ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికార భారతీయ జనతా పార్టీ చేతిలో ఒక "ఉత్సవ విగ్రహంలా " వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఖర్గే స్పష్టం చేశారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థలు అధికార పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇది ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులను కాపాడటానికి, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ కోసం పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలని ఈ సమావేశంలో పిలుపునిచ్చారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ బీజేపీ చేతిలో ఉత్సవ విగ్రహం : ఓటర్ల హక్కులను కాపాడటానికి పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలి : మల్లికార్జున ఖర్గే
Tuesday, September 29, 2026
CEC is a mere figurehead in the hands of the BJP Congress National President Mallikarjun Kharge national party cadres must reach out to the public to safeguard voters' rights
No comments:
Post a Comment