సికింద్రాబాద్ లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో డీబీఆర్ షోరూం పక్కన ఉన్న బాణసంచా దుకాణం శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కలవారు చూస్తుండగానే షాపు మొత్తం కొన్ని నిమిషాల్లోనే అగ్నికీలల్లో చిక్కుకుంది. మంటల తీవ్రతకు దుకాణంలో నిల్వ ఉంచిన బాణసంచా భారీ శబ్దాలతో వరుసగా పేలిపోయింది. భారీ శబ్దాలు, దట్టమైన పొగతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో షాపులోని సామాగ్రి, బాణసంచా పూర్తిగా కాలి బూడిదైనట్లు స్థానికులు తెలిపారు. పటాసులు పేలడం మొదలవగానే షాపు నిర్వాహకులు పక్కకు జరగడంతో వారికి ప్రాణ నష్టం తప్పినట్లు తెలుస్తోంది. జనావాసాలు, నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, ఫుట్పాత్లపై ఇటువంటి ప్రమాదకరమైన బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేయడానికి అధికారులు ఎలా అనుమతులు ఇస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుకాణంలో సరైన అగ్నిమాపక భద్రత (Fire Safety) నిబంధనలు పాటించారా లేదా, అసలు ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటా లేక ఇతర కారణాలా అనే అంశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం ఎంత జరిగింది, ఎవరైనా గాయపడ్డారా లేదా ప్రాణనష్టం సంభవించిందా అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడ జరిగిన నష్టంతో పాటు జనావాసాల మధ్య క్రాకర్స్ షాపు నిర్వహణపై అధికారులు దర్యాప్తు చేయనున్నారు. అయితే రద్దీ ప్రాంతాలలో ప్రజల భద్రతకు బాధ్యత వహించేది ఎవరో చెప్పాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
3
Beranda
› crime
› hyderabad
› located next to the DBR showroom
› Major Fire at a Firecracker Shop in Chilakalaguda
› Secunderabad
› telangana
› చిలకలగూడ బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం
Subscribe to:
Post Comments (Atom)
