రాయలసీమ వర్సిటీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ శిక్షణ

Monday, September 28, 2026

Andhra Pradesh Collector held a meeting with Ratan Tata Innovation Hub CEO Dr. Hafeez Basha technology Training at Rayalaseema University by Ratan Tata Innovation Hub

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ యూనివర్సిటీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో వివిధ స్టార్టప్, ఇన్నోవేషన్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. సోమవారం రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఆధ్వర్యంలో స్టార్టప్స్‌, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి రాయలసీమ యూనివర్సిటీలో నిర్వహించనున్న ఐదు రోజుల శిక్షణ నిర్వహణపై రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ డా.హఫీజ్ బాషా, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్సిటీ లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారన్నారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ విద్యార్థులు, యువతలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నైపుణ్యాలను పెంపొందించి, వినూత్న ఆలోచనలను స్టార్టప్‌లుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తోందన్నారు. విద్యార్థుల్లో ఇన్నోవేషన్‌, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ వినూత్న ఆలోచనలను స్టార్టప్‌లుగా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అనంతపురం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, కర్నూలు జిల్లాను కూడా తన పరిధిలోకి తీసుకుని స్టార్టప్స్‌, ఎంఎస్‌ఎంఈల డిజిటల్‌ అభివృద్ధికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలు, ఇతర సహాయ సహకారాలను అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. డీఆర్‌డీఏ, మెప్మా తదితర శాఖల సమన్వయంతో 100 మంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సంజీవ రాజు, ఏపిఐఐసి జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, సిపిఓ భారతి, జిల్లా ఉపాధి కల్పన అధికారి దీప్తి, టూరిజం అధికారి తిరుమల నాయుడు, మెప్మా పిడి శ్రీనివాసులు, డి ఆర్ డి ఏ పిడి శ్రీధర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ