ఓటముల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ దాడి చేస్తోంది !

Tuesday, September 29, 2026

Congress is attacking the Election Commission to mask its electoral defeats countered the allegations made by Rahul Gandhi national Smriti Irani

t f B! P L

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోసాలు జరిగాయని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తన ఓటముల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల సంఘంపై దాడి చేస్తోందని స్మృతి ఇరానీ అన్నారు . హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేవని అక్కడ కాంగ్రెస్ ఎన్నికల సంఘం పనితీరును ప్రశ్నిస్తుందా? అని అడిగారు. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇస్తుందా అంటూ ప్రశ్నించారు. 13.3 కోట్ల మంది పేర్లను ఎన్నికల సంఘం తొలగించిందనే ఆరోపణలపై స్మృతి ఇరానీ స్పందిస్తూ.. మరణించిన వ్యక్తి లేదా ఒకే పేరు రెండుసార్లు ఓటర్ల జాబితాలో ఉన్నప్పుడు, ఆ పేర్లను కాంగ్రెస్ ఎందుకు అలాగే ఉంచాలని కోరుకుంటోందని అడిగారు. ఎస్ఐఆర్ కింద నోటీసులు అందుకున్న వారి ఇళ్ల నుంచి పత్రాలు సేకరించి, వ్యక్తిగతంగా ధృవీకరణ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసిందని కూడా ఆమె పేర్కొన్నారు.కాంగ్రెస్ చరిత్రను ప్రస్తావిస్తూ స్మృతి ఇరానీ లాహోర్ కాంగ్రెస్ సమావేశం, ఏఓ హ్యూమ్, బ్రిటిష్ పాలన గురించి చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌ను విమర్శించారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ