ఫ్రాన్స్‌లో దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పెరుగుతున్న జీవన వ్యయం, విపరీతమైన ద్రవ్యోల్బణం, పడిపోతున్న వేతనాలు, ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని సుమారు 260 నగరాలు, పట్టణాల్లో ఈ ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంధనం, గ్యాస్, విద్యుత్, అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు, కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలు మాత్రం ఆ స్థాయిలో పెరగడంలేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కనీస వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు పోరాటానికి శ్రీకారం చుట్టాయి. కార్మికుల సమ్మెకు తోడుగా ఫ్రాన్స్ వ్యాప్తంగా హైస్కూల్ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలోకి ప్రవేశించారు. పాఠశాలల్లో క్షీణిస్తున్న మౌలిక వసతులు, కిక్కిరిసిపోయిన తరగతి గదులు, విద్యారంగానికి నిధులు సరిపోకపోవడాన్ని నిరసిస్తూ పారిస్‌తో పాటు పలు ప్రాంతాల్లో విద్యార్థులు నిరసనలు తెలిపారు.
3
Beranda
› employees
› international
› Protests in France Reach a Boiling Point
› Public Outcry Over Cost of Living and Inflation
› students have taken to the streets in large numbers across the country
› workers
› తారాస్థాయికి చేరిన ఫ్రాన్స్‌లో నిరసనలు : జీవన వ్యయం, ద్రవ్యోల్బణంపై ప్రజాగ్రహం
Subscribe to:
Post Comments (Atom)
