ఆపరేషన్ చక్ర-VI : 10 రాష్ట్రాల్లో సోదాలు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ

Sunday, September 27, 2026

arrests two individuals CBI conducts raids across 10 states national Operation Chakra-VI Rs 11.42 crore digital arrest case originating in Gujarat

t f B! P L

డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉక్కుపాదం మోపుతోంది. ఆపరేషన్ చక్ర-VIలో భాగంగా గుజరాత్‌కు చెందిన రూ.11.42 కోట్ల భారీ డిజిటల్ అరెస్ట్ కేసుకు సంబంధించి 10 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో సీబీఐ విస్తృత సోదాలు నిర్వహించి, ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కేసులో సైబర్ నేరగాళ్లు పోలీసు అధికారులు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులమంటూ బాధితుడిని నమ్మించి, ఏకంగా మూడు నెలల పాటు 'డిజిటల్ అరెస్ట్' పేరుతో భయబ్రాంతులకు గురిచేశారు. ఆపై తమ ఆధీనంలో ఉన్న వివిధ బ్యాంక్ ఖాతాలకు రూ. 11.42 కోట్లు బదిలీ చేయించుకున్నారు. కేసు నమోదు చేసుకున్న సీబీఐ రంగంలోకి దిగింది. సోదాల అనంతరం ఈ సైబర్ ముఠాలో కీలక పాత్ర పోషించిన హిమాంశు ప్రసాద్, యూనిస్ బిశ్వాస్ అనే ఇద్దరు నిందితులను సీబీఐ అరెస్ట్ చేసింది. వీరు 'M/s Hexaquest Global Pvt. Ltd' కంపెనీ బ్యాంక్ ఖాతాను ఉపయోగించి బాధితుడి నుంచి రూ. 2.5 కోట్లు పొందినట్లు, నిధులను ఇతర ఖాతాలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో కీలక బ్యాంకింగ్ పత్రాలు, డిజిటల్ పరికరాలు, మోసపూరిత చాటింగ్‌లు, ఏపీకే ఫైళ్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ సైబర్ నేర ముఠాలపై కఠిన చర్యలు చేపడుతోంది. ఆపరేషన్ చక్ర-VI లో భాగంగా గత 30 రోజుల్లో సీబీఐ 22 రాష్ట్రాల్లో 142 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి 17 మంది నిందితులను అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా సీబీఐ దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. పోలీసులు, సీబీఐ లేదా ఇతర ప్రభుత్వ సంస్థలేవీ ఎవరినీ ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా డిజిటల్ అరెస్ట్ చేయవని, డబ్బులు డిమాండ్ చేయవని స్పష్టం చేసింది. ఇలాంటి నకిలీ కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సీబీఐ కోరింది.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ