3

బోయింగ్ కమర్షియల్‌ విభాగంలో 2500 మంది ఉద్యోగుల తొలగింపు

ప్రముఖ విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ లేఆఫ్స్ ప్రకటించింది. ప్రొడక్స్ట్ సంబంధిత ఛాలెంజెస్‌తో సతమతమవుతూ, కీలక తయారీ టార్గెట్స్‌ను వాయిదా వేస్తున్న నేపథ్యంలో, బోయింగ్ తన కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ సిబ్బందిని సుమారు 5 శాతం మేర తొలగించేందుగు సిద్దమైంది. కంపెనీ ప్రతిపాదించిన ఈ లేఆఫ్స్ వల్ల దాదాపు 2,500 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని అంచనా వేశారు. కంపెనీ కార్యకలాపాలను స్థిరీకరించడానికి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్న ఈ అమెరికన్ ఏరోస్పేస్ దిగ్గజంపై ఇది మరింత ఒత్తిడిని పెంచుతోందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. రిపోర్ట్స్ ప్రకారం, బోయింగ్ కమర్షియల్ ఏరోప్లేన్స్ అధిపతి స్టెఫానీ పోప్, సోమవారం ఒక ఇంటర్నల్ మెమో ద్వారా ఉద్యోగులకు లేఆఫ్స్ గురించి వెల్లడించింది. ఫ్యాక్టరీలు , సప్లైయర్ కార్యాచరణ ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు అదనపు సమయం ఇస్తూ, తమ ప్రొడక్ట్స్ విస్తరణ ప్రణాళికలను మితంగా మార్చేందుకు కంపెనీ ప్రయత్నాల చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ విమానాల సిబ్బందిని సుమారుగా 5 శాతం మేర తగ్గించనున్నట్లు బోయింగ్ తెలిపింది. ఈ సంస్థ తయారు చేస్తున్న బీ737 మ్యాక్స్ విమానాల ఉత్పత్తని పెంచడంలో ఊహించిన దాని కంటే తక్కువ పురోగతని కనిపించడం, ఇతర సవాళ్ల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. బోయింగ్ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే వారిలో కొందరు రిటైర్‌మెంట్ ద్వారా బయటకు వెళ్లనున్నారు, మరికొంత మందికి లేఆఫ్స్ ఇవ్వనున్నారు. లేఆఫ్స్ వల్ల ప్రబావితమయ్యే ఉద్యోగులకు డిసెంబర్ నుండే నోటీసులు అందించనున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో, భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించే ముందు, కనీసం 60 రోజుల ముందే వారికి నోటీసు ఇవ్వాలనే చట్టాలు ఉన్నాయి. బోయింగ్ సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం, సియాటెల్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ఆ సంస్థ కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ విభాగంలో డిసెంబర్ 2025 నాటికి 50,494 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాబట్టి, ఇందులో పనిచేసే 5 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తే, సుమారు 2,500 ఉద్యోగులపై ప్రభావం ఉండవచ్చు.

Related Post

Previous
Next Post »