October 2026

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా  గురజాల నియోజకవర్గం గురజాల పట్టణంలో వైసీపీ కార్యాలయం నుంచి ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేయటానికి వెళ్తున్న అభ్యర్థులను, ముఖ్య నాయకులు, కార్యకర్తలను 144 సెక్షన్ అమల్లో ఉందని గుంపులుగా వెళ్లకూడదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన కార్యకర్తలు వైసీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. తీవ్ర ఉద్రక్తత పరిస్థితిలో వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు వై మురళీధర్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి పోలు వీరారెడ్డి, తదితర ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

న్యూజిలాండ్‌ లోని క్రైస్ట్‌చర్చ్‌లో హాగ్లీ ఓవల్ వేదికగా జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌ చేసిన 225 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో భారత బ్యాటర్లు కీలక సమయాల్లో పరుగులు రాబట్టి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, భారత ఆటగాళ్లు సమర్థంగా ఛేదించడం విశేషం. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు అందించాడు. కేవలం 40 బంతుల్లోనే అజేయంగా 82 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు ఫిన్ అలెన్ 45 పరుగులు చేసి జట్టు స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించాడు. టిమ్ సీఫర్ట్ 24 పరుగులు చేయగా, డారిల్ మిచెల్ 28 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అతడు 17 పరుగుల వద్ద ఇచ్చిన అవకాశాన్ని భారత ఫీల్డర్లు అందిపుచ్చుకోలేకపోయినా, దానిని పెద్ద ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. బెవన్ జాకబ్స్ 16 బంతుల్లో 31 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 225/4 స్కోరుతో ఇన్నింగ్స్ ముగించింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ టిమ్ సీఫర్ట్‌ను ఔట్ చేసి తొలి వికెట్ అందించాడు. అనంతరం అక్షర్ పటేల్ ఫిన్ అలెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. అయితే ఫిలిప్స్ దూకుడును అడ్డుకోవడంలో భారత బౌలర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి కివీస్ భారీ స్కోరు సాధించింది. 225 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయే పరిస్థితి ఎదురైంది. అభిషేక్ శర్మ 93 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సంజూ శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 122 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడి పెరిగింది. అక్షర్ పటేల్ 167 పరుగుల వద్ద ఐదో వికెట్‌గా, శ్రేయస్ అయ్యర్ 210 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా వెనుదిరిగారు. అయినప్పటికీ భారత జట్టు పోరాటాన్ని కొనసాగించింది. ఛేదనలో నామన్ ధీర్ 42 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. అతడి సహకారంతో భారత్ 19.4 ఓవర్లలో 230/6 స్కోరు సాధించి విజయాన్ని సాధించింది. 

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం పేరిట నకిలీ వాట్సాప్ ఛానల్ నడుస్తున్నట్లు తేలడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు. 'డిప్యూటీ సీఎంవో, ఆంధ్రప్రదేశ్' పేరుతో ఒక వాట్సాప్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఈ ఛానల్‌కు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా స్పష్టం చేశారు. కార్యాలయ గుర్తింపును దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారం, సంబంధం లేని కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి ప్రయత్నాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఈ నకిలీ ఛానల్‌ను నమ్మవద్దని, అందులోని సమాచారాన్ని నమ్మకుండా, ఫార్వర్డ్ చేయకుండా ఉండాలని సూచించారు. అధికారిక సమాచారం కోసం కేవలం ధృవీకరించిన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్, అధికారిక వాట్సాప్ ఛానల్‌ను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని కోరారు. 

ఐక్యరాజ్యసమితి కౌంటర్-టెర్రరిజం నివేదికలో భారతదేశంపై చూపిన పక్షపాతంపై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అండర్‌వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, ఐరాస తన ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఘాటుగా స్పష్టం చేసింది. ఐరాస ప్రత్యేక ప్రతినిధి బెన్ సాల్ రూపొందించిన తాజా కౌంటర్-టెర్రరిజం నివేదికలో దావూద్ ఇబ్రహీం నాయకత్వంలోని ‘డీ-కంపెనీ’ని భారతదేశ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర ముఠాగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్త రఘూ పూరీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎటువంటి జవాబుదారీతనం లేకుండా, వాస్తవ విరుద్ధమైన సమాచారంతో నివేదికలు ఇవ్వడం ఐరాస విశ్వసనీయతకే తీవ్ర హాని కలిగిస్తుందని హెచ్చరించారు. ఐరాస వేదికగా రఘూ పూరీ మాట్లాడుతూ కీలక విషయాలను గుర్తుచేశారు. దావూద్ ఇబ్రహీం భారత్ నుంచి ఎప్పుడో పారిపోయాడని, ప్రస్తుతం అతడు పాకిస్థాన్‌లోనే ఆశ్రయం పొందుతున్నాడని పునరుద్ఘాటించారు. గతంలో ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను కూడా పాకిస్థాన్‌లోనే గుర్తించి హతమార్చిన విషయాన్ని ఈ సందర్భంగా భారత్ ఐరాసకు గుర్తుచేసింది. 1993 బొంబాయి పేలుళ్ల కేసు సమయం నుంచే దావూద్ భారత్‌కు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడని, అతడు దేశం వెలుపల ఉన్నప్పుడే అల్-ఖైదాతో సంబంధాల కారణంగా 2003లో ఐరాస ఆంక్షల జాబితా (1267 సమితి)లోకి వచ్చాడని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు, మూకలు తమ దుశ్చర్యలను కప్పిపుచ్చుకోవడానికి మానవ హక్కుల చట్రాన్ని వాడుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందని భారత్ మండిపడింది. మానవ హక్కుల వేదికలు ఉగ్రవాదులకు, తీవ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి రక్షణ కవచాలుగా మారకూడదని తేల్చిచెప్పింది. ఇదే సమయంలొ జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాలపై పాకిస్థాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలేనని ఐరాస వేదికగా స్పష్టమైన సంకేతం ఇచ్చింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతి తనకు రాకపోవడంపై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఎనిమిది యుద్దాలు ఆపినతనను కాదని ఇతరుల్ని ఎంపిక చేయడం నార్వే దేశానికి సిగ్గుచేటని మండిపడ్డారు. పలు దేశాలు సైతం తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిన తనను పరిగణలోకి తీసుకొక పొవడం దారుణమన్నారు. ఇటీవల నోబెల్ కమిటీ అనూహ్యంగా ట్రంప్ కు మరోసారి షాక్ ఇచ్చింది. నోబెల్ శాంతి ప్రకటన తర్వాత కూడా ట్రంప్ ఆగ్రహ జ్వాలలు ఇంకా తగ్గలేదు. అయితే తాజాగా.. ఆయన కన్ను కాస్త పులిట్జర్ పురస్కారంపై పడింది. నేను రాసిన రచనలకు పులిట్జర్ అయిన ఇవ్వాల్సిందేనంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నెట్టింట రచ్చ రాజుకుంది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సౌత్ కరోలినాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పెండిల్టన్‌లోని టీ.ఈడీ గారిసన్‌ అరేనాలోని సభలో మాట్లాడుతూ పులిట్జర్ పురస్కారంపై ట్రంప్ మాట్లాడారు. ఎనిమిదియుద్దాలు ఆపిన తనకు నోబెల్ రాలేదని పదే పదే పలు వేదికలపై మాట్లాడిన ట్రంప్ ఈసారి తానురాసిన రచనలకైన పులిట్జర్ పురస్కారం ఇవ్వాల్సిందే నంటూ చెప్పుకొచ్చారు. రష్యా దర్యాప్తుపై కథనాలకు గాను పులిట్జర్‌ అవార్డులు పొందిన జర్నలిస్టులను టార్గెట్ చేసుకుని ట్రంప్ ఏకీపారేశారు. అసలు వారికి ఆ పురస్కారం అందుకునే అర్హత లేదని డొనాల్డ్ ట్రంప్ వెటకారంగా మాట్లాడారు. తాను ఎన్నో రచనలు చేశానని కనీసం పులిట్జర్ అయిన రావాల్సిందని ట్రంప్ తన మనసులో ఉన్న మరో కోరికను బైటపెట్టారు. ప్రస్తుతం ట్రంప్ పులిట్జర్ పురస్కారంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు డొనాల్డ్ ట్రంప్ ను ఇక నోబెల్ శాంతి బహుమతి అయ్యింది.. ఇక పులిట్జర్ పురస్కారం ఇవ్వాలా..?.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక ట్రంప్ తన టెంపరీ తనం నిర్ణయాలతో ప్రపంచదేశాల్ని ముప్పుతిప్పులు పెడుతున్న విషయం తెలిసిందే. తాను చెప్పిన విధంగా నడుచుకోకుంటే ట్రంప్ టారిఫ్ సుంకాల అస్త్రాలను సంధిస్తున్నారు. యుద్దాలపై ఆయన తరచుగా చేస్తున్న వ్యాఖ్యలు చూసి ప్రపంచ దేశాలు సైతం ముక్కున వేలేసుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భవానీ భక్తుల ప్రాణాలు రోడ్డు ప్రమాదం రూపంలో గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా డెంకాడ నుంచి విజయవాడకు వస్తున్న ప్రైవేట్ బస్సులో భవానీ భక్తులు ప్రయాణిస్తున్నారు. అయితే బస్సులో తలెత్తిన మరమత్తుల కారణంగా కత్తిపూడి వద్ద రోడ్డు పక్కన ఆపారు. ఈ క్రమంలో బస్సులో ఉన్న కొందరు భక్తులు టీ తాగేందుకు రోడ్డు దాటుతుండగా, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి విజయవాడకు కారులో వస్తున్న మరో బృందం వారిని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు భవానీ భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని కాకినాడ డీఎస్పీ తిలక్ మరియు స్థానిక పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై  మంత్రులు వంగలపూడి అనిత, నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అమ్మవారి దర్శనానికి వస్తుండగా ఈ ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

సినీ నటి రష్మిక యాసను హేళన చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. హిందీ సినిమాల్లో దక్షిణాది యాసతో మాట్లాడుతుందని హేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ ట్రోలింగ్‌పై రష్మిక స్పందిస్తూ తను దక్షిణాది నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి సహజంగానే తనలో ఆ యాస ఉంటుందని చెప్పింది. తాజాగా భర్త విజయ్‌ దేవరకొండతో కలిసి 'కాఫీ విత్‌ కరణ్‌' టాక్‌ షోలో పాల్గొన్న ఆమె తన యాసపై వచ్చిన ట్రోల్‌ గురించి మాట్లాడుతూ 'ఇలాంటి విమర్శలను తాను ఎన్నో చూశానని, వాటి కారణంగా తనను తాను ఎప్పుడూ హద్దులు విధించుకోవాలని ఆలోచించలేదని చెప్పింది. 'నేను సౌత్‌ యాసలో మాట్లాడుతున్నానని ట్రోల్‌ చేస్తున్నారు. అది నిజమే, నేను దక్షిణాది నుంచి వచ్చాను. అందుకే నాలో ఆ యాస సహజంగానే ఉంటుంది. అలా కాకుండా మరోలా మాట్లాడాలనుకోవడం సమంజసం కాదు. ఇలాంటి ట్రోల్‌ నాకు కొత్తేమీ కాదు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా నన్ను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. నా మాట, నటన, యాస.. ఇలా దేనిని వదలడం లేదు. కానీ నేను వాటిని పట్టించుకోను. వారి కోసం నాకొచ్చిన అవకాశాలను మిస్‌ చేసుకోవాలనుకోలేదు' అని రష్మిక అన్నారు.

దేశీయ మార్కెట్లోకి హోండా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం ఎస్‌యూవీ సీఆర్-వీ మోడల్‌ను మళ్లీ తీసుకురానుంది. భవిష్యత్తులో ఇది కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా నిలవనుంది. గతంలో మంచి ఆదరణ దక్కించుకున్న ఈ వాహనం, సరికొత్త హంగులతో రీ-ఎంట్రీ ఇస్తుండటంతో ఆటోమొబైల్ రంగంలో భారీ చర్చ జరుగుతోంది. హోండా సంస్థ తొలిసారిగా 2003లో సీఆర్-వీ కారును భారత మార్కెట్లోకి పరిచయం చేసింది. ఆ తర్వాత కాలక్రమేణా పలు కొత్త జనరేషన్ మోడళ్లను తీసుకువచ్చింది. అయితే గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోవడంతో 2020లో ఈ కారు ప్రొడక్షన్ అధికారికంగా ఆగిపోయింది. ఇప్పుడు కంపెనీ CBU మార్గం ద్వారా కొత్త జనరేషన్ సీఆర్-వీని దేశానికి తీసుకురావాలని భావిస్తోంది. ఈసారి అద్భుతమైన స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ కొత్త ఎస్‌యూవీలో 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు అత్యాధునిక టూ-మోటర్ ఈ-హైబ్రిడ్ సిస్టమ్ లభించనుంది. ఇది సుమారు 204 bhp పవర్, 334 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక లోపలి భాగంలో 15-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్ రూఫ్ వంటి మోడర్న్ ఫీచర్లు ఉంటాయి. సేఫ్టీ కోసం లెవెల్-2 ఏడీఏఎస్ టెక్నాలజీతో పాటు 10 ఎయిర్‌బ్యాగ్‌ల రక్షణ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో హోండా ఎలివేట్, జెడ్ఆర్-వి వంటి కార్లు అందుబాటులో ఉన్నాయి. సీఆర్-వీ రాకతో కంపెనీ స్థానం మరింత బలపడుతుంది. పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయించనుండటం వల్ల దీని ధర కొంత ప్రీమియంగా ఉండే అవకాశం ఉంది. లగ్జరీ ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు కోరుకునే కస్టమర్లకు ఈ ఎస్‍యూవీ అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కారు విడుదలకు సంబంధించి మరిన్ని అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.

దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. కంపెనీల నుంచి బయటకు వెళ్లే ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే, కొత్తగా లోపలికి వచ్చే వారి సంఖ్య తీవ్రంగా పడిపోయింది. గత ఏడాది కాలంలో భారతదేశానికి చెందిన ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థలు ఐటీ, ఇంజనీరింగ్ విభాగాల్లో కొత్త నియామకాలను భారీగా తగ్గించేశాయి. ఫలఫలితంగా, గడిచిన 12 నెలల కాలంలోనే ఏకంగా 24,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు తగ్గిపోయినట్లు విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని టాప్ టెక్ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ సంస్థల్లో సాధారణంగా జరిగే ఉద్యోగుల రాజీనామాలు 11 నుంచి 15 శాతంగానే ఉన్నాయి. ఈ క్రమంలో గడిచిన ఏడాదిలో దాదాపు 92,000 మంది ఉద్యోగులు ఈ కంపెనీల నుంచి బయటకు వెళ్లారు. కానీ, ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడంలో కంపెనీలు వెనకడుగు వేశాయి. కేవలం 68,000 మందిని మాత్రమే కొత్తగా రిక్రూట్ చేసుకోవడంతో, నికరంగా నియామకాల సంఖ్య బాగా క్షీణించింది. ఐటీ హెడ్‌కౌంట్ క్రమంగా తగ్గుముఖం పట్టడానికి ఇదే ప్రధాన కారణమైంది. సంప్రదాయ ఐటీ ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కోడింగ్, మ్యాన్యువల్ టెస్టింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, అప్లికేషన్ మెయింటెనెన్స్ వంటి సాధారణ, రొటీన్ పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ వేగంగా పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా 5 నుంచి 12 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ తగ్గి, లేఆఫ్స్ పెరిగాయి. కంపెనీలు కూడా ఉన్న ఉద్యోగులకే ఏఐ స్కిల్స్ అప్‌స్కిల్లింగ్, తక్కువ మందితో ఎక్కువ పని పూర్తి చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఒకవైపు సంప్రదాయ ఐటీ ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ, సరికొత్త సాంకేతికత కలిగిన వారికి మాత్రం మార్కెట్లో భలే డిమాండ్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఏడాదికి 16 శాతం చొప్పున పెరుగుతున్నాయి. అయితే పాత తరహా ఉద్యోగాలు కోల్పోతున్న వారికి ఈ కొత్త టెక్నాలజీలలో తగిన నైపుణ్యాలు లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. మరొకవైపు గ్లోబల్ మార్కెట్లలో క్లయింట్ల నుంచి ప్రాజెక్టులు తగ్గడంతో, బెంచ్ స్టాఫ్ సంఖ్యను కూడా కంపెనీలు తగ్గించుకుంటున్నాయి. ఈ ఉద్యోగాల కోత శాశ్వతం కాదని, ఇది కేవలం తాత్కాలిక సవరణ దశ మాత్రమేనని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు చక్రం తిప్పి, టెక్ రంగానికి మళ్లీ ప్రాజెక్టుల రాక పెరిగితే రిక్రూట్‌మెంట్‌లు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయి. ఇప్పటికే కొన్ని దిగ్గజ సంస్థలు సెప్టెంబర్ త్రైమాసికంలో కొత్త రిక్రూట్‌మెంట్‌లను పునరుద్ధరించడం ఐటీ అభ్యర్థులకు కొంత ఊరటనిచ్చే అంశం.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ‘సురాస్ వెంచర్స్ లిమిటెడ్’  సంస్థ రూపొందించిన దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ చేపల వేట పడవ ప్రయోగాత్మక ప్రారంభోత్సవానికి కాకినాడ సిద్ధమైంది. స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ వినూత్న ప్రాజెక్టు, మత్స్యకారులకు డీజిల్ ఖర్చుల భారాన్ని తగ్గించడమే కాకుండా సముద్రంలో కాలుష్యాన్ని నియంత్రించి హరిత సాంకేతికతను మత్స్య రంగానికి పరిచయం చేసే లక్ష్యంతో ముందుకు వచ్చింది. మాజీ మత్స్యశాఖ అదనపు డైరెక్టర్, కంపెనీ టెక్నికల్ డైరెక్టర్ వి.వి. రావు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ పడవ శక్తివంతమైన బ్యాటరీతో నిరంతరాయంగా ఆరు గంటల పాటు సముద్రంలో ప్రయాణించగలదు. రోజువారీ వేటకు వెళ్లే స్థానిక మత్స్యకారులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రయోగాత్మక ప్రయత్నం విజయవంతమైతే, రాబోయే 24 నెలల్లో భారతదేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తన కార్యకలాపాలను విస్తరించాలని సురాస్ వెంచర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, కాకినాడను మెరైన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సర్వీసింగ్ హబ్‌గా తీర్చిదిద్దాలని కంపెనీ భావిస్తోంది. ఎలక్ట్రిక్ బోట్ల వినియోగం వల్ల ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నప్పటికీ, వీటి ప్రాక్టికల్ వినియోగం బ్యాటరీ ఛార్జింగ్ వేగం, సముద్ర వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. తీరప్రాంతాల్లో చార్జింగ్ పాయింట్లు, షోర్-సైడ్ పవర్ సిస్టమ్స్, సాంకేతిక నిర్వహణ సదుపాయాలు ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు విజయానికి అత్యంత కీలకం. ఈ మొదటి ఎలక్ట్రిక్ బోట్ ప్రయోగం విజయవంతమైతే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలోని ఒక భవనంలో కుటుంబ సభ్యులు వెళ్తున్న లిఫ్ట్ అకస్మాత్తుగా దాని కేబుల్ తెగి కిందకు దూసుకెళ్లిన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆ లిఫ్ట్‌లో పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ప్రయాణించారు. ఆ సమయంలో ఊహించని విధంగా లిఫ్ట్ కేబుల్ తెగిపోవడంతో, క్యాబిన్ కనురెప్పపాటులో అతివేగంగా కింద పడి ముక్కలయింది. ఈ అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం వల్ల లిఫ్ట్‌లో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, శ్రమించి వారిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన వారికి శరీరాలపై తీవ్రమైన గాయాలు మరియు ఎముకలు విరిగినప్పటికీ, అదృష్టవశాత్తూ ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. పిల్లల కళ్ల ముందే జరిగిన ఈ భయానక ప్రమాదం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపగా, లిఫ్ట్ కూలిపోవడానికి అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

సౌదీ అరేబియా లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ దాడులను మరింత తీవ్రతరం చేశారు. కీలకమైన విమానాశ్రయాలు, చమురు నిల్వ కేంద్రాలే టార్గెట్‌గా డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతుండటంతో గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌదీలోని వ్యూహాత్మక కింగ్ ఫహద్ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన మెరుపు దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే చమురు కేంద్రాలపై కూడా రెబెల్స్ పంజా విసిరారు. షైబా ఆయిల్ ఫీల్డ్‌పై జరిగిన డ్రోన్ దాడిలో మరో ఇద్దరు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడ లోని ఇంద్రకీలాద్రి క్షేత్రానికి గురువారం పెద్ద ఎత్తున భవానీ భక్తులు తరలివచ్చారు. అమ్మవారి సన్నిధికి విచ్చేసిన భవాని భక్తులతో ప్రత్యేకంగా ఆలయ ఈవో శీనా నాయక్ మాట్లాడారు. క్యూ లైన్ లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని, త్రాగు నీరు సౌకర్యం ఇతర వివరాలు సేకరించారు. క్యూ లైన్ లో ఏర్పాట్లు బాగున్నాయని భవానీ దీక్షలు చేపట్టిన తమకు అమ్మవారి సన్నిధిలో ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని భవాని భక్తులు పేర్కొన్నారు.

డిసెంబర్‌లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026ను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సమిట్‌లో పారిశ్రామిక అభివృద్ధితో పాటు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు. దీనికోసం హైదరాబాద్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమిట్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న సమిట్‌లో జానపద, శాస్త్రీయ సంగీతం, నృత్యాలు, వివిధ ప్రాంతాల సాంప్రదాయ కళారూపాలు ప్రదర్శనలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, వారసత్వం ప్రత్యేకంగా కనిపించాలని ఆయన అన్నారు. సమ్మిట్ లో భాగంగా రక్షా ఎక్స్‌పో కూడా జరుగుతుంది. డిసెంబర్ 9న ఎయిర్ షో ఉంటుంది. ఆ రోజు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా. అందుకని ఆ రోజు ప్రత్యేక కల్చరల్ కార్నివాల్ నిర్వహించి రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా చూడాలని సీఎస్ సూచించారు. జానపద కళలు, సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో ఈ కార్నివాల్ ఉండాలని ఆయన అన్నారు.ప్రచారం విషయంలో కూడా సీఎస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కర్టెన్ రైజర్ కార్యక్రమాలను ఈ నెల 24న హైదరాబాద్‌లో, 29న ఢిల్లీలో ఘనంగా నిర్వహించాలన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాలు, తెలంగాణ భవన్, ఇతర ముఖ్య ప్రాంతాల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే మార్గం, ప్రధాన రహదారులు, స్టార్ హోటళ్లు, కీలక స్థలాల్లో కూడా ప్రచార బోర్డులు పెట్టాలని చెప్పారు. జాతీయస్థాయి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, సినీ నటులు, సెలబ్రిటీలతో షార్ట్ ఫిల్మ్‌లు తీసి ప్రచారం చేయాలని కూడా సూచించారు.ఈ సమ్మిట్ భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతుంది. గత ఏడాది జరిగిన సమ్మిట్ కంటే ఈసారి మరింత పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీకండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం. రాష్ట్రం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రకారం 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ సమ్మిట్ లో పారిశ్రామిక విధానాలు, నూతన పాలసీలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. బీ2బీ సమావేశాలు, ఎగ్జిబిషన్‌లు, ప్లీనరీ సెషన్లు జరుగుతాయి. రక్షా ఎక్స్‌పో ద్వారా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమ్మిట్ ఏర్పాట్లపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, నవంబర్ చివరి నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు గడువు విధించారు. 

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు ఆప్కాస్ ఉద్యోగులను తొలగిస్తూ, ఆప్కాస్ ఎండి, జిల్లా కలెక్టర్ లకు లేఖలు పంపినట్లు నగర కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి ప్రధాన కార్యాలయంలో ఆప్కాస్ విధానంలో అన్ స్కిల్డ్ వర్కర్‌గా పనిచేస్తున్న ఈదులమూడి సరోజినిదేవి తన ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే, స్థానిక సంస్థల ఎన్నికల్లో 67వ వార్డు (శారద కాలనీ) నుండి కార్పొరేటర్‌ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారన్నారు. ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగంలో కొనసాగుతూ నామినేషన్ వేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తి విరుద్ధం కావడంతో, ఆమెను గుంటూరు నగరపాలక సంస్థ ఆప్కాస్ ఉద్యోగుల జాబితా నుండి తొలగించేందుకు ఆప్కాస్ మేనేజింగ్ డైరెక్టర్‌ కు లేఖ పంపామన్నారు. అలాగే, తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ లో ఆప్కాస్ విధానంలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అంజాతుల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ రాజాకీయ పార్టీ ఆభ్యర్దిని కలసి సంఘీభావం తెలిపడం, వారి వెంట బహిరంగ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ప్రాధమిక విచారణలో వెల్లడైందన్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి రాజకీయ ప్రచారాల్లో పాల్గొనడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే కాబట్టి, సదరు ఉద్యోగిని కూడా ఆప్కాస్ జాబితా నుండి తొలగించి, ఆప్కాస్ ఎండీకి లేఖ పంపామని తెలిపారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ లేదా కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచారాల్లో కానీ, రాజకీయ కార్యక్రమాల్లో కానీ పాల్గొనకూడదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారంలో పాల్గొన్నా లేదా ఎన్నికల్లో పోటీ చేసినా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం శాఖాపరమైన మరియు చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ తర్వాతి మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం నుండి మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, అలాగే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ లోపు తిరిగిరావాలని సూచిస్తోంది. అలాగే రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎల్లుండి నుంచి ఈ వర్షాలు మరింత పెరగబోతున్నాయి. ఇవి కాస్తా ఆదివారం నాటికి భారీ వర్షాలుగా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారుతుందా లేదా అనే దానిపై ఆదివారం నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆదివారం కల్లా కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. కాబట్టి తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలతో పాటు మత్సకారుల్ని అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరుతోంది. ఈ నెలాఖరు కల్లా కోస్తాంధ్రలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి విజృంభించింది. స్థానికంగా వాయు నాణ్యత సూచీ దిగజారడంతో 'సెంట్రల్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం)' ఈ సీజన్‌లో తొలిసారి ఆంక్షలు విధించింది. ఢిల్లీ - ఎన్‌సీఆర్‌ పరిధిలో 'గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌-1 నిబంధనలను తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు సీఏక్యూఎం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెంట్రల్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఛైర్‌పర్సన్‌ రాజేశ్‌ వర్మ.. ఉన్నతాధికారులు, పలు ప్రభుత్వ విభాగాలతో సమక్షా సమావేశం నిర్వహించింది. నగరంలో వాయు కాలుష్య సమస్యపై సమీక్షించడంతో పాటు రాబోయే రోజుల్లో కాలుష్య నివారణ చర్యలపై చర్చించారు.ఢిల్లీలో ఈ నెల 20న వాయు నాణ్యత సూచీ 179గా నమోదు కాగా ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు 244కి ఒక్కసారిగా పెరిగిందని సీఏక్యూఎం పేర్కొంది. రాబోయే రోజుల్లో వాయు నాణ్యత సూచీ 'పూర్‌' కేటగిరీలోనే ఉంటుందని ఐఎండీ తెలిపింది. వాయు నాణ్యత మరింతగా క్షీణించకుండా నిరోధించేందుకు జీఆర్‌ఏపీ-1 నిబంధనలను వెంటనే అమలు చేయాలని సీఏక్యూఎం పేర్కొంది. ఈ నిబంధనల కింద గ్రాప్‌-1 కింద హోటళ్లు, రెస్టారెంట్లలో ఇంధనంగా బొగ్గు, వంట చెరకు వాడకూడదు. అలానేఅత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డీజిల్‌ జనరేటర్ల వాడకానికి అనుమతించాలని సీఏక్యూఎం స్పష్టం చేసింది.

దక్షిణాఫ్రికా లోని గ్కెబెర్హాలో దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను 425/9 వద్ద డిక్లేర్ చేయగా, ఆస్ట్రేలియా కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. దీంతో దక్షిణాఫ్రికాకు 326 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 28 పరుగులతో అత్యధిక స్కోరు చేశాడు. ట్రావిస్ హెడ్ 14, మార్నస్ లబుషేన్ 14, మ్యాట్ రెన్‌షా 12, బ్యూవ్ వెబ్‌స్టర్ 13 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో ఆస్ట్రేలియా 42.3 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. 11 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. అతనికి తోడుగా కగిసో రబాడా, వియాన్ ముల్డర్ చెరో 2 వికెట్లు, అన్రిచ్ నోర్జే ఒక వికెట్ సాధించారు. అంతకుముందు దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించడంలో కెప్టెన్ టెంబా బవుమా కీలక పాత్ర పోషించాడు. అతడు 334 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్స్ తో 179 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి మార్కో జాన్సెన్ 85, సైమన్ హార్మర్ 82 పరుగులతో సహకారం అందించడంతో దక్షిణాఫ్రికా 127.1 ఓవర్లలో 425/9 వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ 5 వికెట్లు, మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశారు. అయితే దక్షిణాఫ్రికా భారీ స్కోరును అడ్డుకోవడంలో మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై పట్టు బిగించింది. మొదటి టెస్టులో ఘోరంగా ఓడిన దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ లో మాత్రం తన ఫామ్ ఏంటో చూపించింది. ప్రస్తుతానికి ఫాలో ఆన్ కారణంగా రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన ఆస్ట్రేలియా 23 ఓవర్లలో 1 వికెట్‌కు 73 పరుగులు చేసి, దక్షిణాఫ్రికా కంటే ఇంకా 253 పరుగుల వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ పూర్తిగా విఫలం కావడంతో ఈ టెస్టులో పుంజుకోవాలంటే తీవ్రంగా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమం చేసేందుకు ఈ మ్యాచ్‌లో గెలుపుపై కన్నేయగా ఆస్ట్రేలియా మాత్రం మిగిలిన వికెట్లను కాపాడుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది.

దాదాపు 400 సంవత్సరాలకు పైగా చారిత్రక ప్రాశస్త్యం కలిగిన మైసూర్ దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో అత్యంత కీలకమైన భారీ ఊరేగింపు కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ కళా బృందాలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో, ఈ సంవత్సరం జరిగిన దసరా ఊరేగింపు కార్యక్రమంలో చరిత్రలోనే మొదటిసారిగా తమిళనాడుకు చెందిన ఒక సాంస్కృతిక కళా బృందం అధికారికంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్సవాల్లో పాల్గొన్న తమిళనాడు కళాకారులు తమ అద్భుతమైన, ఉత్సాహపూరితమైన ప్రదర్శనలతో వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. శతాబ్దాల సంప్రదాయం కలిగిన మైసూర్ దసరా పరేడ్‌లో తమిళ కళా బృందానికి లభించిన ఈ ఘనమైన ఆహ్వానం, గుర్తింపునకు సంబంధించిన ఫోటోలు, వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రష్యా తొలి డీజిల్‌ ట్యాంకర్‌ను రేపు అమెరికాకు పంపించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ రవాణా చేపడుతున్నట్లు రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్‌ నోవాక్‌ వెల్లడించారు. తొలి నౌకలో 40 వేల టన్నుల డీజిల్‌ ఉంటుందని ఆయన పేర్కొన్నట్లు వార్తా సంస్థలు తెలిపాయి. ఇంధన సరఫరాకు సంబంధించిన ఒప్పంద పత్రాల ప్రక్రియ తుది దశలో ఉందని వివరించారు. దేశీయంగా ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు రష్యా గతంలో డీజిల్‌ ఎగుమతులపై స్వీయ ఆంక్షలు విధించింది. రిఫైనరీలపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడుల ప్రభావంతో సరఫరా సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, అక్టోబర్‌ 9న ట్రంప్‌తో కుదిరిన ఒప్పందం అనంతరం ఎగుమతులపై ఆంక్షలను రష్యా సడలించింది. అమెరికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు ఇంధన సరఫరాలను పెంచడమే ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశం. తొలి నౌక తర్వాత కూడా మరింత డీజిల్‌ రవాణా కొనసాగుతుందని నోవాక్‌ తెలిపారు. అయితే, రిఫైనరీల ఉత్పత్తి సామర్థ్యం, రష్యా దేశీయ అవసరాలను బట్టి ఎగుమతులు క్రమంగా పెరుగుతాయని స్పష్టం చేశారు. ఏడాది చివరి నాటికి ఎగుమతులను పూర్తిస్థాయికి తీసుకెళ్లాలని మాస్కో లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ మార్కెట్లో డీజిల్‌ ధరలు తగ్గించాలన్నది ఈ ఒప్పందం వెనుక అమెరికా లక్ష్యాల్లో ఒకటి. ఒప్పందం తర్వాత అంతర్జాతీయ డీజిల్‌ ధరలు 5-6 శాతం తగ్గాయని పుతిన్‌ పేర్కొన్నారు. అయితే, తొలి రవాణా పరిమాణం ఒక్కటే ప్రపంచ మార్కెట్‌పై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని చెప్పలేం. ఈ ఒప్పందం ఉక్రెయిన్‌తో అమెరికా సంబంధాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఇంధన ధరల ఉపశమనం, రష్యాపై ఆర్థిక ఒత్తిడి కొనసాగింపు మధ్య వాషింగ్టన్‌ ఎలాంటి సమతూకం పాటిస్తుందన్నది కీలకంగా మారింది.

కేరళ రాజధాని తిరువనంతపురంలో బుధవారం మీడియాతో మాట్లాడిన శశి థరూర్‌ను.. ఢిల్లీలో నిరసనలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు ఎందుకు వెళ్లారంటూ విలేకరులు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ “నేను ట్రావెల్ ఏజెంట్‌ను కాదు. ఆ ప్రశ్న నన్ను అడగడంలో అర్థం లేదు. నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను? ప్రతి ఒక్కరికీ కొన్ని వ్యక్తిగత బాధ్యతలు, ప్రణాళికలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంపై నేను ఎలాంటి వ్యాఖ్య చేయలేను” అని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై విపక్షాలు, బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఎన్నికల కమిషన్‌పై కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేసి, ఆపై రాహుల్ గాంధీ విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లిపోయారంటూ ఆరోపించాయి. విమానంలోని బిజినెస్ క్లాస్ క్యాబిన్‌లో రాహుల్ గాంధీ కూర్చున్న వీడియోను బీజేపీ తమ అధికారిక సోషల్ మీడియా ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ “అబద్ధాలు చెప్పి అలసిపోయాను.. కొద్దిరోజులు వియత్నాంలో విహరించి వస్తాను” అని వ్యంగ్యంగా క్యాప్షన్ జోడించింది. అలాగే బీజేపీ అధికార ప్రతినిధులు స్పందిస్తూ రాజకీయ కార్యక్రమాలు, ఆందోళనల తర్వాత రాహుల్ గాంధీ విదేశీ విహారయాత్రలకు వెళ్లడం అలవాటుగా మారిందని, ఆయన నిబద్ధత ఇదేనా అని ప్రశ్నించారు. కాగా పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఇండియా కూటమి ప్రతిపక్షాలు తమ నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేశాయి. అయితే, ఢిల్లీలో కీలక ఆందోళనల నడుమ రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేపట్టడం వల్ల ఈ అంశం చుట్టూ దేశ రాజకీయాల్లో ముమ్మర చర్చ సాగుతోంది.

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన దేవకతే సంతోష్ బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఈఎంఐ లు కట్టలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు సంతోష్ 2025 లో హైదరాబాద్ లో బేకరీ షాప్ నిర్వహించాడు. బేకరీ షాప్ సరిగా నడవక కొన్ని నెలలకే నష్టాలు రావడంతో బేకరీ నష్టాలను భర్తీ చేయడానికి ఏడిసిసి బ్యాంకు నుంచి 4 లక్షలు, క్రాప్ లోన్ 80 వేలు, ఇంటి పై హోం లోన్ 10 లక్షలు తీసుకున్నాడు. ఈ మొత్తం రుణాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించడానికి హైదరాబాదులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ ఈఎంఐ లను చెల్లించేవాడు. ఇదే సమయంలో భార్య ప్రెగ్నెంట్ కావడంతో భార్య ఆసుపత్రి ఖర్చులు భరించేవాడు. జీతం తక్కువ కావడంతో భార్య ఆసుపత్రి ఖర్చులు, ఈఎంఐలు ఎక్కువ కావడంతో ఈ ఖర్చులు భరించలేక మనస్థాపానికి గురై సోమవారం హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి తిరిగి వచ్చి మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రీలోడెడ్ సేల్‌లో ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్‌పై స్పెషల్ కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 50MP కెమెరా వంటి ఫీచర్లతో ఈ మొబైల్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 19,499గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో ధర రూ. 19,497గా ఉంది. ఈ సేల్‌లో రూ. 2,500 కూపన్ డిస్కౌంట్‌ ధర రూ. 16,997కు తగ్గుతుంది. అదనంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసే కస్టమర్లు రూ.584 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.  ఐక్యూ జెడ్11 లైట్ ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్ అందించారు. 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ అందిస్తుంది. గరిష్ఠంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు అందిస్తుంది. స్క్రీన్‌పై కంటెంట్‌ను చూడటం చాలా ఈజీగా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రోజువారీ వినియోగానికి అద్భుతంగా ఉంటుంది.ఇందులో ఆరిజిన్ OS6 ఆధారిత ఆండ్రాయిడ్ 16 కూడా ఉంది. ఈ మొబైల్‌లో 6500mAhతో బ్యాటరీని అమర్చారు. 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అందించారు. ఫొటోగ్రఫీ కోసం బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP మెయిన్ కెమెరా, అదనంగా 0.08MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరాను అందించారు. IP65 రేటింగ్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 5జీ కనెక్టివిటీ, బ్లూటూత్ 5.4, Wi-Fi, జీపీఎస్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. 

గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన 24 ఏళ్ల విశ్వరాజ్‌సింగ్ మయూర్‌సింగ్ గోహిల్ అనే యువకుడు మహారాష్ట్రలోని ప్రసిద్ధ అహ్మద్‌నగర్ (అహిల్యానగర్) జిల్లాలోని హరిశ్చంద్రగఢ్ పరిధిలో ఉన్న సుమారు 1,700 అడుగుల ఎత్తైన కొంకణకడ కొండ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతను రికార్డు చేసిన 13 నిమిషాల వీడియో పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. విశ్వరాజ్‌సింగ్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి 8న వివాహం జరిగింది. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే వారి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకుల వరకు వెళ్లాయి. సెప్టెంబర్ 12న అతని భార్య గృహహింస కింద ఫిర్యాదు చేయగా, అక్టోబర్ 9న ఆయన కోర్టుకు హాజరయ్యారు. మరణించే ముందు రికార్డు చేసిన 13 నిమిషాల వీడియోలో తన మాజీ భార్య, ఆమె కుటుంబ సభ్యుల వల్ల తాను తీవ్రమైన మానసిక, ఆర్థిక, సామాజిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఆరోపించాడు. తనపై, తన తల్లిపై, అలాగే 16 ఏళ్ల తమ్ముడిపై పెట్టిన గృహహింస కేసులు పూర్తిగా అవాస్తవమని, తాము ఎప్పుడూ వేధించలేదని ఆ వీడియోలో కన్నీటిపర్యంతమయ్యాడు. పురుషులపై చట్టాలు ఏకపక్షంగా ఉంటున్నాయని, దీనివల్ల ఎంతోమంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ చట్టాలలో మార్పులు తీసుకురావాలని కోరాడు. లోయ కావడంతో డ్రోన్ కెమెరాలు, పర్వతారోహకుల సహాయంతో దాదాపు 24 గంటలకు పైగా శ్రమించి పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. థానే రూరల్ పరిధిలోని టోకావాడే పోలీస్ స్టేషన్‌లో 'అసాధారణ మృతి' కింద కేసు నమోదు చేసి, ఆ వీడియో ఆధారంగా సమగ్ర విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భావ్‌నగర్‌కు తరలించారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టత ఇచ్చింది. నామినేషన్ల దాఖలు సమయంలో పోలీస్ స్టేషన్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు సమర్పించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ ధ్రువపత్రాలు సమర్పించలేదనే కారణంతో అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వివరణ ఇచ్చింది. పోలీస్ స్టేషన్ల నుంచి ఎన్‌ఓసీ తీసుకురాలేదని, ప్రభుత్వంలోని ఏదైనా శాఖ నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్ సమర్పించలేదని అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం సరికాదని పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నిబంధనల్లో ఈ సర్టిఫికెట్ల సమర్పణ తప్పనిసరి కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలనకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే అధికారులు వ్యవహరించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సర్క్యులర్ జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలను సక్రమంగా అమలు చేయాలని, అనవసర కారణాలతో అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు నామినేషన్ల పరిశీలన విషయంలో కీలక స్పష్టత లభించినట్లయింది. అయితే, ఇతర తప్పనిసరి అర్హతలు, ఎన్నికల నిబంధనలను అభ్యర్థులు యథావిధిగా పాటించాల్సి ఉంటుంది.

ఐఐటీ బాంబే విద్యార్థి సాహిల్‌ మరణం తాలూకు ప్రకంపనలు కొనసాగుతుండగానే ముంబైలోని 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ'  ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. కెమికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సిద్ధేష్ పాటిల్ (19) అనే విద్యార్థి మంగళవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాహిల్‌ మృతిపై నిరసనలు, వివాదం ఇంకా సమసిపోకముందే ఐసిటి విద్యార్థి సిద్ధేష్ ఆత్మహత్య చేసుకోవడం క్యాంపస్‌లలో విద్యార్థుల భద్రతపై ఆందోళనలను మరింత పెంచింది. మాటుంగాలోని ఐసీటి క్యాంపస్‌లోని హాస్టల్ 5లోని రెండవ అంతస్తు గదిలో పాటిల్ మృతదేహాన్ని గుర్తించారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి మధ్య ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించామని, దర్యాప్తు జరుగుతోందని ఇన్‌స్టిట్యూట్ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. 'ఆకస్మిక మరణం' కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రకటనలను నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. నాసిక్‌కు చెందిన సిద్ధేష్ పాటిల్ గత కొంతకాలంగా డిప్రెషన్‌కు చికిత్స పొందుతున్నాడని అతడి సహచర విద్యార్థి తెలిపాడు. మంగళవారం రాత్రి అతడు తన ప్రాణాలు తీసుకుంటానని డాక్టర్‌కు తెలపడంతో, ఆ డాక్టర్ వెంటనే పాటిల్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను సంప్రదించి సిద్ధేష్‌ను చూడమని కోరారు. అయితే, వారు గదికి చేరుకునే సరికే సిద్ధేష్ ప్రాణాలు కోల్పోయాడని, దసరా పండుగ సెలవుల వల్ల క్యాంపస్‌లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని తోటి విద్యార్థి పేర్కొన్నాడు.

జపాన్ లో జరుగుతున్న పారా ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ క్రీడల్లో వచ్చిన పతకాల సంఖ్య 61కి చేరింది. ఇందులో 14 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. చైనా (211) మొదటి స్థానంలో కొనసాగుతోంది. దిలీప్ గావిట్ పురుషుల 100 మీటర్ల టి47 రేసును 10.69 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో మోర్సింగ్‌నకత్ (10.72 సెకన్లు) రెండో స్థానంలో నిలిచి రజతం అందుకున్నాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో సిమ్రాన్ రేసును 12.02 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. దీంతో మరో స్వర్ణం ఆమె ఖాలో చేరింది. 

తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలోని రామప్ప చెరువు, అక్కడి డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టును గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామప్ప చెరువులో ప్రస్తుతం 29 అడుగుల మేర నీరు అందుబాటులో ఉందని తెలిపారు. గోదావరి నుంచి నీటిని పంపింగ్ చేసి చెరువులు, పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా మెరుగుపరిచే అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. నీటి నిల్వలు పెరిగేందుకు ఏటా ఇచ్చే విరామాన్ని దృష్టిలో ఉంచుకుని మరో రెండు రోజుల్లో నీటిని విడుదల చేసేలా సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు. రామప్ప నుంచి నీటిని డీఫ్లోరైడేషన్ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసి ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, మల్లంపల్లి పరిసర ప్రాంతాలతోపాటు భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నీటి సరఫరా వ్యవస్థలు, చెరువులపై ఆధారపడిన గ్రామాలు, భూగర్భ జలాల పరిస్థితిని అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారని తెలిపారు. అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి పరిణామాలను ఏ శక్తీ పూర్తిగా నియంత్రించలేదని, ఇలాంటి పరిస్థితులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పులు వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతున్నాయన్నారు. ప్రకృతి సవాళ్లను ఎదుర్కొనేందుకు రాజకీయ విమర్శల కంటే సమష్టి కార్యాచరణ అవసరమని స్పష్టం చేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌లు, చెరువుల పునరుద్ధరణతోపాటు బోర్ల రీచార్జ్ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద విస్తృతంగా నీటి సంరక్షణ పనులు చేపట్టాలని, కూలీల సంఖ్యను పెంచి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచులు, గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఇప్పటినుంచే నీటి నిల్వలను పెంచుకుంటే భవిష్యత్తులో నీటి ఎద్దడి తీవ్రతను తగ్గించవచ్చన్నారు. సాగునీటి అవసరాలతోపాటు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని సీతక్క స్పష్టం చేశారు. ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రామప్ప-లక్నవరం కాలువ వంటి ప్రతిపాదిత ప్రాజెక్టు లతోపాటు ఇతర ప్రత్యామ్నాయ నీటి వనరులను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తామని, నీటి సంరక్షణలో ప్రజలందరూ సహకరించాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.

అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రీలోడెడ్' సేల్ స్మార్ట్‌ఫోన్లపై సరికొత్త డిస్కౌంట్లతో ప్రారంభమైంది. బ్యాంక్ కార్డులు లేనివారు కూడా ప్రొడక్ట్ పేజీలోని కూపన్లు, అమెజాన్ పే లేటర్ క్యాష్‌బ్యాక్‌లను కంబైన్ చేసి బంపర్ డిస్కౌంట్లు పొందవచ్చు. కొత్త ఫోన్ల లిస్టింగ్స్, వేగవంతమైన డెలివరీలు, ప్రత్యేక పే లేటర్ ఆఫర్లతో ఈ రీలోడెడ్ ఫెస్టివ్ సేల్‌ను తీసుకొచ్చినట్లు అమెజాన్ తెలిపింది. బ్యాంక్ కార్డులతో పనిలేకుండా, అర్హత ఉన్న ప్రొడక్టులపై 'అమెజాన్ పే లేటర్' EMI ఎంచుకుని, ప్రొడక్ట్ పేజీలో కనిపిస్తున్న కూపన్లను వర్తింపజేస్తే చాలు. ఈ పండుగ సీజన్‌లో పే లేటర్ ఆదాను అమేజాన్ ప్రత్యేకంగా హైలైట్ చేస్తోంది. ₹29,990 దాటిన కొనుగోళ్లపై పే లేటర్ EMI ఎంచుకుంటే నేరుగా ₹2,750 వరకు ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అంతేకాకుండా, చాలా స్మార్ట్‌ఫోన్లపై 3 నెలల నో-కాస్ట్ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాపై ₹10,000 ఆన్-పేజీ కూపన్ లభిస్తోంది. దీంతో దీని ధర ₹94,999కి తగ్గుతుంది. మీ ఖాతాలో పే లేటర్ EMI పై 10% క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంటే, చెక్ అవుట్ వద్ద వర్తించే లిమిట్‌కు లోబడి ఈ ఫోన్‌ను రూ.85,500లకే సొంతం చేసుకోవచ్చు. ఇక యాపిల్ ఐఫోన్ 16 (128GB) మోడల్ సుమారు ₹76,999కి లిస్ట్ అవ్వగా, అర్హత కలిగిన పే లేటర్ ట్రాన్సాక్షన్లపై ఈ ధర మరింత తగ్గుతుంది. ఐకూ Z-సిరీస్‌కు చెందిన "Z11 Lite 5G" ఫోన్ ₹2,000 కూపన్‌తో కలిపి ₹15,499కి అందుబాటులో ఉంది. పే లేటర్ క్యాష్‌బ్యాక్‌తో దీని ప్రభావవంతమైన ధర ₹14,000 కంటే తగ్గుతుంది. ₹25 వేలలోపు ఆఫర్: ఐకూ Z11xa 5G ఫోన్ ఈ సేల్‌లో దాదాపు ₹24,999కి లభిస్తోంది. ₹40 వేలలోపు ఆఫర్: వన్‌ప్లస్ నార్డ్ 6 లిస్టింగ్ ధర ₹42,999 కాగా, పే లేటర్ EMI క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ ద్వారా ఇది రూ.38 వేల శ్రేణికి తగ్గుతుంది. 

ప్రతిరోజు ఉదయం కాఫీ తాగడం వల్ల యాక్టివ్‌ ఉండడమే గాక, తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని, దీర్ఘాయువులో కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.  మితంగా తాగితేనే ఈ ప్రయోజనాలు పొందగలమని అంటున్నారు. అలాంటి ప్రయోజనాలు పొందాంటే ఎలా తాగాలో, ఏవిధంగా ఎప్పటికీ తాగకూడదు సవివరంగా వెల్లడించారు. క్రమం తప్పకుండా కాఫీ తాగితే ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటి కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అలాగే ఇది కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి కాలేయాన్ని రక్షిస్తుంది. కాఫీలో శక్తివంతమైన పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఒక కప్పు కాఫీ తాగడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం 8% తగ్గుతుంది, 2 కప్పులు తాగితే 15% కాఫీ తాగే మహిళలకు ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందట. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను డీఎన్‌ఏ నుంచి రక్షిస్తాయి. కాఫీ ఈస్ట్రోజెన్ జీవక్రియ జరిగే విధానాన్ని మారుస్తుంది, తద్వారా రక్తప్రవాహంలో ప్రసరించే ఫ్రీ ఈస్ట్రోజెన్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. కాఫీలోని ఇతర సమ్మేళనాలు పార్కిన్సన్స్‌ వ్యాధి ప్రమాధాన్ని తగ్గిస్తాయట. కెఫీన్‌కు మెదడు ఆరోగ్యానికి తోడ్పడే న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలు ఉంటాయట. అందువల్ల దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 37% తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.కాఫీలోని పాలిఫెనాల్స్ ఆక్సిడేటివ్ ఒత్తిడిని ఎదుర్కొని, దీర్ఘకాలిక మంటను తగ్గిస్తాయి, తద్వారా గుండె పనితీరు మెరుపడుతుందట. అంతేగాదు గుండె వైఫల్యం, అరిథ్మియాస్‌ ప్రమాదం కూడా తగ్గుతుందట. అలాగే పక్షవాత మరణాలు 19% తగ్గుతాయి. పొయ్యి మీద నుంచి తీసిన వెంటనే దాన్ని ఎప్పుడూ తాగవద్దు. చల్లగా ఉంటేనే సురక్షితం. 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉండే వేడి పానీయాలు అన్నవాహిక కేన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. మరీ వేడిగా ఉండకూడదు, మరీ తీపిగా ఉండకూడదు, మరీ ఆలస్యంగా ఉండకూడదని నిపుణులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని కడపలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఉరుసు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దర్గా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ముషాయిరా హాలులో దర్గా నిర్వాహకులు ఆవిష్కరించారు. 25న గంధం మహోత్సవం, 26న ఉరుసు మహోత్సవం, 27న 82వ ముషాయిరా కార్యక్రమం, 28న సమాఖాని కార్యక్రమం, 29న పీఠాధిపతి ఊరేగింపు, జూలూస్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 29వ తేదీ రాత్రి పీఠాధిపతి ఊరేగింపులో భాగంగా కడప గోకుల్ సర్కిల్ వద్ద ప్రముఖ సంగీత విద్వాంసుడు శివమణి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉరుసు ఉత్సవాలకు ఐదు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో దర్గా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్య సదుపాయాలు, రవాణా తదితర ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. భక్తుల రాకపోకలకు అవసరమైన బస్సు సౌకర్యాలను రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించనుండగా.. దర్గా పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. అదేవిధంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందించనున్నారు. కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయి.

కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల అనంతరం పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించినట్లు వన్‌ఇండియా తెలుగు నివేదించింది. జంతర్ మంతర్ వద్ద నిరసనలపై కేంద్రం జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించి జాతీయ జెండాను ఎగురవేసిన కేసులో అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ అరెస్టయ్యారు. అనంతరం వారిని తీహార్ జైలుకు తరలించినట్లు నివేదిక పేర్కొంది. తమను తాము జెన్ జెడ్‌గా అభివర్ణించుకోవడంపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది అభిక్ చిమ్నీ స్పందిస్తూ.. సౌరవ్ దాస్ వయస్సు 27 ఏళ్లు, అశుతోష్ రాంకా వయస్సు 32 ఏళ్లు అని కోర్టుకు తెలిపారు. దీంతో 'అయితే మీరు జెన్ జెడ్ కాదు. జెన్ జెడ్ అంటే ఏమిటి?' అని న్యాయస్థానం ప్రశ్నించినట్లు నివేదిక వెల్లడించింది.మెజిస్ట్రేట్ తమ జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు రోజుల పాటు పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. తమను వెంటనే విడుదల చేయాలని, కస్టడీ పొడిగింపుపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. నిర్బంధం తమ వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘిస్తోందని వారి తరఫు న్యాయవాది వాదించినట్లు కథనం పేర్కొంది. అయితే, మెజిస్ట్రేట్ ఉత్తర్వును హైకోర్టులో సవాల్ చేయడానికి ముందు ప్రత్యామ్నాయ న్యాయపరమైన మార్గాలను అనుసరించాల్సి ఉందా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కేసు మెజిస్ట్రేట్ ముందుకు రావాల్సి ఉన్న నేపథ్యంలో నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని కూడా అడిగింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు ముందుగా మెజిస్ట్రేట్ ముందు జరిగే ప్రక్రియను అనుసరించాలని, అనంతరం అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గాలను పరిశీలించుకోవాలని హైకోర్టు సూచించినట్లు నివేదిక తెలిపింది. దీంతో అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. పిటిషన్ ఉపసంహరణతో కస్టడీ ఉత్తర్వులపై హైకోర్టు నుంచి వారికి కోరిన ఉపశమనం లభించలేదు. తదుపరి న్యాయపరమైన పరిణామాలు మెజిస్ట్రేట్ ముందు జరిగే విచారణపై ఆధారపడి ఉంటాయి.

శబరిమలలో గదుల బుకింగ్ కి కొత్త నిబంధనలు తీసుకురావాలని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు నిర్ణయించింది. ఆన్‌లైన్ ద్వారా దర్శనం టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఇకపై వసతి గదులు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. గదుల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని, దళారులు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏజెన్సీలు, దళారుల జోక్యాన్ని పూర్తిగా అరికట్టడానికి ఆన్‌లైన్ బుకింగ్‌లో ఓటీపీ విధానం ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల నిజమైన భక్తులకు మాత్రమే గదులు దక్కే అవకాశం లభిస్తుంది. గదుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై దేవస్వం విజిలెన్స్ విభాగం ఇప్పటికే సమగ్ర విచారణ చేపట్టింది. విచారణ పూర్తయిన తర్వాత దేవస్వం కమిషనర్ త్వరలోనే కేరళ హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. కోర్టు అనుమతి లభించిన వెంటనే ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.

పాకిస్తాన్‌లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగంలో ఉండగానే విదేశాల్లో శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా, అమెరికా, బ్రిటన్‌తో పాటు పలు యూరప్ దేశాలకు పాకిస్తాన్ అధికారులు వలస వెళ్లిపోతున్నారన్నారు. ఈ పరిణామం దేశం పట్ల, తమ విధుల పట్ల అధికారులకు ఉన్న నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా పలువురు అధికారులు విదేశాల్లో శాశ్వత నివాసం కోసం ప్లాన్ చేసుకుంటున్నారని ఆయన ఎక్స్ వేదికగా అన్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడే ఈ ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ బ్యూరోక్రాట్లకు పోర్చుగల్ ఇటీవలి కాలంలో ముఖ్యమైన గమ్యస్థానంగా మారిందని అన్నారు. విదేశాల్లో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసేందుకు అధికారులకు సహాయం చేసే వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి పారిపోయినట్లు ఆసిఫ్ ఆరోపించారు. అయితే, ఆ వ్యక్తి వివరాలు, దానికి సంబంధించిన ఆధారాలు ఆయన బహిరంగంగా వెల్లడించలేదు.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా వక్రీకరిస్తూ భారీ ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల గడువును సర్వోన్నత న్యాయస్థానమే నేరుగా పొడిగించేసిందని, ప్రభుత్వంపై తాము పైచేయి సాధించామని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా హంగామా చేస్తున్నాయి. అయితే అసలు తీర్పు సారాంశాన్ని నిశితంగా పరిశీలిస్తే న్యాయస్థానం ఎక్కడా రాష్ట్రవ్యాప్తంగా , పిటిషనర్లు కోరినట్లుగా నేరుగా బ్లాంకెట్ ఆర్డర్ ద్వారా నామినేషన్ల గడువును పొడిగించలేదన్నది సుస్పష్టం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణ బాధ్యత అంతా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనిదేనని స్పష్టం చేస్తూ, నిర్ణయాధికారాన్ని కమిషన్‌కే అప్పగించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరిగాయని ఆరోపణలు వచ్చాయో, ఆయా నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నామినేషన్ల గడువును పొడిగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎస్ఈసీని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా గడువు పెంచాలన్న వైసీపీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం వివాదాలు లేదా అడ్డంకులు ఎదురైనట్లు నమోదైన ఫిర్యాదులు, ఆధారాలను బట్టి మాత్రమే కమిషన్ నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల తుది అభ్యర్థుల జాబితా ప్రచురణను అక్టోబర్ 25వ తేదీ వరకు వాయిదా వేయాలని ఆదేశిస్తూ, ఎస్ఈసీ తీసుకునే చర్యలపై నివేదిక సమర్పించాలని న్యాయస్థానం నిర్దేశించింది. అయినప్పటికీ, ఈ న్యాయ ప్రక్రియలో సుప్రీంకోర్టు చేసిన కొన్ని ప్రాథమిక పరిశీలనలు రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడిని పెంచాయనడంలో సందేహం లేదు. స్వేచ్ఛాయుత ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని, శాంతిభద్రతల సమస్యలు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నప్పుడు న్యాయస్థానాలు మౌనంగా ఉండలేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్లు సమర్పించిన వీడియో క్లిప్పింగులు, అఫిడవిట్లలోని ప్రాథమిక ఆధారాలను ప్రస్తావిస్తూ.. నామినేషన్ దాఖలును అడ్డుకున్నారన్న ఆరోపణలను పరిశీలించాలని ఆదేశించడం ద్వారా ఎన్నికల సంఘం చేతులు ముడుచుకుని కూర్చోలేని అనివార్య పరిస్థితిని కల్పించింది. ఇది వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నట్లుగా నేరుగా నామినేషన్ల గడువు పొడిగింపు ఆర్డర్ కాదు. కేవలం ఎన్నికల సంఘం సమగ్ర పరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా చేసిన ఆదేశం మాత్రమే. ఎక్కడైతే నిజంగా హింస జరిగిందని భావిస్తుందో, ఆయా ప్రాంతాల్లో మాత్రమే 48 గంటల సమయం ఇచ్చే అవకాశాన్ని ఎస్ఈసీ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం క్షేత్రస్థాయి నివేదికలు, డీజీపీ భద్రతా సమీక్షల ఆధారంగా ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. దీనిపై ఎస్ఈసీ ఇచ్చే నివేదిక ఆధారంగా అక్టోబర్ 27న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది.

దేశీయ మార్కెట్లో లావా ఆరా కర్వ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిలో 6.67 అంగుళాల FHD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,100 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 1920Hz PWM డిమ్మింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో మరో చిన్న AMOLED స్క్రీన్‌ను అందించారు. దీనిపై నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్స్, బ్యాటరీ స్థాయి, కస్టమ్ టెక్స్ట్ వంటి వివరాలను చూడొచ్చు. మొబైల్ వేగవంతమైన పనితీరు కోసం ఈ ఫోన్‌లో 2.4GHz వరకు క్లాక్ స్పీడ్ కలిగిన MediaTek Dimensity 7100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 6GB LPDDR5 RAM, 128GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. వీటికి తోడుగా 6GB వర్చువల్ RAMను పొందవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో థర్డ్ పార్టీ బ్లోట్‌వేర్, ఇంటిగ్రేటెడ్ యాడ్స్ లేకుండా క్లీన్ ఇంటర్‌ఫేస్ అందించారు. ఫోన్ వెనుక 50MP Sony IMX752 ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ ఉన్నాయి. ఇది 2K వీడియో రికార్డింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ప్రో వీడియో, నైట్ మోడ్, డ్యూయల్ వ్యూ వీడియో, మోషన్ ఫోటో, స్పోర్ట్స్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13MP కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే.. 6,000mAh కెపాసిటీతో కూడిన బ్యాటరీని ఇందులో అమర్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే రిటైల్ బాక్స్‌లో 33W ఛార్జర్‌ను అందిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 720 గంటల వరకు స్టాండ్‌బై సమయం లభిస్తుందని కంపెనీ చెబుతోంది. డిజైన్ పరంగా కూడా వెనుక భాగంలో వేగన్ లెదర్ ఫినిష్‌ను అందించారు. ఈ ఫోన్ అంబర్ బ్లూ, హిమ్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. Al-Si DT Star 2 కవర్ గ్లాస్, IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీని కలిగి ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4 వంటి ఆప్షన్లు ఉన్నాయి. లావా తన Vayu AI ఫీచర్లను కూడా ఇందులో అందించింది. అలాగే రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్స్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రకటించింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ దేశవ్యాప్తంగా లావా ఆఫ్‌లైన్ రిటైల్ పార్ట్‌నర్ నెట్‌వర్క్ ద్వారా మాత్రమే అమ్మబడుతుంది. కొనుగోలుదారులకు 'Free Service @ Home' పేరుతో దేశవ్యాప్తంగా డోర్‌స్టెప్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

కేరళ మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణ, అల్లుడు పీఏ మహమ్మద్ రియాస్‌లకు సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. సీఎంఆర్‌ఎల్-ఎక్సాలాజిక్ రూ.278 కోట్ల పే-ఆఫ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు 7 రోజుల పాటు వారికి తాత్కాలిక రక్షణ కల్పించింది. కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ అక్టోబర్ 15 నాటి ఉత్తర్వులను రద్దు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేసే హక్కును పిటిషనర్‌లకు హైకోర్టు నిరాకరించడాన్ని తప్పుబట్టింది. అంనంతరం ఎఫ్‌ఐఆర్‌పై విచారణను 7 రోజుల పాటు నిలిపివేస్త కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎఫ్‌ఐఆర్ యథావిధిగా కొనసాగుతుందని, తదుపరి మధ్యంతర రక్షణపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కేరళ హైకోర్టుకు ఉంటుందని స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే విషయంలో ప్రాథమిక విచారణ ఇంకా జరగలేదని, అలాగే అవినీతి నిరోధక చట్టం కింద అవసరమైన అనుమతులు తీసుకోకపోవడాన్ని సుప్రీం ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

భారత పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అమెరికాకు లేదని స్పష్టం చేశారు. సుంకాలు విధించడం, వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా వలస విధానంలో మార్పులు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నాయని, భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని తెలిపారు. అమెరికా విధిస్తున్న సుంకాలు భారత్‌ను శిక్షించడానికి లేదా ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీయడానికి ఉద్దేశించినవి కావని రూబియో చెప్పారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ఒత్తిడి తీసుకొస్తోందని, ఆ విదేశాంగ విధానంలో భాగంగానే కొన్ని సుంకాల నిర్ణయాలు ఉన్నాయని వివరించారు. అయితే ఇలాంటి చర్యల వల్ల భారత్‌ వంటి కీలక భాగస్వామ్య దేశాలతో ఆర్థిక సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అంగీకరించారు. భారత్‌తో సంబంధాలు అమెరికాకు ఎంతో ముఖ్యమని, ఈ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని రూబియో పేర్కొన్నారు. భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుకు చాలా దగ్గరగా ఉన్నామని రూబియో తెలిపారు. దీనికి నెలలు కాదు.. కొన్ని వారాలే పట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 99 శాతం పని పూర్తయిందని చెప్పారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి అపార్థాలూ తలెత్తకుండా ప్రతి అంశంపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని వివరించారు. వాణిజ్య సంబంధాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం రెండు దేశాలకూ ప్రయోజనకరమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై భారతీయుల్లో నెలకొన్న ఆందోళనలను రూబియో ప్రస్తావిస్తూ ఈ మార్పులు భారత్‌కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు కావని స్పష్టం చేశారు. అమెరికా వలస వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అమెరికాకు వచ్చే వారు చట్టబద్ధమైన విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. కొన్ని వీసా విభాగాల్లో భారతీయ దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం కూడా కారణమని వివరించారు.

తెలంగాణ లోని  నిర్మల్ జిల్లా భైంసాలో దమ్మ చక్ర పరివర్తన కార్యక్రమం డ్యూటీలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ గడపాలె బాబు మృతి చెందారు. నిన్న రాత్రి ఈ ప్రమాదం జరగడంతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోవడంతో సహచర పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పులివెందులలో వైసీపీ నేతల ఆస్తులే టార్గెట్‌గా దాడులు, అరాచకాలు జరగడంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు ఆస్తులు వైసీపీ నేతలు టార్గెట్ చేసి దాడులు అరాచకాలు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారం రోజులుగా పులివెందులతో పాటు చాలా ప్రాంతాల్లోనూ దాడులు చేశారని వ్యాఖ్యానించారు. నామినేషన్ వేయాలంటే, నామినేషన్ పరిశీలన పూర్తి చేసుకోవాలంటే యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వీటన్నిటి నుంచి బయటపడిన ప్రయోజనం లేదని, ప్రశాంతంగా స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే పరిస్థితి లేదన్నారు. నాలుగు రోజుల క్రితం పులివెందులలో ఒక చికెన్ సెంటర్‌ను తగలబెడుతున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయని, అయినా ఇప్పటివరకు నిందితులపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఆ షాపును తగలబెట్టిన టిడిపి నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, షామీరని స్పష్టంగా తెలుస్తున్న ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కౌన్సిల్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి చెందిన చెక్కులను కాల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత స్పష్టంగా దాడులుపై సమాచారం తెలుస్తున్న పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పోలీసులు దగ్గరుండి ప్రోత్సహిస్తూ ఈ దాడులు చేయిస్తున్నారన్న అనుమానం తమకు కలుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ''పోలీసులు అధికార యంత్రం ఇంత బుడిజన్ చేయాల్సిన అవసరం ఎందుకొస్తుందో అని ప్రశ్నిస్తున్నాం. ఒకరిద్దని భయపడితే ప్రచారం చేసుకోకుండా భయపడి వెనక్కి వెళ్తారని వాళ్ళ ఆలోచన. మరో అభివృద్ధి బైక్ కాల్చారు ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించారు. స్థానికులు మేలుకోడంతో అక్కడినుంచి పారిపోయారు. వైసిపి పెడుతున్న భయపడితే ప్రచారానికి రారని ఆలోచిస్తున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన ఘటన సంబంధించి దాదాపు 900 మంది పైన కేసులు పెట్టారు. సంబంధం లేని అరెస్టు చేస్తున్నారు'' అని ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు.

ఇటలీలో హింసాత్మక నిరసనలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఆందోళనల పేరుతో విధ్వంసానికి పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, 20 వేల యూరోల వరకు జరిమానా విధించేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అల్లర్లలో పిల్లలు పాల్గొంటే వారి తల్లిదండ్రులపైనా నష్టపరిహారం చెల్లించే బాధ్యత పెట్టాలని నిర్ణయించింది. మైనర్ల విషయంలోనూ నిఘా, నిర్బంధ చర్యలను కఠినతరం చేసింది. మరోవైపు, మిలాన్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అదనంగా 500 మంది సైనికులను మోహరించనుంది. వారాంతంలో మిలాన్‌తో పాటు ఇటలీలోని పలు నగరాల్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 20న జరిగిన మంత్రిమండలి సమావేశంలో భద్రత, బాల నేరాల నియంత్రణకు సంబంధించిన డిక్రీకి ఆమోదం తెలిపింది. కొత్త డిక్రీ ప్రకారం, నిరసన ప్రదర్శనలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపుగా చేరి రాళ్లు, బాణసంచా లేదా కర్రలు విసిరినా, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడినా ఐదేళ్ల వరకు జైలు శిక్ష, గరిష్ఠంగా 20,000 యూరోల జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ముఖాలను కప్పుకొని హింసకు పాల్పడటం, ఇతరులను గాయపరచడం వంటి సందర్భాల్లో శిక్షలు మరింత పెరిగేలా నిబంధనలు ప్రతిపాదించారు. గుంపులుగా ఏర్పడి ఆస్తులను ధ్వంసం చేసేవారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నారు. సోషల్ మీడియా ద్వారా హింసాత్మక నిరసనలను ప్రేరేపించే, నిర్వహించే వ్యక్తులపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంబంధిత నేరం కింద దోషులుగా తేలిన వారికి 12 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నిర్ణయాల్లో మరో కీలక అంశం మైనర్ల పాత్ర. నిరసనల సమయంలో హింసకు పాల్పడే ప్రమాదం ఉందని అనుమానించిన మైనర్లను ముందస్తుగా నిర్బంధించే నిబంధనలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాల న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అదనపు న్యాయమూర్తులు, నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది. 14 ఏళ్లు దాటిన వారు చేసిన నేరాల విషయంలో, వారు తమ చర్యల గురించి అవగాహన కలిగి ఉన్నారనే ప్రాతిపదికన విచారణ సులభతరం చేసే నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, దీనికి విరుద్ధమైన పరిస్థితులను నిరూపించే అవకాశం ఉంటుంది. పిల్లలు విధ్వంసానికి పాల్పడి ఆస్తులను ధ్వంసం చేస్తే, జరిగిన నష్టానికి పిల్లలతో పాటు తల్లిదండ్రులనూ ఆర్థికంగా బాధ్యులను చేసే అంశం కూడా డిక్రీలో ఉంది. సోషల్ మీడియాలో హింసాత్మక వీడియోలు చూసి కొందరు యువకులు చిన్నచిన్న గుంపులుగా ఏర్పడి విధ్వంసానికి దిగుతున్నారనే ఆందోళనను మెలోనీ వ్యక్తం చేశారు. వస్తువులను పగలగొట్టి, దుకాణాల్లో దొంగతనాలు చేసి, వాటిని వీడియోలు తీసి ప్రచారం చేయడం ప్రమాదకర ధోరణి అని ఆమె పేర్కొన్నారు.

బెంగళూరులోని కేఆర్ పుర ప్రాంతంలోని, కాటమ్ నల్లూరు బ్రిడ్జి సమీపంలో జూలై 23న రూ.3.32 కోట్ల (ఎక్స్‌షోరూ) కంటే ఎక్కువ ఖరీదైన పోర్షే 911 కారును వీఎస్‌టీ మోటార్స్ సర్వీస్ సెంటర్‌కు సర్వీసింగ్ కోసం తీసుకెళ్లారు. ఆ సమయంలో కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సిబ్బంది ఎదురుగా వస్తున్న క్యాబ్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు ప్రకారం ఆయన ఓ ప్రయాణికుడితో కలిసి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్తున్నారు. సర్వీస్ రోడ్ జంక్షన్ వద్ద కుడివైపు మలుపు తీసుకునేందుకు వేగం తగ్గించిన సమయంలో, ఎదురుగా వచ్చిన పోర్షే కారు తన క్యాబ్‌ను ఢీకొట్టిందని ఆరోపించారు. పోర్షే డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెస్ట్ డ్రైవ్ సమయంలో డ్రైవర్ కారు నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని లేదా ఆ కారును నడపడంలో తగినంత అనుభవం లేకపోయి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై కారు యజమాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వీసింగ్ కోసం కారును అప్పగిస్తే సిబ్బంది టెస్ట్ డ్రైవ్ సమయంలో ప్రమాదానికి గురిచేశారని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం వీఎస్‌టీ మోటార్స్‌తో పాటు పోర్షే ఇండియా, పోర్షే జర్మనీ సంస్థలను కూడా సంప్రదించినట్లు తెలిపారు. పలుమార్లు ఈ-మెయిల్స్ పంపినా, సంప్రదించేందుకు ప్రయత్నించినా సరైన పరిష్కారం లభించలేదని ఆరోపించారు. గత కొన్ని వారాలుగా స్పందన కూడా నిలిచిపోయిందని వాపోయారు. పోర్షే 911 వంటి ఖరీదైన కారును కొనుగోలు చేసిన అనుభవం ఎంతో ప్రత్యేకంగా ఉండాల్సింది, కానీ ఇప్పుడు న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను కేవలం మానవ తప్పిదంగా పరిగణించి వదిలేయకుండా, బాధ్యత తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ 2028 నాటికి భర్తీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రథమ లక్ష్యమని, రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే పోలీస్ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీసు శాఖలో 5,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామని వివరించారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా ఒకేసారి 112 మంది డీఎస్పీ పోస్టులను భర్తీ చేయడం అపూర్వమైన ఘట్టమని, మిగిలిన పోస్టులను దశలవారీగా భర్తీ చేస్తామని తెలిపారు. విధినిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే ఎక్స్‌గ్రేషియాను కూడా భారీగా పెంచుతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. బాధ్యతలు నిర్వర్తిస్తూ అమరులైన హోంగార్డుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. ఇతర పోలీసు సిబ్బందికి అందించే ఎక్స్‌గ్రేషియాను సైతం పెంచారు. హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ. 45 లక్షల నుంచి రూ. 1 కోటికి పెంపు చేశారు. ఎస్‌ఐలు, ఇన్‌స్పెక్టర్ల పరిహారాన్ని రూ. 1.25 కోట్లకు పెంచారు. డీఎస్పీలు, అదనపు ఎస్పీలకు రూ. 1.50 కోట్లు, ఎస్పీలు, ఐపీఎస్ అధికారుల కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ. 1 కోటి నుంచి ఏకంగా రూ. 2 కోట్లకు పెంచారు. ఈ ఆర్థిక సాయం అమరవీరుల త్యాగాలకు ప్రభుత్వం అందిస్తోన్న గౌరవమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పెంపునకు సంబంధించి తక్షణమే అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని వేదికపై ఉన్న రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్ల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి వారిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తోన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా హోంగార్డుల నుంచి డీజీపీ స్థాయి అధికారుల పిల్లల వరకు నాణ్యమైన చదువును అందించడానికి 'యంగ్ ఇండియా పోలీస్ స్కూల్'ను నెలకొల్పామని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూనే, పోలీసుల వైఖరి ఎల్లప్పుడూ మానవతా దృక్పథంతో కూడి ఉండాలని సీఎం సూచించారు. ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరించేందుకు టీజీ సేఫ్, అత్యవసర సమయాల్లో తక్షణ రక్షణ కల్పించేందుకు స్పందన బృందాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. మహిళల భద్రత కోసమే కాకుండా సమాజంలో బాధ్యతను పెంచేందుకు షీ టీమ్స్, స్టాండ్ విత్ హర్ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టడంలో నిరంతరం శ్రమిస్తున్న 'ఈగిల్ ఫోర్స్' బృందాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

3