ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఐదు ప్రెస్ మీట్లు పెట్టి తన విధానాలను కూడా వివరించారు. ఇక మిగిలింది కొత్త పార్టీ పేరు ప్రకటన మాత్రమే. దీనికి రేపు విజయవాడలోని ఏ 1 కన్వెన్షన్ సెంటర్ వేదిక కాబోతోంది. ఉదయం 11 గంటల 11 నిమిషాలకు సాయిరెడ్డి తన కొత్త పార్టీ పేరు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ గతంలో వివిధ పార్టీలు మారిన లేదా హిందూత్వ అనుకూల సిద్దాంతంతో పనిచేస్తున్న నలుగురైదుగురు నాయకులు మాత్రమే విజయసాయిరెడ్డి పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. గతంలో ఫార్మసీ, క్లినికల్ రీసెర్చ్ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి అనుభవం గడించి, అమెరికాలో సైంటిస్టుగా స్థిరపడినా ప్రజా సేవ చేయాలన్న తపనతో మాతృభూమికి తిరిగి వచ్చిన సైంటిస్టు అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఇవాళ సాయిరెడ్డి పెట్టే కొత్త పార్టీలో చేరబోతున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఆయన మినహా మరే ఇతర పార్టీల నుంచి పెద్ద నాయకులు కానీ, కనీసం ద్వితీయశ్రేణి నాయకులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ విజయసాయిరెడ్డి పార్టీలో చేరే అవకాశం కనిపించడం లేదు. సాయిరెడ్డి మాత్రం తన కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున జనం తరలివస్తారని చెప్తున్నారు. ఇప్పటివరకూ ఆ జాడలు అయితే ఎక్కడా కనిపించకపోవడంతో సాయిరెడ్డి రాజకీయ పార్టీ ఏ మేరకు జనంలోకి వెళ్తుంది, ఆయన సిద్దాంతాలన్ని జనం ఎంతవరకూ నమ్ముతారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ ఆయన మాట్లాడిన మాటల్ని బట్టి హిందూత్వ వాదంతో వైసీపీని టార్గెట్ చేసేందుకు సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది. అలాగే కూటమిలో బీజేపీకి అనుకూలంగా తన వైఖరి ఉండేలా కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై సాఫ్ట్ కార్నర్ కలిగిన సాయిరెడ్డి.. వచ్చే ఎన్నికల నాటికి తన పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.
3
Beranda
› A1 Convention Center in Vijayawada will host this event
› Andhra Pradesh
› Announcement of New Party Name by Vijayasai Reddy Tomorrow
› రేపు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ప్రకటన
Subscribe to:
Post Comments (Atom)
