'ఐబొమ్మ' కేసు : రవి బ్యాంకు ఖాతాలను రోజువారీ లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ
Thursday, September 24, 2026
'iBomma' Case Andhra Pradesh court refused to unfreeze the approximately ₹3 crore Nampally Court Allows Ravi to Use Bank Accounts for Daily Transactions telangana
'ఐబొమ్మ' కేసులో పోలీసులు సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను రోజువారీ లావాదేవీల కోసం నిర్వాహకుడు రవి ఉపయోగించుకోవచ్చని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ ఖాతాల్లో ఉన్న సుమారు రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేయడానికి మాత్రం కోర్టు నిరాకరించింది. తన బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ కావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని, కుటుంబాన్ని కూడా పోషించలేకపోతున్నానని రవి తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫ్రీజ్ చేసిన రూ.3 కోట్ల నగదును కూడా వెంటనే రిలీజ్ చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రవి తన అవసరాల నిమిత్తం ఆ బ్యాంకు ఖాతాలను సాధారణ లావాదేవీల కోసం ఉపయోగించుకోవడానికి మాత్రం అనుమతినిచ్చింది. అయితే, ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్ల నగదును విడుదల చేయడానికి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఖాతాలు ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం దక్కినప్పటికీ, ఆ భారీ మొత్తానికి సంబంధించి ప్రస్తుతానికి ఊరట లభించలేదన్న స్పష్టత వచ్చింది.
No comments:
Post a Comment