About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label 120Hz refresh rate display. Show all posts
Showing posts with label 120Hz refresh rate display. Show all posts

లావా బోల్డ్ ఎన్4 ప్రో 5జీ విడుదల : సెప్టెంబర్ 26 నుంచి అమెజాన్’ ద్వారా అమ్మకాలు ప్రారంభం

దేశీయ మార్కెట్లో లావా మరో కొత్త 5జీ ఫోన్‌ 'లావా బోల్డ్ ఎన్4 ప్రో 5జీ'ను విడుదల చేసింది. గత ఆగస్టులో వచ్చిన బోల్డ్ ఎన్4 లైట్‌కు కొనసాగింపుగా ఈ మోడల్‌ను తీసుకొచ్చారు. 6,000mAh భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ మరియు యానిమేషన్లు అత్యంత స్మూత్‌గా సాగుతాయి. ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇందులో యూనిసాక్ టీ8200 5జీ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 6GB ర్యామ్ + 6GB వర్చువల్ ర్యామ్‌తో పాటు 128GB అంతర్గత స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందించే ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం ఫోన్ వెనుకవైపు ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్‌ను అమర్చారు. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దుమ్ము, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం ఈ డివైజ్‌కు IP64 రేటింగ్ అందించారు. ఇక ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ 6,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ. మొనాకో బ్లూ, ఓపులెంట్ లిలాక్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది. 6GB + 128GB వేరియంట్ రూ.13,999 ధరలో  సెప్టెంబర్ 26 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్’ ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయి.

Read More...

వివో వై 31 టీ 5జీ విడుదల : ఎలాంటి లాంచ్ ఈవెంట్ లేకుండానే అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ వివో వై 31 టీ 5జీని కంపెనీ ఎలాంటి లాంచ్ ఈవెంట్ లేకుండానే అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా చేసింది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా భారీ 7200mAh బ్యాటరీని అందించారు. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, Qualcomm Snapdragon ప్రాసెసర్, 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు IP68, IP69 రేటింగ్‌లను కూడా ఈ ఫోన్‌లో అందించారు. 6.75 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ సమయంలో స్మూత్ అనుభూతిని అందించే అవకాశం ఉంది. డిస్‌ప్లే గరిష్టంగా 1250 నిట్స్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. అలాగే NTSC కలర్ గామట్‌లో 83 శాతం కవరేజ్‌ను కలిగి ఉంది. కళ్లపై బ్లూ లైట్ ప్రభావాన్ని తగ్గించేందుకు TÜV Rheinland Low Blue Light సర్టిఫికేషన్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4nm ప్రాసెస్ ఆధారిత Snapdragon 4 Gen 2 చిప్‌సెట్ ను ఉపయోగించారు. ఇందులో గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఆక్టా-కోర్ CPU ఉంది. మెమరీ పరంగా LPDDR4X RAM, UFS 3.1 స్టోరేజ్‌ను అందించారు. అదనంగా Extended RAM ఫీచర్ ద్వారా 6GB వరకు అదనపు RAMను ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో మల్టీటాస్కింగ్‌లో మెరుగైన పనితీరు లభించే అవకాశం ఉంది. ఫోటోగ్రఫీ కోసం Vivo Y31T 5G వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP బోకె సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో అతిపెద్ద హైలైట్ 7200mAh బ్యాటరీ. బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేసేలా రూపొందించిన ఈ ఫోన్‌కు 44W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 62 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్, 32 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 10.2 గంటల వరకు నావిగేషన్, 11.4 గంటల వరకు గేమింగ్ అందించగలదని కంపెనీ పేర్కొంది. వాస్తవ వినియోగంలో బ్యాటరీ బ్యాకప్ వినియోగ విధానం, నెట్‌వర్క్, సెట్టింగ్స్ వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. ఈ ఫోన్ Android 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. ఇందులో పలు AI ఫీచర్లను కూడా అందించారు. AI Erase, AI Captions, AI Transcript Assist, AI Creation వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అదనంగా AI SuperLink Connectivity ఫీచర్‌ను కూడా అందించారు. 

Read More...

ఫ్లిప్‌కార్ట్ లో వన్‌ప్లస్‌ 13 ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్ !


ఫ్లిప్‌కార్ట్ వన్‌ప్లస్‌ 13 ఆర్‌ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ఆరంభంలో రూ.42,999 ప్రారంభ ధరకు వన్‌ప్లస్‌ విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.38,500 కంటే తక్కువ ధరకు లిస్ట్ చేయబడింది. అంటే రూ.4,000 కంటే ఎక్కువ ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ అనంతరం ఈ ఫోన్ ధర రూ.34,500 తగ్గుతుంది. అంటే మీరు మొత్తంగా 8 వేలు ఆదా చేసుకోవచ్చు. దీనిపై ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.28,550 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ మీకు వర్తిస్తే 3 ఆర్‌ రూ.6 వేలకే మీ సొంతం అవుతుంది. దీనిలో 6.78 అంగుళాల 1.5కే ఓఎల్‌ఈడీ, 120Hz రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 3 ప్రాసెసర్‌, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, ఏఐ పవర్డ్‌ ఆక్సిజన్‌ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌,  6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 80 వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 700 ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌, 50 ఎంపీ టెలిఫొటో కెమెరా, ఐపీ65 రేటింగ్‌, ఆక్వా టచ్‌ 2.0, నాలుగేళ్ల ఓఎస్‌ అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తుంది. 

Read More...