లావా షార్క్ 2 ప్రో 5జీ విడుదల

Tuesday, September 29, 2026

1TB via a microSD card 6GB RAM and 128GB storage business Lava Shark 2 Pro 5G Launched Sky Blue and Nanda Silver smart phone technology

t f B! P L

దేశీయ మార్కెట్లోకి ‘లావా షార్క్ 2 ప్రో 5జీ’ని విడుదల చేసింది. దీని  ధర రూ.17,000 లోపు ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్ల వద్ద వివిధ ఫైనాన్షియల్ స్కీమ్‌లతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్కై బ్లూ, నందా సిల్వర్ అనే రెండు కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర 6జీబీ రామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.16,699గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను అందించారు. మెరుగైన పనితీరు కోసం ఫోన్‌లో యూనిసాక్ T8200 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. దీనికి తోడు 6జీబీ రామ్‌తో పాటు మరో 6జీబీ వర్చువల్ రామ్ టెక్నాలజీని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే 128జీబీ ఇస్తుండగా, మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా దీనిని 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు. ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 50ఎంపీ ఏఐ ప్రధాన కెమెరాను పొందుపరిచారు. ఇందులో నైట్ మోడ్, హెచ్‌డీఆర్, పోర్ట్రైట్, ఫిల్మ్, ప్రో మోడ్, మోషన్ ఫోటో వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఒకే సమయంలో రెండు వేర్వేరు యాంగిల్స్ నుంచి వీడియోలను రికార్డ్ చేసే డ్యూయల్-వ్యూ వీడియో ఫీచర్‌ను కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8ఎంపీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో శక్తివంతమైన 6000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 18W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఫోన్ కుడి వైపున సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంది. అంతేకాకుండా ఇది IP64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. లావా కంపెనీ ఇందులో ఎలాంటి ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ లేని క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందించింది. ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్, రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో ప్రత్యేకంగా ‘వాయు ఏఐ’ అసిస్టెంట్‌ను కూడా చేర్చారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ