అక్క వివాహేతర సంబంధాన్ని కుటుంబానికి చెబుతాన్న చెల్లి : ప్రియుడుతో కలిసి చెల్లిని చంపిన అక్క

Monday, September 21, 2026

crime elder sister and her lover kill her Tamil Nadu Vengamedu area of ​​Karur Younger sister threatened to expose elder sister's extramarital affair

t f B! P L

మిళనాడులోని కరూర్‌లోని వెంకమేడు ప్రాంతానికి చెందిన రమేష్‌ కుమార్‌ కుమార్తెలు వినోదిని (21), దాశిని (17). వీరిలో వినోదిని కరూర్‌లోని వెంగ మేడులో ఉన్న కాపర్‌ మార్కెట్లో పనిచేస్తుండగా, దాశిని అక్కడే ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. అయితే 25 రోజుల క్రితం దశిని అదశ్యమైంది. వెంగమేడు పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థిని కోసం గాలించారు. వారు దశిని సోదరి వినోదిని ఉపయోగించిన సెల్‌ఫోన్‌ను పరిశీలించి దర్యాప్తు చేశారు. ఇందులో వినోదిని ఒ​క యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని వెల్లడైంది. పెళ్లయినప్పటికీ వినోదిని వివాహేతర సంబంధంలో చిక్కుకుంది. దీనిని ప్లస్‌-2 విద్యార్థిని దాశిని ఖండించింది. వినోదిని వ్యవహారాన్ని కుటుంబానికి చెబుతానని స్పష్టం చేసింది, దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వినోదిని, ఆమె  ప్రియుడు మోహన్‌రాజ్‌ తో కలిసి ప్లస్‌-2 విద్యార్థినిని దారుణంగా హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ కేసుపై నెల రోజుల దర్యాప్తు అనంతరం పోలీసులు శనివారం వినోదిని, మోహన్‌రాజ్‌ను అరెస్టు చేశారు. కరూర్‌ వెంకమెట్‌ నుండి వంగల్‌ వెళ్లే రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో దర్శినిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని పడేశారని మోహనరాజ్‌ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం కోసం గాలింపు మొదలుపెట్టారు. కరూర్‌ జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ హరి కిరణ్‌ ప్రసాద్‌ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహం కోసం గాలింపును ముమ్మరం చేశారు. 5 గంటలకు పైగా సాగిన గాలించిన అనంతరం విద్యార్థిని దర్శిని మతదేహం లభ్యమైంది. మురుగు కాలువ సమీపంలోని పొదలున్న ప్రాంతంలో దర్శిని మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. ఆమె తల వేరుగా నరికివేయబడి ఉంది. పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం బాగా కుళ్లిపోయి ఉండటంతో, తలను కూడా వేరుగా నరికివేసి ఉంటారని భావించారు. వైద్యులను పిలిపించి అటవీ ప్రాంతంలో విద్యార్థి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ