సెప్టెంబర్ 30న విజయవాడలో పేదలకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ

Saturday, September 26, 2026

​​Andhra Pradesh CM Chandrababu Naidu will personally participate in the event Distribution of House Regularization Pattas to the Poor in Vijayawada on September 30

t f B! P L

ఈ నెల 30న విజయవాడ వేదికగా భారీ ఎత్తున ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని అర్హులైన 24,057 మంది పేద కుటుంబాలకు ఈ పట్టాలను అందజేయనున్నారు. ఇటీవలే విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించిన పట్టాల పంపిణీ తరహాలోనే విజయవాడలోనూ దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. విజయవాడ నగరంలో దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు లేక వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా నగరంలోని మూడు నియోజకవర్గాల పరిధిలో కొండ ప్రాంతాలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదలకు ఈ పట్టాలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఇది రాజకీయ పార్టీలకు ప్రధాన అజెండాగా, హామీలకే పరిమితమవుతూ వచ్చింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ దీర్ఘకాలిక సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, దశాబ్దాల నిరీక్షణకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ రిజిస్టర్డ్ క్రమబద్ధీకరణ పట్టాలను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో విజయవాడ నగరంతో పాటు పరిసర నియోజకవర్గాల్లోని వేలాది మంది పేదల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండనున్నాయి. ఈ పట్టాల పంపిణీ ద్వారా లబ్ధిదారులకు తమ ఇళ్లపై సర్వహక్కులు దక్కనుండటంతో పాటు, ఆ ఆస్తుల మార్కెట్ విలువ కూడా గణనీయంగా పెరగనుంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి గృహ రుణాలు పొందేందుకు, పిల్లల ఉన్నత చదువులు, ఇతర అత్యవసర ఆర్థిక అవసరాలకు ఈ పట్టాలు చట్టబద్ధమైన సాధనంగా ఉపయోగపడనున్నాయి. 

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ