గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టిన నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు : డ్రమ్ములను నల్లటి ప్లాస్టిక్ కవర్లతో చుట్టి జాగ్రత్తగా భూమిలో పాతిపెట్టిన వైనం

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని గంగానగర్ జోన్, నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్ (బరాయ్‌పూర్) గ్రామంలో డ్రమ్ములను నల్లటి ప్లాస్టిక్ కవర్లతో చుట్టి జాగ్రత్తగా భూమిలో పాతిపెట్టడం దిగ్భ్రాంతి రేపింది. ఇద్దరు సోదరులు గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టిన ఈ నల్లధనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల గ్రామస్థులకు, ఈ సోదరులకు మధ్య గొడవ జరగడంతో ఈ విషయం వెలుగు చూసింది.  ఒక ఇంట్లోని గదిలో దాదాపు 5 మీటర్ల లోతున మూడు భారీ ప్లాస్టిక్ బ్లూడ్రమ్ములో భారీ ఎత్తున నగదు దాచి ఉంచారనే సమాచారం మేరకు నవాబ్‌గంజ్ , సోరావ్ పోలీస్ స్టేషన్ల ఉమ్మడి పోలీస్‌ బృందం దాడి చేసింది. ఈ క్రమంలో ఇంట్లోని ఒక గదిలో ఇటీవల తవ్వినట్లు అనుమానం వచ్చి, కూలీలతో తవ్వించగా లోపల మూడు ప్లాస్టిక్ డ్రమ్ములు బయటపడ్డాయి. ఈ డ్రమ్ములను నల్లటి ప్లాస్టిక్ కవర్లతో చుట్టి జాగ్రత్తగా భూమిలో పాతిపెట్టారు. వాటిని తెరచి చూడగా రూ. 500 నోట్ల కట్టలతో నిండిపోయి ఉన్నాయి. వీటి విలువ రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. డబ్బు లెక్కింపు కోసం ఆదాయపన్ను శాఖ ,ఇతర ఆర్థిక విచారణ సంస్థలకు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాతే కచ్చితమైన సొమ్ము ఎంత అనేది తేలనుంది.

Post a Comment

Previous Post Next Post
3