విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిలువునా ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘టామ్కామ్’ ద్వారా జర్మనీలో కొలువులంటూ ప్రచారం చేసి, అమాయక యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన 75 మంది నిరుద్యోగుల నుంచి వీసాలు, పరీక్షల పేరిట ఒక్కొక్కరి వద్ద దాదాపు రూ. 4.5 లక్షల వరకు వసూలు చేసి రెండేళ్లుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ మాటలు నమ్మి తల్లిదండ్రులు, భార్యల మెడలోని పుస్తెలతాడును తాకట్టు పెట్టి డబ్బులు కట్టిన యువకులు.. నేడు ఉద్యోగాలు రాక, మరోవైపు అప్పుల వడ్డీలు కట్టలేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన ఈ ప్రక్రియలో రెండేళ్లు గడిచినా కనీసం ఒక్క అభ్యర్థికీ జర్మన్ కంపెనీతో ఇంటర్వ్యూ ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. బేసిక్ లాంగ్వేజ్ పరీక్ష (B1) పాసైన వారికి మళ్లీ B2 అంటూ కొత్త కొర్రీలు పెడుతున్నారని, తొమ్మిది మంది జర్మనీకి వెళ్తున్నారంటూ ఘనంగా ప్రచారం చేసుకుని తీరా ఒక్కరిని కూడా పంపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఏదైనా సమస్య వస్తే ఏకంగా 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్నో కోర్టుకు వెళ్లాలని అమాయక యువతతో అగ్రిమెంట్లపై బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడం దారుణమని దుయ్యబట్టారు. టామ్కామ్ ద్వారా ఇప్పటివరకు విదేశాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరినా, చట్టబద్ధమైన గడువు దాటినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడం శోచనీయమన్నారు. బాధితులు న్యాయం కోసం కన్నీరు కారుస్తుంటే, కార్మిక శాఖ మంత్రి మాత్రం మొన్న జూన్లో మరో కొత్త బ్యాచ్ను ప్రారంభిస్తూ మాయమాటలు చెప్పడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని, జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందని రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్ రావు నిలదీశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టామ్కామ్ ద్వారా వసూలు చేసిన ప్రతి పైసాను బాధితులకు వెంటనే వాపస్ ఇవ్వడంతో పాటు, రెండేళ్ల విలువైన కాలం వృథా చేసినందుకు, తెచ్చిన అప్పుల వడ్డీల భారం , మానసిక క్షోభకు గురిచేసినందుకు ఒక్కో అభ్యర్థికి తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మోసపోయిన బాధితులందరికీ ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని, టామ్కామ్ కుంభకోణంపై వెంటనే సీఐడీ లేదా న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎంత ఫీజు వసూలు చేశారు, ఎంతమందికి విదేశీ ఉద్యోగాలు ఇచ్చారనే అంశంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని స్పష్టం చేశారు. నిరుద్యోగ కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి వెంటే ఉండి పోరాటం సాగిస్తుందని హరీష్ రావు హెచ్చరించారు.
Home
Harish Rao launches a scathing attack
Revanth Reddy’s government has completely betrayed unemployed youth in the name of overseas jobs
telangana
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను నిలువునా ముంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
Subscribe to:
Post Comments (Atom)
Follow by Email
If you like Articles on this blog, Please subscribe for free via email.
Liên Kết Bạn Bè
Bình Luận Mới Nhất
Trending
Archive
Updates
Wikipedia
Search results
Comments
Recent
Fashion
News
Food
Sports
Tech News $ Scince latest
Food
Technology
Menu Footer Widget
Featured
Videos
Ticker
6/recent/ticker-posts
Comment
Ad Code
THỐNG KÊ BLOGSPOT
Configure Archive
Search This Blog
Advertisement
Masukkan script iklan 300x600px
Menu Atas
About
Ad Space
Business
Recent Post
About Me
NGƯỜI THEO DÕI BLOG
Topik Populer
Translate
Travel the world
Berita Terbaru
Pages
Pages
স্বাগতম! অনলাইনে ইনকাম, ফ্রিল্যান্সিং, এসইও এবং ডিজিটাল মার্কেটিং এর সকল তথ্য পেতে যুক্ত থাকুন টেক বাংলা ইনফো-এর সাথেই থাকুন।

