మోటోరోలా సిగ్నేచర్ 27 స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 5న మోటోరోలా సంస్థ మార్కెట్లో తీసుకువచ్చింది. అత్యంత ఆధునికమైన ప్రాసెసర్, భారీ కెమెరా సెన్సార్, సరికొత్త డిస్ ప్లే టెక్నాలజీ తో ఈ ఫోన్ టెక్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన ఈ ఫోన్ మనదేశంలో ఈ నెలలో విడుదల కాబోతోంది. ఇటీవల ఈ ఫోన్ కు సంబంధించిన హాండ్స్ ఆన్ వివరాలు బయటకు వచ్చాయి. దీంతో దీని ఫీచర్ల మీద ఆసక్తి పెరిగింది. దీనిలో 6.78 అంగుళాల Tandem o LED LTPO డిస్ ప్లే ను అందించినట్టు హాండ్స్ ఆన్ వివరాల ద్వారా తెలుస్తోంది. 120 హెచ్ జెడ్ రీ ప్రెష్ రేట్ తో ఈ ఫోన్ పని చేస్తుంది. స్క్రీన్ గరిష్టంగా 12000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ అందిస్తుంది.. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది. ఎండల కూడా స్క్రీన్ మీద కంటెంట్ స్పష్టంగా కనిపించే విధంగా డిస్ ప్లే ఉపయోగపడుతుంది. కెమెరాకు మోటరోలా ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. 50 మెగాపిక్సల్ సోనీ ఎల్ వై టి ఐ ఏ 910 ప్రైమరీ కెమెరా ఇందులో ఉంది. 200 మెగాపిక్సల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇందులో ఉంది. 50 మెగాపిక్సల్ ఆల్ట్రా వైట్ కెమెరా.. 50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. 200 మెగాపిక్సల్ పెరిస్కోప్ కెమెరా.. 100 ఎక్స్ డిజిటల్ జూమ్ సదుపాయం ఇందులో ఉంది. ప్రత్యేకమైన మోషన్ సెన్సార్ ద్వారా వేగంగా కదిలే వస్తువులను కూడా స్పష్టంగా ఫోటోలు తీయవచ్చు.8 కే రిజల్యూషన్ ద్వారా వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఏఐ ఆధారిత వీడియో enhancement engine వీడియోలలో రంగులను.. నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇందులో qualcomm Snapdragon 8 Elite extreme Gen 6 processor ఉంది. ఇది 2nm టెక్నాలజీతో రూపొందిన చిప్ సెట్. గరిష్టంగా 16 జిబి LPDDR5X ర్యామ్, 1 టీవీ యు ఎఫ్ ఎస్ 4.1 స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్లో 7000 ఎం ఏ హెచ్ భారీ బ్యాటరీ ఉంది. దీనికి 90 డబ్ల్యూ వైరడ్ చార్జింగ్.. 50 డబ్ల్యు వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. రోజు మొత్తం స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారికి ఈ బ్యాటరీ ఉదయకరంగా ఉంటుంది. ఐపీ 68.. ఐపీ సిక్స్టీ నైన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ కూడా ఉన్నాయి. మరో ప్రత్యేకమైన అంశం ఏమిటంటే Bang&Olufsen(B&O) ఆడియో టెక్నాలజీ. మోటరోలా ఫోన్లో తొలిసారిగా ఈ సంస్థ ఆడియో టెక్నాలజీని అందిస్తోంది. ప్రీమియం ఆడియో అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం జరిగింది. ఫోన్ డిజైన్లలో అల్యూమినియం ఫ్రేమ్, ప్రత్యేకమైన బ్యాక్ ప్యానెల్ ఫినిషింగ్ ఆకట్టుకుంటున్నాయి.
3
Beranda
› a massive camera sensor
› and the latest display technology
› business
› cutting-edge processor
› Motorola Signature 27 Smartphone Launched in the Global Market
› November 5th
› technology
› గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన మోటోరోలా సిగ్నేచర్ 27 స్మార్ట్ ఫోన్
Subscribe to:
Post Comments (Atom)
