లావా బోల్డ్ ఎన్4 ప్రో 5జీ విడుదల : సెప్టెంబర్ 26 నుంచి అమెజాన్’ ద్వారా అమ్మకాలు ప్రారంభం

Friday, September 18, 2026

000mAh battery 120Hz refresh rate display 6 a 50-megapixel camera business Lava Blaze N4 Pro 5G Launch Sales via Amazon Start September 26 technology

t f B! P L

దేశీయ మార్కెట్లో లావా మరో కొత్త 5జీ ఫోన్‌ 'లావా బోల్డ్ ఎన్4 ప్రో 5జీ'ను విడుదల చేసింది. గత ఆగస్టులో వచ్చిన బోల్డ్ ఎన్4 లైట్‌కు కొనసాగింపుగా ఈ మోడల్‌ను తీసుకొచ్చారు. 6,000mAh భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఆకట్టుకునే ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ మరియు యానిమేషన్లు అత్యంత స్మూత్‌గా సాగుతాయి. ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇందులో యూనిసాక్ టీ8200 5జీ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 6GB ర్యామ్ + 6GB వర్చువల్ ర్యామ్‌తో పాటు 128GB అంతర్గత స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందించే ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం ఫోన్ వెనుకవైపు ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్‌ను అమర్చారు. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దుమ్ము, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం ఈ డివైజ్‌కు IP64 రేటింగ్ అందించారు. ఇక ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ 6,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ. మొనాకో బ్లూ, ఓపులెంట్ లిలాక్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది. 6GB + 128GB వేరియంట్ రూ.13,999 ధరలో  సెప్టెంబర్ 26 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్’ ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయి.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ