సెన్సెక్స్ 1150 పాయింట్లు, నిఫ్టీ 371 పాయింట్లకుపైగా పతనం

Thursday, September 24, 2026

150 points; Nifty falls more than 371 points business five primary reasons for the losses seen in the market today national Sensex drops over 1 stock market

t f B! P L

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు భారీ పతనం చవిచూస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచే భారతీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాన సూచీల్లో పతనం కనిపించింది. అదే పతనం మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉన్నది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1150 పాయింట్లకుపైగా నష్టంతో 73,677 వద్ద కొనసాగుతున్నది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 371 పాయింట్లకుపైగా నష్టంతో 23,250 స్థాయికంటే దిగువకు చేరింది. ఈ రోజు మార్కెట్లో కనిపిస్తున్న నష్టాలకు ప్రధానంగా ఐదు కారణాలున్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ భారీగా పెరగడం, యూఎస్ 10-సంవత్సరాల బాండ్ రాబడులు 5.11% స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి సెక్యూర్డ్ బాండ్లవైపు నిధులను మళ్లించారు. ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం, అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలలో అనిశ్చితి నెలకొనడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 102.5 డాలర్‌లు దాటింది. ఇది భారత దిగుమతి బిల్లును, ద్రవ్యోల్బణ భయాలను పెంచుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీనత, రాత్రిపూట వాల్‌స్ట్రీట్‌లో టెక్ షేర్లతో సహా డౌ జోన్స్, నాస్‌డాక్‌లలో నష్టాలు నమోదుకావడంతో ఆసియా మార్కెట్లు ఉదయమే 0.6 శాతం క్షీణించి ప్రతికూల సంకేతాలను ఇచ్చాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల అమ్మకాల ఆందోళనలు, గ్లోబల్ వడ్డీ రేట్లు దీర్ఘకాలం గరిష్ఠ స్థాయిల్లోనే ఉంటాయనే అంచనాలతో విదేశీ ఫండ్స్ భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటున్నాయి. బీమారంగ స్టాక్స్‌పై ఆర్‌డీఏఐ నిబంధనల ప్రభావం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బాడీ కమిషన్ నిబంధనలు, చెల్లింపులపై పరిమితులు, ఏజెంట్ల ఖర్చులపై కొత్త ప్రతిపాదనలు తేవడంతో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ వంటి ప్రధాన బీమా కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ తీవ్ర ఒత్తిడి మధ్య, బీఎస్ఈలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఐపీవో షేర్లు రూ.1,800 వద్ద 0.84% స్వల్ప ప్రీమియంతో లిస్ట్ కావడంతో ఇన్వెస్టర్ల దృష్టి దానిపై పడింది. అయితే చమురు ధరల ముప్పు, గ్లోబల్ బాండ్ మార్కెట్ ఒత్తిడి కారణంగా రోజంతా సూచీలు అమ్మకాల ఒత్తిడిలోనే కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ