రూ. 2 కోట్లతో తెరకెక్కిస్తే రూ.400 కోట్లు రాబట్టిన 'హనుమాన్ అంశ్' సినిమా !

Sunday, September 27, 2026

'Hanuman Ansh': A film made on a ₹2 crore budget that raked in ₹400 crore busines cinema film has proven the kind of records that small-budget movies with strong content can set at the box office

t f B! P L

'హనుమాన్ అంశ్' సినిమా ఏకంగా రూ. 400 కోట్లకు చేరువలో కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం రూ. 2 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు ఈ రేంజ్ లో విధ్వంసం సృష్టించడం భారతీయ చిత్ర పరిశ్రమలో అరుదైన సందర్భం అని విశ్లేషకులు అంటున్నారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో ఈ మూవీ నిరూపించింది. ఎలాంటి హైప్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రొమోషన్స్ లేకుండా సైలెంట్ ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజు కేవలం రూ. 10 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక రెండు వారాల్లో వచ్చిన కలెక్షన్స్ కేవలం రూ. 1.50 కోట్లలోపే ఉన్నాయి. కానీ ఆ తర్వాత సీన్‌ పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన మౌత్‌ టాక్‌ తో హనుమాన్‌ అంశ్‌ మూవీ బాక్సాఫీస్ ర్యాంపేజ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు 2026 లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో టాప్‌-3 లోకి చేరింది. దిగ్విజయంగా 50 రోజులకు చేరువవుతున్న హనుమాన్ అంశ్ మూవీ.. 47వ రోజున కూడా దాదాపు రూ. 5 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం ఇప్పటివరకూ రూ. 366 కోట్ల గ్రాస్, రూ. 200 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. త్వరలోనే రూ. 400 కోట్ల క్లబ్ లోకి మూవీ చేరనుంది. అయితే ఈ మూవీ ప్రొడక్షన్ సమయంలో ఎదుర్కొన్న సమస్యలను చిత్ర నిర్మాత అనుప్రియ నగర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ మూవీని ఫస్ట్ లో బాలీవుడ్ లో ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. చాలా మంది నిర్మాతలు ఈ మూవీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించలేదని తెలిపారు. కొత్త డైరెక్టర్.. స్టార్ కాస్ట్ లేకపోవడం.. ఆధ్యాత్మిక జర్నీ లాంటి స్టోరీ కావడంతో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదు. ఈ సినిమా డిజాస్టర్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ హనుమాన్ అంశ్ రిలీజ్ అయ్యాక ఆ ధోరణి మారింది. సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మొదట ఈ సినిమాను తిరస్కరించిన నిర్మాతలు ఆ తర్వాత సినిమాకు వస్తున్న కలెక్షన్స్ గుర్తింపు చూసి తమకు క్షమాపణలు కూడా చెప్పారని గుర్తు చేశారు. ఈ సినిమాలో భాగం కానందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నామని అన్నారని వివరించారు. ఇక హనుమాన్ అంశ్ చిత్రాన్ని విశాల్ చతుర్వేది ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ