చేస్తున్న కార్మికులపై కారు వేగంగా దూసుకుపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కార్మికులు హైవేపై గ్రిల్‌కు పెయింట్ వేస్తున్నారు. గుర్తు తెలియని డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతని కోసం వెతకడం ప్రారంభించారు.
Subscribe to:
Posts (Atom)