అక్టోబర్ 8 నుంచి 23 వరకు విజయవాడ ఉత్సవ్, జాతీయ సరస్సు మేళా !

Sunday, September 27, 2026

​​Andhra Pradesh Dasara festivities host both events across the 18-acre Punnami Ghat Kesineni Sivanath MP National Saras Mela from October 8 to 23 Vijayawada Utsav

t f B! P L

దసరా దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడలో భక్తులు, పర్యాటకులు, కళాభిమానులను ఆకట్టుకునేలా విజయవాడ ఉత్సవ్‌, జాతీయ సరస్సు మేళను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. విజయవాడలో మీడియాతో ఎంపీ చిన్ని మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు విజయవాడకు తరలివస్తారని, దుర్గమ్మ ఆశీస్సులతో విజయవాడ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గత ఏడాది విజయవాడ ఉత్సవ్‌ను వైభవంగా నిర్వహించామని, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా లక్షలాది మంది ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు. ప్రజల సహకారంతో గత ఏడాది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ ఏడాది దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు ఎంపీ చిన్ని వెల్లడించారు. అదే సమయంలో అక్టోబర్ 8 నుంచి 23 వరకు జాతీయ సరస్సు మేళ కొనసాగుతుందని తెలిపారు. విజయవాడలోని 18 ఎకరాల పున్నమి ఘాట్ పరిధిలో సరస్సు మేళ, విజయవాడ ఉత్సవ్‌లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మాకినేని బసవపున్నయ్య స్టేడియంలోనూ పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడను సాంస్కృతిక, కళల రాజధానిగా మరోసారి చాటి చెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నామని ఎంపీ చిన్ని తెలిపారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నామని, ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సరస్సు మేళ, విజయవాడ ఉత్సవ్‌, అమ్మవారి దర్శనం కార్యక్రమాలను ఒకే పర్యటనలో ఆస్వాదించేలా అతిథులు, సందర్శకుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఉదయం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని, సాయంత్రం విజయవాడ ఉత్సవ్‌, సరస్సు మేళలో పాల్గొనేలా ప్రజలు తమ రెండు రోజుల షెడ్యూల్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఎంపీ చిన్ని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ఉత్సవ్‌లో పది రోజుల పాటు వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రుచికరమైన వివిధ ప్రాంతాల వంటకాలతో ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మైసూరు ఏనుగులను విజయవాడకు తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ఉత్సవాల నిర్వహణను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారని ఎంపీ చిన్ని తెలిపారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తారని చెప్పారు. భక్తులు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, భద్రత, పారిశుధ్యం, తాగునీరు తదితర అన్ని అంశాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రేపు అంబేద్కర్ కళా వేదికలో విజయవాడ ఉత్సవ్ కర్టన్ రైజర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీ చిన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల్లో నిర్వహించబోయే వివిధ కార్యక్రమాలను మంత్రులు, అధికారులు వివరించనున్నారని చెప్పారు. ఉత్సవాల పూర్తి వివరాలను డ్రాఫ్ట్ రూపంలో మీడియాకు అందిస్తామని తెలిపారు. విజయవాడ ఉత్సవ్‌ను కేవలం ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా దాతలు, సంస్థలు, వివిధ వర్గాల సహకారంతో నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంపీ చిన్ని తెలిపారు. భవిష్యత్‌లో స్వయం సమృద్ధి  మోడల్‌లో విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజలు, మీడియా నుంచి వచ్చే విలువైన సలహాలు, సూచనలను స్వీకరించి ఉత్సవాలను మరింత మెరుగ్గా నిర్వహిస్తామని ఎంపీ చిన్ని తెలిపారు. విజయవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులు ఆధ్యాత్మికతతో పాటు కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆహార వైవిధ్యాన్ని ఆస్వాదించేలా ఈ ఉత్సవాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. దసరా సందర్భంగా విజయవాడకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మికమైన, సాంస్కృతిక అనుభూతిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ