3

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ షెడ్యూల్‌ ను విడుదల చేసిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ : తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న తెలంగాణ

తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్నాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం 27 ప్రధాన క్రీడలతో పాటు ఒక ప్రచార క్రీడ (డిమాన్‌స్ట్రేషన్ స్పోర్ట్) ఉండబోతుంది. 12 రోజుల పాటు జరిగే ఈ గేమ్స్‌లో మొత్తం 6000 మంది క్రీడాకారులు, 1800 మంది సపోర్ట్ స్టాఫ్ పాల్గొనే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోనే ప్రధాన క్రీడా పోటీలు జరగనున్నాయి. బషీర్‌బాగ్‌లోని లాల్‌బహుదుర్ స్టేడియం, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 22 మెడల్ స్పోర్ట్స్ జరగనున్నాయి. మిగతా క్రీడా పోటీలు తెలంగాణలోని ఇతర ఐదు నగరాల్లో నిర్వహించనున్నారు. ఆర్చరీ పోటీలకు ఖమ్మం ఆతిథ్యం ఇవ్వనుండగా, హన్మకొండలో అథ్లెటిక్స్, కరీంనగర్‌లో జుడో, నిజమాబాద్‌లో టేబుల్ టెన్నిస్, మహబూబ్ నగర్‌లో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో స్టాఫ్‌బాల్‌ తొలిసారి అడుగుపెట్టనుండగా, సెయిలింగ్‌ను ప్రచార క్రీడగా ప్రవేశపెట్టారు. జపాన్ ఆసియా గేమ్స్ తర్వాత జరుగుతున్న ఈ టోర్నీ ద్వారా ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని క్రీడా శాఖమంత్రి మాండవీయ తెలిపారు.

Related Post

Previous
Next Post »