మహిళా ఎమ్మెల్యేల పట్ల దాడికి పాల్పడిన పోలీసు అధికారులను వెంటనే గుర్తించండి : డీజీపీ సీవి ఆనంద్‍కు తెలంగాణ హైకోర్టు ఆదేశం

Tuesday, September 29, 2026

Identify police officers who assaulted female MLAs immediately prepare a comprehensive report submit it to the Assembly Speaker Telangana High Court orders DGP CV Anand

t f B! P L

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా శాసనసభ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలీసుల నడుమ జరిగిన ఘర్షణ ఘటనపై పోలీసులు చెప్పినట్లుగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఉన్నత నాయస్థానం తేల్చిచెప్పింది. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన పోలీసు అధికారులను వెంటనే గుర్తించాలని డీజీపీ సీవి ఆనంద్‍కు హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనలో బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా సమగ్ర నివేదికను సిద్దం చేసి అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని డీజీపీకి సూచించింది. ఆ రోజు పోలీసులు అసెంబ్లీ స్పీకర్ ఆదేశాల మేరకే వ్యవహరించి ఉంటే, వారిపై చర్యల వ్యవహారం పూర్తిగా స్పీకర్ అధికార పరిధిలోకి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వివాదంపై విచారణ చేపట్టిన ధర్మాసనం గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. ఈ ఘటనపై హైకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ