ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ డిసెంబర్ 12న అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించనున్నారు. 2024 జనవరిలో రామ మందిర ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఆయన ఆలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కానుంది. ఈ విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ నేత పవన్ పాండే శనివారం వెల్లడించారు. డిసెంబర్ 12న అఖిలేశ్ యాదవ్ అయోధ్యకు వస్తారని, ముందుగా హనుమాన్ గఢీ ఆలయంలో ఆంజనేయస్వామి ఆశీస్సులు తీసుకుంటారని పవన్ పాండే తెలిపారు. అనంతరం రామ మందిరాన్ని సందర్శించి రాముడి ఆశీస్సులు పొందుతారని చెప్పారు. ఆయన రాక కోసం ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నామని, ఘనంగా స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు. 2024 జనవరి 22న జరిగిన రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అఖిలేశ్ యాదవ్‌కు ఆహ్వానం అందింది. అయితే, ఆ సమయంలో తన కుటుంబంతో కలిసి మరోసారి ఆలయాన్ని సందర్శిస్తానని ఆయన ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 8న భాగవత కథ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యకు వెళ్లినప్పటికీ రామ మందిరాన్ని సందర్శించలేదు. దీనిపై అధికార బీజేపీ నేతలు విమర్శలు చేశారు. అఖిలేశ్ యాదవ్ ప్రతిపాదిత అయోధ్య పర్యటనపై బీజేపీ స్పందించింది. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేశ్ పర్యటనను ఎన్నికల స్టంట్‌గా బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి అభివర్ణించారు. రామజన్మభూమి ఉద్యమ సమయంలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవహరించిన తీరును రామభక్తులు ఎన్నటికీ మర్చిపోరని విమర్శించారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి రావాలని సమాజ్‌వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలో ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన అయోధ్య పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ డిసెంబర్ 12న అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించనున్నారు. 2024 జనవరిలో రామ మందిర ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఆయన ఆలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కానుంది. ఈ విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ నేత పవన్ పాండే శనివారం వెల్లడించారు.
3
Beranda › Posts filed under Uttar Pradesh
Showing posts with label Uttar Pradesh. Show all posts
Showing posts with label Uttar Pradesh. Show all posts
తనను కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడటాన్ని తట్టుకోలేకపోయిన ప్రియురాలి హత్య చేసిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడిందన్న కక్షతో, ఒక వ్యక్తి ఆమెను దారుణంగా గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌కు చెందిన సేమరీన్ అనే యువతి, ఫిరోజ్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఇటీవల సేమరీన్కు కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయం చేశారు. ఈ విషయం తెలిసి ఫిరోజ్ తీవ్ర తీవ్ర ఆగ్రహానికి, అసంతృప్తికి గురయ్యాడు. తనను కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడటాన్ని తట్టుకోలేకపోయిన ఫిరోజ్, సేమరీన్ను చివరిసారిగా మాట్లాడుకుందామని నమ్మించి పిలిచాడు. అనంతరం ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ఒక పొలంలోకి తీసుకెళ్లి, పెళ్లి విషయమై తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వివాహానికి ఆమె నిరాకరించడంతో ఆవేశంతో రగిలిపోయి, ఆమె గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు పాల్పడిన నిందితుడు ఫిరోజ్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
తొలి వివాహ వార్షికోత్సవానికి ఒక రోజు ముందు ఆత్మహత్యకు పాల్పడిన బీజేపీ నేత కుమారుడు : భార్య ,ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ వీడియో రికార్డ్
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో బీజేపీ నేత కుమారుడు, 26 ఏళ్ల ప్రబల్ గుప్తా తొలి వివాహ వార్షికోత్సవానికి ఒక రోజు ముందు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తన మరణానికి భార్య స్నేహా గుప్తా ,ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను రికార్డ్ చేశాడు. తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించారు. కంకర్ ఖేడా మండల్ ఉపాధ్యక్షుడు రాజీవ్ గుప్తా కుమారుడైన ప్రబల్ గుప్తా (26), ఘాజియాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు. ప్రబల్కు 2025 నవంబర్ 2న, టీపీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహ్తా రోడ్డులో ఉన్న రిషినగర్కు చెందిన స్నేహా గుప్తాతో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే వారిద్దరి మధ్య వివాదం నడుస్తోంది. శనివారం వారు మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్‌కు వెళ్లారు. కౌన్సిలింగ్ సమయంలో, అతని భార్యకు మద్దతుగా నిలిచిన మహిళా ఇన్స్పెక్టర్, ఒక కానిస్టేబుల్ ప్రబల్పై ఒత్తిడి తెచ్చి, అతని పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. స్కూటర్‌పై ఇంటి నుంచి బయలుదేరి, మార్గమధ్యంలో విషపదార్థం సేవించాడు. చనిపోయే ముందు తీసిన వీడియోలో తన భార్య స్నేహ గుప్తా , తండ్రి రాజన్ గుప్తా, సోదరుడు సార్థక్ గుప్తా, అత్త రీనా గుప్తా, ఇతర బంధువులే కారణమని ఆరోపించాడు. కుటుంబ సభ్యులే తన ఆత్మహత్యకు ప్రధాన కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. నవంబర్ 1న విషం తాగి చికిత్స పొందుతూ మరణించారు. విషం తాగడానికి ముందు చాలా ఆవేదనతో ప్రావల్ ఒక వీడియో రికార్డు చేశారు. సీనియర్ పోలీస్ అధికారి శివ్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం... నవంబర్ 1న విషం తాగిన ప్రావల్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవంబర్ 2 రాత్రి మరణించారు. వివాహమైన నాటి నుండి విభేదాలు ఉన్నాయని, ప్రస్తుతం అన్ని కోణాల్లో కేసు విచారణ జరుపుతున్నామని తెలిపారు.
మొబైల్ ఫోన్ రిపేర్ దుకాణంలో హస్తలాఘవం : రూ. 25,000 మొబైల్ చోరీ చేసిన జంట : సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ప్రసిద్ధ హనుమాన్ మార్కెట్ ప్రాంతంలో, పట్టపగలు జనం రద్దీగా ఉండే సమయంలో జరిగిన ఓ దొంగతనం వ్యాపారులందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఓ మొబైల్ ఫోన్ రిపేర్ దుకాణంలోకి కస్టమర్లలా చాలా సాధారణంగా ప్రవేశించిన ఓ యువకుడు, యువతి రెప్పపాటులో అక్కడున్న ఓ ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను దొంగిలించారు. దుకాణంలోని సిబ్బంది, యజమాని ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్న ఆ కొద్ది సెకన్ల వ్యవధిని ఆసరాగా చేసుకుని ఈ జంట తమ చేతివాటం ప్రదర్శించింది. ఈ దొంగతనంలో వారిద్దరి మధ్య ఉన్న పక్కా సమన్వయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దుకాణంలో సుమారు రూ. 25,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఆ యువకుడు ఎవరికీ అనుమానం రాకుండా చాకచక్యంగా చేతిలోకి తీసుకుని, తన వెనుక నిలబడి ఉన్న ఆ యువతికి గుట్టుచప్పుడు కాకుండా అందించాడు. ఫోన్ అందుకున్న మరుక్షణమే, ఆ యువతి ఏమీ జరగనట్లుగా చాలా ప్రశాంతంగా దుకాణం నుంచి బయటకు జారుకుంది. ఈ మొత్తం తతంగం కేవలం కొన్ని సెకన్లలోనే ముగిసిపోవడం ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. కాసేపటి తర్వాత ఫోన్ కనిపించకపోవడంతో కంగుతిన్న దుకాణం యజమాని, వెంటనే దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడు, యువతి ఎంతో పక్కాగా ప్రణాళిక వేసుకుని ఈ దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, వైరల్ అవుతున్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆ దొంగల జంట కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టిన నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు : డ్రమ్ములను నల్లటి ప్లాస్టిక్ కవర్లతో చుట్టి జాగ్రత్తగా భూమిలో పాతిపెట్టిన వైనం
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గంగానగర్ జోన్, నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్ (బరాయ్పూర్) గ్రామంలో డ్రమ్ములను నల్లటి ప్లాస్టిక్ కవర్లతో చుట్టి జాగ్రత్తగా భూమిలో పాతిపెట్టడం దిగ్భ్రాంతి రేపింది. ఇద్దరు సోదరులు గుట్టు చప్పుడు కాకుండా దాచిపెట్టిన ఈ నల్లధనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల గ్రామస్థులకు, ఈ సోదరులకు మధ్య గొడవ జరగడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఒక ఇంట్లోని గదిలో దాదాపు 5 మీటర్ల లోతున మూడు భారీ ప్లాస్టిక్ బ్లూడ్రమ్ములో భారీ ఎత్తున నగదు దాచి ఉంచారనే సమాచారం మేరకు నవాబ్‌గంజ్ , సోరావ్ పోలీస్ స్టేషన్ల ఉమ్మడి పోలీస్ బృందం దాడి చేసింది. ఈ క్రమంలో ఇంట్లోని ఒక గదిలో ఇటీవల తవ్వినట్లు అనుమానం వచ్చి, కూలీలతో తవ్వించగా లోపల మూడు ప్లాస్టిక్ డ్రమ్ములు బయటపడ్డాయి. ఈ డ్రమ్ములను నల్లటి ప్లాస్టిక్ కవర్లతో చుట్టి జాగ్రత్తగా భూమిలో పాతిపెట్టారు. వాటిని తెరచి చూడగా రూ. 500 నోట్ల కట్టలతో నిండిపోయి ఉన్నాయి. వీటి విలువ రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. డబ్బు లెక్కింపు కోసం ఆదాయపన్ను శాఖ ,ఇతర ఆర్థిక విచారణ సంస్థలకు సమాచారం అందించారు. వారు వచ్చిన తర్వాతే కచ్చితమైన సొమ్ము ఎంత అనేది తేలనుంది.
బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగిన 28 ఎమ్మెల్సీ స్థానాలలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి? : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘X’లో పోస్ట్
ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో బ్యాలెట్ పత్రాల ద్వారా శాసన మండలి ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ పనితీరుపై ‘X’ పోస్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగాయని ప్రధానమంత్రి హైలైట్ చేస్తూ, కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందని ప్రశ్నించారు. “నాలుగు పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు కర్ణాటకలలోని 28 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ పత్రాలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి?” అని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ఆ పోస్ట్‌లో మోనోకిల్ ఉన్న ముఖం ఎమోజీని కూడా ఉపయోగించారు.
యూట్యూబర్ అమృత్ సింగ్‌పై కేరళం పోలీసులు కేసు నమోదు : కేఫ్ గురించి చేసిన వ్యాఖ్యలు మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయనే ఆరోపణ
ఉత్తరప్రదేశ్‌కు చెందిన యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమృత్ సింగ్ డారెన్‌పై కేరళం పోలీసులు కేసు నమోదు చేశారు. కొచ్చిలోని ఫోర్ట్ కొచ్చి ప్రాంతంలో ఉన్న ఓ కేఫ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు. ఈ వ్యవహారంపై కేరళం రాజకీయాల్లోనూ చర్చ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. ఫోర్ట్ కొచ్చిలోని కాశీ ఆర్ట్ కేఫ్ గురించి డారెన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ కేఫ్‌లో మహాత్మా గాంధీ చిత్రంతోపాటు పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చిత్రాన్ని ప్రదర్శించడాన్ని ఆయన ప్రశ్నించారు. అక్కడ గొడ్డు మాంసం వడ్డిస్తున్నారని కూడా వెల్లడించారు. అంతేకాకుండా, ఆ ప్రాంతంలో ముస్లింల ఆధిపత్యం తీవ్రంగా ఉందని, కొన్ని వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పలేకపోతున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన వీడియోలోని వ్యాఖ్యలు మతాల మధ్య అనుమానాలు, విద్వేషాలు పెంచే ప్రమాదం ఉందనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళంలో మత విద్వేషానికి చోటు లేదని, రాష్ట్రాన్ని ప్రతికూలంగా చిత్రీకరించి సమాజంలోని వర్గాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను అంగీకరించబోమని పేర్కొన్నారు. సదరు యూట్యూబర్‌పై కేసు నమోదైందని, చట్ట ప్రకారం చర్యలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ అంశంపై కేరళం బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ముఖ్యమంత్రి మత సామరస్యం గురించి మాట్లాడటాన్ని స్వాగతిస్తామన్నారు. అయితే అన్ని మతాల ప్రజల మనోభావాల విషయంలో ఒకే విధమైన సున్నితత్వం ఉండాలని అన్నారు. హిందువులు, దేశ అనుకూల భావాలు కలిగినవారి ఆందోళనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. మత సామరస్యం విషయంలో ఎంపిక చేసుకుని స్పందించడం సరికాదని విమర్శించారు. జిన్నాకు సంబంధించిన కళాకృతి, మతపరమైన మనోభావాలు, హమాస్‌కు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు వంటి అంశాలపై కూడా ప్రభుత్వం సమానంగా స్పందించాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
పాత కక్షలతో వ్యక్తి చేతులు కారు విండోలో ఇరికించి, ఈడ్చుకెళ్లి హత్య చేసిన దుండగులు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అర్రా ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల బీరు సింగ్ ఒక ఆహార ఉత్పత్తుల సంస్థలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 20న రాత్రి 10:30 గంటల సమయంలో బీరు సింగ్ దసరా ఉత్సవాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా, పాత కక్షలు ఉన్న మేవాలాల్, రాజ్వీర్ మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి అతడిని అడ్డగించారు. తొలుత వారి మధ్య గొడవ జరిగి, నిందితులు బీరు సింగ్‌పై దాడికి పాల్పడ్డారు. నిందితుల నుంచి తప్పించుకునేందుకు బీరు సింగ్ ప్రయత్నించగా, వారు తమ కారుతో అతడిని ఢీకొట్టారు. అనంతరం తీవ్రంగా గాయపడిన అతడిని కారు రూఫ్‌పైకి నెట్టి, చేతులను కారు విండోల మధ్యలో ఇరికించి కారును వేగంగా పోనిచ్చి, సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వరకు అలానే ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత అతడిని రోడ్డుపై కింద పడేసి, అతడిపై నుంచి కారు నడిపారు. దీంతో బీరు సింగ్ అక్కడిక్కకడే మృతి చెందాడు. హత్య చేసిన తరువాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
భోజనంలో ఆలూ కూర వడ్డించిందన్న కోపంతో భార్యపై విచక్షణారహితంగా దాడి చేసిన భర్త
ఉత్తరప్రదేశ్‌లోని బదోహి జిల్లాదోమంపుర్ గ్రామంలో భోజనంలో ఆలూ కూర వడ్డించిందని కోపంతో భర్త తన భార్యపై రాక్షసంగా దాడి చేశాడు. ఆమె శరీరంపై పలుచోట్ల కొరుకుతూ, రాయితో తలపై బలంగా బాదడంతో ఆమె తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడిని ఓం ప్రకాష్ విశ్వకర్మగా, బాధితురాలైన అతని భార్యను 40 ఏళ్ల ప్రీతి విశ్వకర్మగా గుర్తించారు. ఆ రోజు రాత్రి ఓం ప్రకాష్ తన భార్యను భోజనం అడిగాడు. ఆమె ఆలూ కూర వడ్డించడంతో, "ఎందుకు ఈ వంట చేశావు?" అంటూ నిలదీశాడు. ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోనే వంట చేసినట్లు ప్రీతి బదులిచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓం ప్రకాష్ ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డాడు. ఆమెను విచక్షణారహితంగా కరిచి, రాళ్లతో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో ప్రీతి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో కుప్పకూలిపోవడంతో, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తల్లి స్పృహ కోల్పోవడంతో భయపడిన చిన్న పిల్లలు రోదించారు. పిల్లల ఏడుపు విని పరుగెత్తుకొచ్చిన ఇరుగు పొరుగు వారు వెంటనే ఆమెను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అదే రాత్రి ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగవుతున్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలు ప్రీతి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడు ఓం ప్రకాష్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109(1) (హత్యాయత్నం), సెక్షన్ 352 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అండర్‌గ్రౌండ్ సంప్ శుభ్రం చేయడానికి దిగిన విద్యార్థులు : విషవాయువు పీల్చి ఊపిరాడక నలుగురు విద్యార్థులు దుర్మరణం
ఉత్తరప్రదేశ్ లోని బృందావన్‌లో ఓ గురుకులంలో అండర్‌గ్రౌండ్ సంప్ శుభ్రం చేయడానికి దిగిన నలుగురు విద్యార్థులు, ట్యాంకులో వెలువడిన విషవాయువు పీల్చి ఊపిరాడక దుర్మరణం చెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా విద్యార్థులను ఇంత ప్రమాదకరమైన పనికి పురమాయించిన గురుకుల యాజమాన్యపు నిర్లక్ష్యమే ఈ ఘోర దుర్ఘటనకు ప్రధాన కారణమని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బృందావన్ గురుకుల ప్రాంగణంలోని భూగర్భ ట్యాంకులో పేరుకుపోయిన వ్యర్థాలను శుభ్రం చేసేందుకు కొందరు విద్యార్థులను రంగంలోకి దించారు. ఆ సమయంలో మొదట ట్యాంకులోకి దిగిన విద్యార్థి, అక్కడ దట్టంగా అలుముకున్న విషవాయువును పీల్చడంతో క్షణాల్లో స్పృహతప్పి కుప్పకూలిపోయాడు. అతడికి ఏమైందో తెలియక, కాపాడాలన్న కంగారుతో ఒకరి వెంట ఒకరు ట్యాంకులోకి దిగిన మిగతా విద్యార్థులు కూడా అదే విషవాయువు ప్రభావానికి గురై లోపలే ఊపిరాడక విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు, పోలీసులు తీవ్రంగా శ్రమించి ట్యాంకులో నుంచి నలుగురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విద్యను అభ్యసించడానికి, సంస్కారాన్ని నేర్చుకోవడానికి గురుకులానికి వచ్చిన విద్యార్థులను ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా విషపూరితమైన భూగర్భ తొట్టిలోకి దింపి బలితీసుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
పట్టపగలే భార్యను, ఆమె ప్రియుడిని తుపాకీతో కాల్చి చంపిన భర్త
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన మార్కెట్ ప్రాంతంలో, తన భార్యను మరియు ఆమె ప్రియుడిని భర్త పట్టపగలే జనం చూస్తుండగానే తుపాకీతో కాల్చి చంపాడు. దుకాణాలతో కిటకిటలాడే ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో, మార్కెట్‌కు వచ్చిన ప్రజలు భయాందోళనలతో పరుగులు తీయడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ఆగ్రాకు చెందిన ఆ దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్న నేపథ్యంలో, ఆ మహిళ వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఘటన జరిగిన రోజు ఆగ్రాలోని ప్రధాన మార్కెట్ ప్రాంతంలో తన ప్రియుడితో కలిసి ఆ మహిళ తిరుగుతోంది. వారిని రహస్యంగా వెంబడించిన భర్త, జనం రద్దీగా ఉండే వీధిలోనే భార్యను, ఆమె ప్రియుడిని ఎదురుగా అడ్డుకుని తీవ్ర వాగ్వాదానికి దిగాడు. గొడవ ముదరడంతో, తన వద్ద రహస్యంగా దాచిపెట్టుకున్న తుపాకీని హఠాత్తుగా బయటకు తీసి.. భార్యపై, ఆమె ప్రియుడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తూటాలు దూసుకెళ్లడంతో వారిద్దరూ రక్తపు మడుగులో కుప్పకూలారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఆగ్రా పోలీసులు, తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన భర్తను ఘటనా స్థలంలోనే పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు.
ప్రియురాలితో రెడ్ హ్యాండెడ్‌గా భార్యకు పట్టుపడ్డ భర్త : భార్యను కారు బానెట్‌పై 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన భర్త
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ప్రియురాలితో కలిసి మోమోస్ తినడానికి వెళ్లిన ఓ భర్త వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసి చివరికి జైలు ఊచలు లెక్కబెట్టే పరిస్థితికి చేరింది. ప్రియురాలితో భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఆమెపైకే కారు దూకించి ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన షాకింగ్ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మయాంక్ అనే వ్యక్తి తన ప్రియురాలిగా చెబుతున్న మహితో కలిసి మీరట్‌లోని ఓ ప్రాంతంలో మోమోస్ తింటుండగా అతని భార్య సునీత నేరుగా అక్కడికి చేరుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. భర్తను మరో మహిళతో చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత, వారి కారు అద్దాలు తడుతూ నిలదీయడం మొదలుపెట్టింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన మయాంక్, వెంటనే కారు డోర్లు లాక్ చేసుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. భర్త పారిపోకుండా అడ్డుకునే క్రమంలో సునీత కారు ముందుకు వచ్చి బానెట్‌పై పడుకుంది. భార్య బానెట్‌పై ఉండగానే కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. "అన్నా కాపాడండి - ఎవరైనా రక్షించండి" అంటూ సునీత భయంతో ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ, దాదాపు 100 మీటర్ల దూరం ఆమెను బానెట్‌పైనే ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు, బాటసారులు పెద్ద సంఖ్యలో గుమిగూడి అడ్డుకోవడంతో మయాంక్ తప్పనిసరి పరిస్థితుల్లో కారును ఆపాల్సి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలు సునీత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా, తనపై దాడి చేసి, వరకట్న వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. భార్యను చంపే ఉద్దేశంతోనే కారును ఆమెపైకి దూకించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో మయాంక్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కొత్వాలి సర్కిల్ ఆఫీసర్ సంగ్రామ్ సింగ్ తెలిపారు. పోలీసులు నిందితుడు మయాంక్‌తో పాటు అతని ప్రియురాలు మహిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఘటనకు ఉపయోగించిన టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ కారును స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More...
పనిమనిషి దొంగతనం చేసిందన్న అనుమానంతో కుర్చీకి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి : సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ లోని హర్దోయి జిల్లా నెక్సరా కాలనీలో ఇంట్లో దొంగతనం జరిగిందన్న అనుమానంతో ఓ మహిళ పనిమనిషిని కుర్చీకి కట్టేసి, కుటుంబ సభ్యులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉపాసన అనే మహిళ ఇంటి పనిమనిషిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో దొంగతనం జరిగిందని యజమానురాలు ఆకాంక్ష, ఆమె కుటుంబ సభ్యులు ఉపాసనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెను బలవంతంగా కుర్చీకి కట్టేసి దారుణంగా కొట్టారు. చేతులతో, చెప్పులతో విరుచుకుపడటమే కాకుండా కర్రలతో చితకబాదారు. ఈ దాడిలో ఓ మహిళ ఏకంగా కర్రతో బాధితురాలి గొంతుపై నొక్కిపెట్టి చిత్రహింసలకు గురి చేసింది. దొంగతనం తానే చేశానని ఒప్పుకోవాలంటూ వారు తీవ్రంగా హింసించారని బాధితురాలు కన్నీరుమున్నీరు అయింది. దాడి అనంతరం బాధితురాలు ఉపాసన కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాడి వీడియోలను చూసిన పోలీసులు వెంటనే స్పందించి, ఆకాంక్షతో పాటు మరో ఐదుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read More...
నోయిడాలో 43వ అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి దుర్మరణం
ఉత్తరప్రదేశ్ లోని నోయిడా సూపర్ నోవా సొసైటీ (సెక్టార్ 94)లో ఉన్న 43వ అంతస్తు నుండి కింద పడి ఒక వ్యక్తి మరణించాడు. మృతుడిని మనేసర్‌కు చెందిన సంభవ్ జైన్‌గా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అతను ఒక రోజు బస కోసం 'ఎయిర్బిఎన్బి'లో గదిని బుక్ చేసుకుని, శుక్రవారం మధ్యాహ్నం ఆ సొసైటీకి చేరుకున్నాడు. సమీపంలోని ఫ్లాట్‌లో ఏసీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది, ఆ వ్యక్తి బాల్కనీ రెయిలింగ్‌కు వేలాడుతూ ఉండటాన్ని గమనించి అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆ వ్యక్తి భవనం పైనుంచి కింద పడి మరణించాడు. కింద పడిన ధాటికి అతని శరీరం రెండు ముక్కలైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read More...
స్కూటీపై కూర్చున్న స్థితిలోనే శవమైన యువకుడు
ఉత్తరప్రదేశ్ లోని మీరట్, టీపీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛావనీ మైదాన్ ప్రాంతంలో ఓ స్కూటర్‌పై కూర్చుని ఉన్న స్థితిలో ఓ యువకుడి మృతదేహం కనిపించింది. స్థానికులు, బాటసారులు దీనిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్కూటర్ నంబర్ ఆధారంగా మృతుడు కంకర్ ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రద్ధాపురి నివాసిగా గుర్తించారు. యువకుడి మృతి అనుమానాస్పదంగా ఉండటంతో, అతనిపై హత్య జరిగి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత, పూర్తి విచారణ అనంతరం మరణానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.
Read More...
కోర్టులోనే భార్యను చితకబాదిన భర్త : సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లా కేంద్రంలో ఉన్న ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలోనే ఓ వ్యక్తి తన భార్యను చితకబాదిన వీడియో వెలుగులోకి వచ్చింది. భరణానికి సంబంధించిన కేసు విచారణ కోసం కోర్టుకు వచ్చిన భార్యపై ఆమె భర్త, అతని అనుచరులు దారుణంగా దాడికి దిగారు. విచారణ ముగిసిన తర్వాత కోర్టు గది నుంచి బయటకు వచ్చిన మహిళ జట్టు పట్టుకుని, కింద పడేసి కొట్టడమే కాకుండా గొంతు నులిమారు. ఈ ఘటన ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో తీవ్ర కలకలం రేపింది. పురందర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమర్ధిరా నివాసి అయిన ప్రియా త్రిపాఠికి, బ్రిజ్ మంజ్ ప్రాంతానికి చెందిన మనీష్ కుమార్ మిశ్రాతో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో ప్రియా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన భరణం కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ప్రియ, ఆమె తండ్రి లక్ష్మీకాంత్, సోదరి ప్రియాంకతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. తండ్రి సాక్ష్యం ముగిసిన అనంతరం వారు కింది అంతస్తులోని హాలులోకి చేరుకోగా.. భర్త మనీష్ మిశ్రా తన సహచరులు ప్రిన్స్ మిశ్రా, సతీష్ మిశ్రాలతో కలిసి దాడికి పాల్పడ్డాడు. దాడి సమయంలో ప్రియను రక్షించేందుకు ముందుకు వచ్చిన ఆమె తండ్రి లక్ష్మీకాంత్, సోదరి ప్రియాంకపై కూడా నిందితులు దాడి చేసి కింద పడేశారు. ఆవరణలో గందరగోళం చెలరేగడంతో అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు వెనక్కి తీసుకోకపోతే ప్రాణాలు తీస్తామని నిందితులు బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బాధితురాలి ఫిర్యాదు, లభించిన వీడియో ఆధారాల ప్రకారం సదర్ కొత్వాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కోర్టు ఆవరణలోనే మహిళపై ఇటువంటి దాడి జరగడంపై స్థానికులు, న్యాయవాదులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Read More...
యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ బస్సు విషాదం : డ్రైవర్, కండక్టర్ నిర్లక్ష్య ధోరణే ఈ విషాదానికి దారి తీసిందని ఆరోపణలు
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చింది. ఈ స్లీపర్ టూరిస్ట్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మంటలు చెలరేగడానికి ముందే కాలిపోతున్న వాసన వస్తోందని పదే పదే హెచ్చిరించినా వినకుండా డ్రైవర్, కండక్టర్ నిర్లక్ష్య ధోరణే ఈ ఘోర విషాదానికి దారి తీసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ నుండి ఉత్తరప్రదేశ్‌లోని మహోబా వెళ్తున్న ఈ బస్సులో ఏదో కాలుతున్న వాసన వస్తున్నట్టు ప్రయాణీకులు బస్సు డ్రైవర్, కండక్టర్‌కి చెప్పారు. బస్సులో ప్రయాణిస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదో కాలుతున్న వాసన వస్తోందని ప్రయాణికులు పదేపదే హెచ్చరించినప్పటికీ వాటిని పట్టించుకోలేదు. అంతేకాకుండా, డ్రైవర్,కండక్టర్ క్యాబిన్లో సిగరెట్లు తాగడం కొనసాగించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే, డ్రైవర్ సీటు సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు కేకలు వేస్తూ బస్సును ఆపమని డ్రైవర్‌ను కోరారు. అయితే, డ్రైవర్ , కండక్టర్ తమలో తాము నవ్వుకుంటూ, ప్రయాణికుల విజ్ఞప్తులను తిరస్కరించి, బస్సు ఆపడానికి నిరాకరించారని ఎఫ్ఐఆర్ నమోదైంది. "మీరు చచ్చిపోయినా పర్వాలేదు, నేను బస్సు ఆపను" అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చినట్లు ఎఫ్ఐఆర్లో నమోదైంది. మంటలు చెలరేగిన తర్వాత డ్రైవర్, కండక్టర్ పరారయ్యారు.అనంతరం బస్సు డ్రైవర్, కండక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ బస్సుపై పలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 60కి పైగా చలాన్లు ఉన్నట్లు తేలింది. ఇంకా సుమారు రూ. 1.7 లక్షల జరిమానాలు చెల్లించాల్సి ఉంది.
Read More...
నీ వల్లే నా అన్న చనిపోయాడని భార్యతో పాటు నలుగురిని తుపాకీతో కాల్చి చంపిన భర్త
ఉత్తర ప్రదేశ్ లోని అజమ్‌గఢ్‌లో అరవింద్ సింగ్ అనే వ్యక్తి తన భార్య, కుమారుడు మరియు ఇంట్లో పూజ చేస్తున్న ఇద్దరు పూజారులతో సహా నలుగురిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన భారత్ అంతటా తీవ్ర దిగ్భ్రాంతిని రేపింది. ఈ ఘోర హత్యల వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన కోణం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. హంతకుడు అరవింద్ పెద్ద అన్న సునీల్ సింగ్ గత 2019వ సంవత్సరంలో హత్యకు గురయ్యాడు. దానికి అరవింద్ భార్య బబితా అక్రమ సంబంధమే కారణమని, బబిత వల్లే తన అన్న చనిపోయాడని అరవింద్ తీవ్ర ఆక్రోశంతో ఉన్నాడు. మరణించిన అన్న ఆత్మ వేధిస్తోందని చెబుతూ బబిత, ఆమె తల్లి కలిసి ఇంట్లో 'మహా మృత్యుంజయ' పూజకు ఏర్పాట్లు చేశారు. మొదటి నుంచీ ఈ పూజను అరవింద్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అక్కడ పూజ జరుగుతుండటం చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అక్కడ ఉన్న పూజారులను గుర్తింపు కార్డులు చూపించమని గద్దించిన అరవింద్, దాన్ని నిలదీసిన భార్యతో "నీ వల్లే నా అన్న హత్యకు గురయ్యాడు, నువ్వేమో ఇక్కడ నాటకాలు ఆడుతున్నావు" అని అరుస్తూ తన సోదరుడి తుపాకీతో భార్యను కాల్చి చంపాడు. అనంతరం ఆ ఇద్దరు పూజారులను కూడా కాల్చివేసి, ఆ తర్వాత గదిలోకి వెళ్లి తన కుమారుల్లో ఒకరిని కాల్చి చంపి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ దారుణ నరమేధం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా గాలిస్తున్నారు.
Read More...
ఉపాధ్యాయురాలిని గన్‌తో కాల్చి చంపిన దుండగుడు : అదే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఒక వ్యక్తి ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపి, అదే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన స్కూల్ విద్యార్థులు, టీచర్లు షాక్ కు గురైయ్యారు. హిదాయత్ నగర్ నివాసి అయిన 26 ఏళ్ల నిషాత్ ఫాతిమా ఏడాదిగా లఖింపూర్ ఖేరీలోని చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నది. సోమవారం ఉదయం 11:30 గంటలకు ఆమెకు తెలిసిన 28 ఏళ్ల మహమ్మద్ సౌద్ ఆ స్కూల్‌కు చేరుకున్నాడు. కారిడార్‌లో ఫాతిమాను కలుసుకుని మాట్లాడాడు. ఉన్నట్టుండి బ్యాగ్ నుంచి తుపాకీ తీసి ఆ టీచర్‌పై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడే తనను తాను గన్‌తో కాల్చుకుని అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ స్కూల్‌కు చేరుకొని పిల్లలను స్కూల్ నుంచి వారి ఇళ్లకు పంపివేశారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత టీచర్ ఫాతిమా, సౌద్ మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఫాతిమా, సౌద్ చాలా కాలంగా ఒకరికొకరు తెలుసని, నిత్యం మాట్లాడుకునేవారని పోలీస్ అధికారిణి ఖ్యాతి గార్గ్ తెలిపారు. అయితే సౌద్ ఎందుకు ఆమెను కాల్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడో అన్నది తెలియలేదని చెప్పారు. ఇరు కుటుంబాలతో పాటు, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, ప్రత్యక్ష సాక్షులు, ఇతరులను విచారిస్తున్నట్లు పోలీస్ అధికారిణి వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
పెన్షన్ డబ్బు కోసం వేధించిన కుమారుడు : కుమారుడు, మనవడుపై యాసిడ్ పోసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరంలో పెన్షన్ డబ్బు కోసం ఇంట్లో రోజూ జరిగే గొడవలు, చివరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి జీవితాలను ఒక్కరోజులోనే నాశనం చేశాయి. మరణించిన తన భర్త పెన్షన్ డబ్బుకు సంబంధించిన విషయంలో వృద్ధురాలికి మరియు ఆమె కుమారుడికి మధ్య చాలా రోజులుగా తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. డబ్బును పూర్తిగా తన ఆధీనంలోనే ఉంచుకోవాలని ఆ తల్లి భావించగా, కుమారుడు మాత్రం అందులో తన వాటా అడుగుతూ నిరంతరం ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వృద్ధురాలు, కన్న కొడుకు, మనవడుపై యాసిడ్ పోసింది. యాసిడ్ పడగానే నొప్పితో వారు వేసిన కేకలు విని ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకుంటూ వచ్చారు. కొడుకు, మనవడిపై యాసిడ్ దాడి చేసిన వెంటనే, ఆ వృద్ధురాలు ఇంటిలోని మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో అల్లాడిపోతున్న ఇద్దరినీ మీరట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)










